అబ్బో తెగ తాగుతున్నారు, డ్రంక్ డ్రైవింగ్ అక్టోబర్ వసూళ్లు రు. 2 కోట్లు పైబడే

తాగి నడపొద్దండని పోలీసులు  చేస్తున్న ప్రచారానికి తోడు విపరీతంగా ఫైన్ వేస్తున్నా  హైదరాబాద్ యువకుల అలవాటు మారుతున్నట్లు లేదు.
దీనికి సాక్ష్యం ట్రాఫిక్ పోలీసులకు భారీగా వసూలవుతున్న ఫైన్ మొత్తమే.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తాగి వాహనం నడుపుతూ పట్టు బడ్డ వారినుంచి ట్రాఫిక్ పోలీసులు ఒక్క అక్టోబర్ నెలలోనే రు.1.71 కోట్ల వసూలు చేశారు.
ఇక సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పట్టుబడిన వారు చెల్లించింది రు. 44.62లక్షలు.
హైదరాబాద్ , సైబరాబాద్ కమిషనరేట్ పరిధుల్ల కలిపితే రు.2.15 కోట్లన్నమాట. ఇంత భారీగా వసులూ కావడం ఇదే మొదటసారి అంటున్నారు.
హైదరాబాద్ ట్రాఫిక్  పోలీసులు విడుదల చేసిన డేటా ప్రకారం అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్య 1,744 మంది మద్యం సేవించి డ్రైవ్ చేస్తూ పోలీసులకు చిక్కారు.
ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి వీరంతా డ్రైవ్ చేస్తున్నారని వీరి మీద నాంపల్లిలోని మూడవ,నాలుగవ మెట్రో పాలిటన్ కోర్టులలో కేసులు పెట్టారు.
ఇందులో 282 మందికి కోర్టు ఒక రోజు నుంచి 10  రోజులు దాకా జైలు శిక్ష విధించింది. నలుగురి డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దు చేశారు.
జైలు శిక్ష పడినవారందరిని చంచల్ గూడ్ జైలుకుపంపించారరని అడిషనల్ కమిషనర్  డిఎస్ చౌహాన్ చెప్పారు.
ఇకసైబరాబాద్ కు సంబంధించి 1415 మంది డ్రంక్ డ్రైవింగ్ కేసులు పెట్టారు. వీరిలో 263 మంది అవుటర్ రింగ్ రోడ్ లో దొరికినవారు.  144 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది.