చంద్రబాబుకి నాకు తేడా ఏంటంటే…. జగన్

వైసిపి ప్రభుత్వానికి , చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వానికి చాాలా తేడా ఉందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. గతంలో సభలో ప్రతిపక్ష నేతని పట్టించుకోలేదని, మాట్లాడే అవకాశ మీయలేదని చె చెబుతూ  ఈ రోజు స్పీకర్ గా తమ్మినేనిసీతారం ఎన్నిక సందర్భంగా అసెంబ్లీలో జగిగిన చర్చలో పాల్గొంటూ ఆయన ఈ విషయం చెప్పారు.

సభలో చర్చ ఈ రోజు ఫిరాయింపుల మీదకు మళ్లింది. తెలుగుదేశం సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫిరాయింపుల మీద చేసిన ప్రస్తావన ఆసక్తికరమయినచర్చకు దారితీసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలోజరిగిన  ఫిరాయింపుల ప్రస్తావతన తీసుకురాగనే సభలో వైసిపి సభ్యులు  అభ్యంతరం చెప్పారు. అపుడు జగన్ జోక్యంచేసుకుంటూ తనకు, టిడిపి అధినేతకు ఉన్నతేడా గురించి చెప్పారు.

‘ సభా సంప్రదాయాలను గత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వని పరిస్థితి గతంలో కన్పించింది.గత ప్రభుత్వం అనుసరించిన తీరుతో నేను ఎలా ఉండాలనే మీమాంస కలిగింది.కానీ గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను నేను అనుసరిస్తే మంచి అనేదే లేకుండా పోతుంది,’ ఆయన చెప్పారు.

ఫిరాయింపులను ప్రొత్సహిస్తే చంద్రబాబుకు తనకి తేడా ఉండదని చెబుతూ తాను ఫిరాయింపులను ప్రోత్సహించనని కూడా ఆయన స్పస్టం చేశారు.

’గతంలో 23 మంది ఎమ్మెల్యేలను ఫిరాయించేలా ప్రొత్సహించారు, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇచ్చారు.ఫిరాయింపు చట్టాన్ని పట్టించుకోలేదు.ఫిరాయింపు చట్ట ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కోరినా పట్టనట్టు వ్యవహరించింది నాటి ప్రభుత్వం,’ గత ప్రభుత్వం అనుసరించిన తీరు సభకు గుర్తు చేశారు.

దేవుడి స్క్రిప్ట్ చాలా గొప్పదని అంటూ  23 మంది ఎమ్మెల్యేలను కొన్నారు.. 3 ఎంపీలను కొన్నారు.. అటువంటి పార్టీకు 23 వ తేదీనే  23 సీట్లు, మూడు ఎంపిలు వచ్చేలా చేసి ఈ అయిదేళ్లు ఫిరాయింపులు చంద్రబాబుకు రోజూ గుర్తుకు వచ్చేలా చేశాయని అన్నారు.

బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ.. బ్యూటీ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఎలా ఉంటుందో ఈ సభను చూస్తే తెలుస్తోందని జగన్ అన్నారు.

విలువలు కాపాడే ప్రయత్నంలో భాగంగానే తమ్మినేని ఎన్నుకున్నామని అంటూ స్పీకర్ ఎలా ఉండకూడదో గత ప్రభుత్వం నిరూపిస్తే.. స్పీకర్ ఎలా ఉండాలో ఈ ప్రభుత్వం ఆదర్శంగా ఉంటామని అన్నారు.

బీసీలకు పెద్ద పీట వేసే క్రమంలో తమ్మినేనిని స్పీకర్ ఛైర్లో కూర్చొబెట్టామని చెబుతూ టీడీపీ నుంచి ఎవరినైనా ఎమ్మెల్యేలను మేం తీసుకుంటే రాజీనామా చేయించే తీసుకుంటామని చెప్పారు.

‘23 మంది ఎమ్మెల్యేలే ఉన్న టీడీపీ నుంచి ఓ ఐదుగురును తీసుకుంటే ప్రధాన ప్రతిపక్షం హోదా ఉండదు. మేం ఎవరినైనా పక్క పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటే రాజీనామా చేయిస్తాం,’ అని అన్నారు.

తాము అనుకుని ఉంటే చంద్రబాబునాయుడికి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా రాదని, ఒక అయిదుగురిని లాగేసుకోవడం ఏమంత పెద్ద పనికాదని అన్నారు. ఇలా చేసి ఉంటే తనకు చంద్రబాబు కు తేడా లేకుండా పోయి ఉండేదని జగన్ చెప్పారు.