ఇక యుద్ధమేనా?: కేంద్రం మీద విరచుకుపడిన కెటిఆర్

అవి నల్లచట్టాలు అని రాష్ట్ర మునిసిపల్, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు హూంకరించారు.
ఈ ఉదయం ముఖ్యమంత్రి కెసిఆర్  భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు అని ప్రకటించగానే టిఆర్ ఎస్ నేతలు ఒకరొకరు కేంద్రం మీద నిప్పులు చిమ్ముతున్నారు.  ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతున్నారు. డిసెంబర్ 8 భారత్ బంద్ ను విజయవంతంచేయాలని క్యాడర్ కు, ప్రజలకు పిలుపునిచ్చారు.
కొద్ది సేపటి కింద కెటిఆర్ ఆ  చట్టాలు నల్ల చట్టాలని ప్రకటించారు.
మోదీ ప్రభుత్వం ఈ వ్యవసాయబల్లులను రాజ్యసభలో కేంద్రం మందబలంతో బిల్లులను ఆమోదింపజేసుకుందని, తాము పార్లమెంట్ వేదికగా కేంద్ర వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించామని గుర్తు చేశారు.
ఎముకలు కొరికే చలిలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కేంద్రంతో పోరాడుతున్న వారికి సంఘీభావంగా టీఆర్ఎస్ శ్రేణులు ఎల్లుండి బంద్ లో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. అంతేకాదు,బపోరాటం చేస్తున్న రైతులకు టీఆర్ఎస్ పార్టీ సెల్యూట్ చేస్తున్నదని ప్రకటించారు.
 ఇది మంచి పరిణామమే. కాకపోతే, జిహెచ్ ఎంసి ఎన్నికల తర్వాత టిఆర్ ఎస్ లో వచ్చిన హఠాత్పరణామం. కేంద్రంలో మోదీ వచ్చార రైతులు పోరాడటం ఇది మొదటి సారి. తమిళనాడు రైతులు నెలల తరబడి పుర్రెలతో ప్రదర్శన చేశారు. మలమూత్రాలు తాగారు. కార్మిక సంఘాలు ఎన్నో సార్లు బంద్ లు నిర్వహించారు. ఎపుడు ఇంతా యుద్ధ భేరి మోగించని టిఆర్ ఎస్ ఇపుడు యుద్ధానికి సై అంది. ఇంతవరకు టిఆర్ ఎస్ విమర్శ  కేవలం బహిరంగ సభల్లో ప్రకటనలకే,ట్విట్టర్ కు  పరిమితమయింది. ఇపుడు జిహెచ్ ఎంసి ఎన్నికల తర్వాత టిఆర్ ఎస్ పోరాడుతున్న రైతులతో చేయి కలుపుతూ ఉంది. తదుపరి ప్రతిపక్ష పార్టీలతో కలుస్తుందేమో చూడాలి.
కెటి ఆర్ ఇంకా ఏమన్నారో చూడండి
ఢిల్లీ రైతులకు మద్దతుగా తెలంగాణ రైతుబంధు సమితి సభ్యులు రైతులను కదిలించాలి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు మా విన్నపం .. రైతులకు సంఘీభావంగా 2 గంటలు బంద్ చేయండి. కేంద్ర చట్టాలతో రైతు ఎలా ఇబ్బంది పడుతున్నాడో చూడండి.  కార్పోరేట్లకు వ్యవసాయం ధారాదత్తం చేసే కుట్రలను వివరించండి. మోటారు వాహనాల యజమానులు బంద్ కు సహకరించాలి
టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు జాతీయ రహదారులపై మోహరించి ధర్నా, రాస్తారోకోలతో మద్దతు తెలపాలి. ఈ నల్లచట్టాలు పోయేదాకా రైతులకు టీఆర్ఎస్ అండగా నిలుస్తుంది. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా రైతులకు మద్దతుగా నిలుద్దాం
భారత రైతాంగం తలపెట్టిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ మద్దతు పలుకుతుంది. మమ్మల్ని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఈ దేశ రైతాంగానికి దారి చూపే శక్తి తెలంగాణ నుండి కేసీఆర్ గారి రూపంలో ఉంటుందని భావిస్తున్నాం
రైతాంగం ఆత్మ విశ్వాసంతో నిలిపింది కేసీఆర్ గారి ప్రభుత్వమే. వ్యవసాయరంగం మీద దాదాపు రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. దీనిమూలంగానే తెలంగాణ స్థిరపడినం, బలపడినం. కేంద్ర నిర్ణయాలు దేశానికి ఉపయోగపడతాయి అనుకుంటే వ్యవసాయ చట్టాలు రైతుపై పిడుగులా పడ్డాయి
వ్యవసాయ చట్టాలలో ఏ మాత్రం రైతు కోణం లేదు.దేశంలో వివిధ సంస్థలు అమ్మిన కేంద్రం .. ఇప్పుడు కీలకమైన ఆహారరంగం మీద దృష్టిపెట్టింది.. దీనిని కార్పోరేట్ కు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నది. ధాన్యానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అదనపు ధర ఇస్తే కొనుగోళ్లు ఆపేస్తామని కేంద్రం బ్లాక్ మెయిల్ చేస్తున్నది.రాష్ట్రం అదనపు ధర ఇస్తే అభినందించాల్సింది పోయి అడ్డుకుంటుంది
తెలంగాణ పత్తి దేశంలో నంబర్ వన్ అని , అక్కడ పండిన పంట అంతా కొంటాం అని సీసీఐ తెలిపింది. ఇప్పుడు కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులే రావాలి, వారి రక్తసంబంధీకులే రావాలి అని నిబంధన పెట్టారు. ఇది రైతులను ఇబ్బంది పెట్టడమే. కోటీ 3 లక్షలలో గత వానాకాలం, యాసంగిలో వరి పండింది. ప్రాజెక్టులన్నీ పూర్తయితే ప్రతి కారుకు కోటి ఎకరాలలో వరి సాగయ్యే అవకాశం ఉంది
పెరుగుతున్న వ్యవసాయ దిగుబడులను ప్రోత్సహించాల్సిన కేంద్రం కార్పోరేట్లకు లాభం చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటుంది. కేంద్రంతో పోరాడుతున్న రైతాంగానికి టీఆర్ఎస్ , తెలంగాణ యావన్మంది రైతాంగం మద్దతు తెలుపుతున్నాయి. ఎల్లుండి ప్రతి గ్రామంలో రైతులు కేంద్ర వ్యవసాయ చట్టాలపై చర్చ చేయాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *