నరహంతక నయీమ్ ఆస్తులెన్నో తెలుసా?

(కోసిక వినయ్ కుమార్)

గ్యాంగ్ స్టర్ నయీమ్ అంటే తెలియని వారు ఉండరు. ఇంత పెద్ద రాష్ట్రంలో, ఇంతమంది పోలీసులున్నా,  నయీమ్ చక్కగా దశాబ్దం పాటు తన హత్యలు, బెదరింపులు, కిడ్నాపులు, వస్లూళ్లు చేశాడు.

ఏమయిందో ఏమో  అతగాడి కథ ఒక  ఎన్కౌంటర్ లో ముగిసింది. ఆ తర్వాత నయీమ్ కూడబెట్టిన ఆస్తులు, ఆయన స్నేహితులు, అయిన వాళ్లు, ఆత్మీయులందరి పేర్లు బయటకొచ్చాయి. ఆయన  ఆస్తుల విలువ ఎంత ? నయీమ్ ఎంత మందిని బెదిరించి ఆస్తులు సంపాదించారు? క్యాషెంత, గోల్డెంత, నగదు ఎంత, భూములెన్నీ, బంగ్లాలు,ప్లాట్లు,తోటలు ఎన్నున్నాయి, ఎక్కడెడున్నాయ్,  ఇప్పుడు ఆ ఆస్తులు ఎవరి అధీనంలో ఉన్నాయి? ఇలా చాలా ప్రశ్నలు, అనుమానాలు ప్రజల్లో ఉన్నాయ్. నయీమ్ ఎపిసోడ్ ముందు నుండి ఫాలో అవుతున్న వారిని వెంటాడుతున్న ప్రశ్నలు అన్నీ ఇన్నీ కాదు.

విశాఖతీరంలో ఆగని విధ్వంసం

దీనికి సంబంధించి ఇటీవల ఒక్క వార్త చెకర్లు కొడుతున్నది.

2016 ఆగస్టులో ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్‌ నయీముద్దీన్ ఆస్తుల విలువ అక్షరాలా రెండు వేల కోట్ల రూపాయలుగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) లెక్క తేల్చిందనేది ఈ వార్త.

1019 ఎకరాల వ్యవసాయ భూములు, 29 భవనాలు, రెండు కిలోల బంగారం, రెండు కోట్ల నగదు ఉన్నట్లు సిట్ గుర్తించిందట.

తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా, ముంబైలలో ఉన్న ఇళ్లు, స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు అనుసరించాల్సిన మార్గంపై సిట్ న్యాయశాఖ నుంచి ఇప్పటికే సలహా కూడా తీసుకుందనీ,నయీమ్‌కు సంబంధించిన ఆస్తులన్నీ ప్రస్తుతం కోర్టు అధీనంలో ఉన్నాయనీ కూడా ప్రచారంలోకి వచ్చింది.

అతగాడి మీద మొత్తం 251 కేసులు నమోదు కాగా, వాటిలో 119 కేసుల్లో దర్యాప్తు పూర్తయింది. మరో 60 కేసులు కొలిక్కి రావాల్సి ఉంది. మరి కొద్దీ రోజుల్లో నయీమ్‌ కేసు దర్యాప్తును సిట్‌ ముగించనుంది.

నయీమ్‌ తన భార్య, సోదరి, అత్త, అనుచరుల పేర్లపైనే ఆస్తులు కూడబెట్టగా భార్యతోపాటు సోదరి, అతడి దగ్గరి బంధువుల పేర్లపై ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకునేలా సిట్‌ అధారాలు సేకరించింది.

ఆస్తుల ప్రస్తుత మార్కెట్‌ విలువను పరిశీలిస్తే… హైదరాబాద్‌లోని అల్కపురి కాలనీలో రెండు ఇళ్ల విలువ రూ. 6 కోట్లు. మణికొండలోని పంచవటి కాలనీలో 8 ప్లాట్ల విలువ సుమారు రూ. 4-5 కోట్లుగా అంచనా.

పుప్పాలగూడలో 300 గజాల చొప్పున 12 ఓపెన్‌ ప్లాట్ల విలువ సుమారు రూ. 6 కోట్లు. షాద్‌నగర్‌లోని 12 ఎకరాల మామిడి తోట, ఫాంహౌస్‌ల విలువ సుమారు రూ. 25 కోట్లు. తుక్కుగూడలోని 10 ఎకరాల తోట, ఫాంహౌస్‌ విలువ సుమారు రూ. 35 కోట్లు.

నాగోల్, సరూర్‌నగర్‌లో ఓ సెటిల్‌మెంట్లో నయీమ్‌ అనుచరులు శేషన్న, శ్రీధర్‌ల పేరిట ఉన్న రెండు ఫంక్షన్‌ హాళ్ల విలువ సుమారు రూ. 6 కోట్లు. శంషాబాద్‌లోని పోలీస్‌హౌస్‌ విలువ రూ. 2 కోట్లు.

నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత సిట్‌ విచారణలో 210 మంది బాధితులు తమ భూములపై ఫిర్యాదు చేయగా వాటిలో ఆధారాలు గుర్తించింది 46 కేసుల్లోనే. ప్రస్తుతం ఆ ఆస్తుల జప్తు కోసం సిట్‌ సమాయత్తమవుతోంది.

నయీమ్‌ మొత్తం 1,019 ఎకరాల భూమి సంపాదించినట్లు గుర్తించినా ఈ కేసుల్లో ఆధారాలు దొరక్క అధికారులు తంటాలు పడుతున్నారట…

ఈ వార్త కూడా చదవండి

https://trendingtelugunews.com/nayeem-gang-illegal-business/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *