నిమ్మగడ్డ మీద ప్రివిలేజ్ కేసు సాధ్యం కాదు: మాజీ మంత్రి సోమిరెడ్డి

సభాహక్కుల ఉల్లంఘన ఎమ్మెల్యేల విషయంలో మాత్రమే వర్తిస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కువర్తించందని మాజీ టిడిపి మత్రి సోమిరెడ్డిచంద్రమోహన్ రెడ్డి అన్నారు. గతంలో ఇలాంటి ప్రయత్నాలు చేసినపుడు కోర్టుల నుంచి చివాట్లు ఎదురయ్యాయని ఆయన ఉదాహరణలతో వివరించారు.

మాజీ ఇన్ ఫర్మేషన్ కమిషనర్ విజయబాబు, ఇతర మంత్రులు పదే పదే మహారాష్ట్ర కేసును ప్రస్తావించడాన్ని ఆయన తప్పుపట్టారు. మహారాష్ట్ర కేసులో   కమిషనర్ మీద ప్రివిలేజ్ మోషన్ ప్రతిపాదించిన వారిని సుప్రీంకోర్టు తప్పుపట్టిందని సోమిరెడ్డి తెలిపారు.

స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పై ఇద్దరు మంత్రులు స్పీకర్ కు ఫిర్యాదు చేయడం, ఆయన ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేయడం, కమిటీ ఈ రోజు సమావేశం కావడం, మళ్లీ వాయిదా వేయడం అన్నీ ఆశ్చర్యంగా ఉన్నాయని, ఈ రోజు జరిగిన  ప్రివిలేజ్ కమిటీ సమావేశాన్ని ప్రస్తావిస్తూ సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 ప్రివిలేజేస్ అండ్ ఇమ్యూనిటీ కింద శాసనసభ్యులు స్వేచ్ఛగా మాట్లాడటంతో పాటు, స్వతంత్రంగా ఓటు వేసే హక్కు కల్పిస్తోంది. ఆ ఆర్టికల్ ప్రకారం ఎమ్మెల్యేల హక్కును ఎవరూ తప్పుపట్టేందుకు అవకాశం లేదు. కోర్టులకు కూడా సమీక్షించే అధికారం లేదు. మంత్రి పదవి అనేది ఒక పొలిటికల్ పోస్ట్. వారు ప్రభుత్వంలో ఒక భాగం. రాజ్యాంగబద్ధ సంస్థ ఎలక్షన్ కమిషన్ పై విచ్చలవిడిగా రాజకీయ విమర్శలు చేసినపుడు  వాటి  మీద కమిషనర్  గవర్నర్ కు ఫిర్యాదు చేయడం తప్పా,’ అని సోమిరెడ్డి ప్రశ్నించారు.

సోమిరెడ్డి ఇంకా ఏమన్నారంటే…

ఎన్నికల కమిషన్ ను వైసిపి మంత్రులు బహిరంగంగా విమర్శించారు. ఆయన బహిరంగంగానే గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఇందులో బాధపడేందుకు ఏముంది?

1983లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో శాసనమండలిలో ‘ఈనాడు’ రామోజీరావుపై రోశయ్య ప్రివిలైజ్ మోషన్ మూవ్ చేశారు. చివరకు హైకోర్టు స్టే ఇవ్వగా, సుప్రీం కోర్టు కూడా సమర్ధించింది..

2007లో తమిళనాడు సీఎంగా జయలలిత ఉన్న సమయంలో ‘ది హిందూ’, ‘మురసోలి’ పత్రికలపైనా ప్రివిలైజ్ మోషన్ మూవ్ చేసినా కోర్టులు తప్పుపట్టాయి.

ఏపీలో హిందూ, జమీన్ రైతు పత్రికలకూ ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు కూడా కోర్టులు స్టే విధించాయి.

మహారాష్ట్రలో విలాస్ రావు దేశముఖ్ సీఎంగా ఉన్న సమయంలో ఎస్ఈసీ నంద్ లాల్ (2008)  పై కక్ష కట్టి రెండు రోజులు జైలు శిక్ష వేశారు. ఈ రోజు జైలుకు పంపి రేపు ఉదయాన్నే వదిలేశారు. మహారాష్ట్ర శాసనసభ చర్యను సాక్షాత్తు సుప్రీంకోర్టే తప్పుపట్టింది.

ఇవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా ఎస్ఈసీని విచ్చలవిడిగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ మళ్లీ ఆయనపైనే ఫిర్యాదులా?

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *