చార్ మినార్ చూసే దగ్గిర కూడా బ్లాక్ మార్గం…

కొత్త సినిమా రిలీజయినపుడు టికెట్ లు బ్లాక్ లో అమ్ముతుండటమనేది చాలా కామన్.  ఆ తర్వాత బ్లాక్ టికెట్ లలో అంతగా పాపులరయింది తిరుపతి తిరుమల దేవస్థానం. ఇక్కడ శ్రీవారి దర్శనం టికెట్లను విపరీతంగా బ్లాక్ అమ్ముకున్నారు. ఈ కుంభకోణం ఆ మధ్య  టిటిడిని కుదిపేసింది.ఎంక్వయిరీలు జరిగాయి. చాలా తలకాయలు ఎగిరిపోయాయి.
 ఇక్కడ తప్ప మనకు బ్లాక్ టికెట్ గొడవ   మరొక చోట కనిపించదు. తాజాగా హైదరాబాద్ చార్ మినార్ చూసేందుకు కూడా ఇపుడు బ్లాక్  మార్గం ఏర్పడింది.
ఈ విషయం  ఒక ఇంగ్లీష్  దినపత్రిక దర్యాప్తులో వెల్లడయింది.
చార్ మినార్ ను  కరోనా పాండెమిక్ లో  మూసేశారు.మొన్నఅక్టోబర్ లో తెరిచారు. మెల్లి మెల్లిగా సందర్శకులు రావడం మొదలయింది. ఇపుడు రోజుకు 2000 నుంచి 2500 దాకా సందర్శకులు వస్తున్నారు.
చార్ మినార్ దగ్గిర  ఆన్ లైన్ టిికెటింగ్ విధానం అమలులో ఉంది. అయితే ఇపుడక్కడ ఆన్ లైన్ టికెట్లతో సంబంధం లేేకుండా రు.25 వసూలు చేసుకుని సందర్శకులను లోనికి అనుమతిస్తున్నారు.
సాధారణంగా భారతీయులకయితే ఎంట్రీఫీజు టికెట్ ధర  రు. 25. విదేశీయులకయితే రు. 300. ఇపుడు అక్కడ వూన్న పురాతత్వ శాఖ ఉద్యోగులు తామే డబ్బు వసూలు చేసుకుని సందర్శకులను అనుమతిస్తున్నారు.  ఇదేమిటని ప్రశ్నిస్తే, పై అధికారులు చెప్పారు, తాము చేస్తున్నామని తమతో చెప్పినట్లు ఈ పత్రిక రాసింది.
ఎక్కువ మంది సందర్శకులు తాకిిడి ఉంటే 400 సంవ్సరాల పైబడి చరిత్ర ఉన్న ఈ చారిత్రక కట్టడానికి ముప్పువాటిల్లుతుందని భావించి పరిమితంగా సందర్శకులను అనుమతించేందుకు ఆన్ లైన్ టికెటింగ్ విధానం పెట్టారు.
అయితే, సందర్శకులు ఎక్కువగా రావడం లేదుకాబట్టి, వస్తున్న వారి నుంచి టికెట్ డబ్బులు వసూలు చేసి అధికారులు జేబులు నింపుకుంటున్నారు ఇలా. ఎంత కక్కుర్తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *