మంత్రి పదవులు రాని వాళ్లకి పెద్ద పదవులు, ఆళ్లకి సిఆర్ డిఎ

మంత్రి పదవులు మిస్సయిన వైసిపి ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పెద్ద పదవులు ఇచ్చి అసంతృప్తి లేకుండా బుజ్జగిస్తున్నారు.
మంగళగిరి జెయింట్ కిల్లర్  ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఆయన ప్రతిష్టాత్మకమయిన పదవి ఇస్తారని సమాచారం. ఆళ్లని అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవెలప్ మెంట్ అధారిటీ ఛెయిర్మన్ ను చేస్తారని వినికిడి.
చంద్రబాబు కుమారుడు నారాలోకేష్ మీద పోటీ చేసి ఆళ్ల మంగళగిరి ఎమ్మెల్యే అయ్యారు. ఈ ప్రచారం సమయంలో గెలిస్తే ఆళ్లకు మంత్రి పదవి ఖాయమని ఆయన ప్రకటించారు. అయితే, అఖండ విజయంతర్వాత,రాష్ట్రంలోని ప్రతికులం తనను మద్దతనిచ్చిందని చెబుతూ అన్నికులాలకు ఆయన క్యాబినెట్ లో పెద్ద పీటవేయడంతో ఆళ్లకి, మంత్రి పదవిరాలేదు ఇపుడాయనకి సిఆర్ డిఎ పదవి అందిస్తారని తెలిసింది.
ఇదే విధంగా మంత్రి పదవి ఆశించిన నగరి ఎమ్మెల్యే రోజాను నిన్న ఎపిఐఐసి చెయిర్ పర్సన్ ని చేసిన సంగతి తెలిసిందే.
ఇదేలా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని ఖరారు చేశారు.
ఇప్పుడు తాజాగా ఆళ్ల‌కు సీఆర్డీయే (కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ) చైర్మన్ పదవిని అప్పగించాలని నిర్ణయించినట్లు స‌మాచారం.
మరో రెండు రోజుల్లో జగన్ ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకొనున్నట్లు సమాచారం. దీనిపై సీఎం అధికారులకు ఉత్తర్వులు వెలువడనున్నాయని మీడియా చెబుతున్నది.
ప్రాంతీయ మండళ్లు
రాష్ట్రాభివృద్ధిని వేగం చేసేలా ఐదు ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేస్తారని వాటికి ఐదుగురిని  చైర్మన్లుగా నియమిస్తారని చెబుతున్నారు
గత ప్రభుత్వంలో  రాష్ట్రమంటే అమరావతి కావడంతో ఇతర ప్రాంతాల అభివృద్ది గురించి చర్చయే లేదు. ప్రయివేటు విద్యాసంస్థల నుంచి ఆసుప్రతులు, కేంద్ర, రాష్ట్ర కార్యాలయాలు అన్నింటిని అమరావతిలోనే కుక్కి గాని‘గోబల్ సిటి’ అని పిలిచే ప్రయత్నం జరిగింది. ఇపుడు జగన్ ఈమోడల్ నుంచి దూరంగా జరగుతున్నారు. ఆయన అమరావతిని వికేంద్రీకరించబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందుకే అన్ని ప్రాంతాలకు అభివృద్ధిమండళ్లు ఏర్పాటుచేస్తారని అధికారులుచెబుతున్నారు.
ఉత్తరాంధ, మధ్యకోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలతో పాటు అమరావతి మండళ్లుంటాయని తెలిసింది.