టైమ్ 100 : ఇమ్రాన్ ఖాన్ నచ్చాడు, ఇండియాకు చోటు లేదు

ఈ ఏడాది టైమ్ 100-2019 లో భారతీయ రాజకీయనాయకులెవరికీ చోటు దొరకలేదు.

టైమ్ మ్యాగజైన్ ప్రతిసంవత్సంర ప్రపంచంలో 100 మంది అత్యంత పలుకుబడి సంపాదించిన వ్యక్తుల పేర్లతో జాబితా విడుదల చేస్తుంది.

తాజాగా ‘100 Most Influential People’ of 2019 విడుదల చేసింది.

ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరుగాని, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పేరుగాని లేవు. ఇంత పెద్ద భారతదేశంలో ఒక్కరు కూడా టైమ్ మ్యాగజైన్ కొలబద్దకు చిక్కలేదు. ఇతర రంగాలనుంచి కొందరిని ఎంపిక చేశారు.

పయెనీర్స్,అర్టిస్ట్స్, లీడర్స్, ఐకాన్స్,టైటాన్స్ క్యాటగిరి ల కింద ప్రపంచాన్నిఆకట్టకున్న వారి పేర్లను 2019 కోసం ఎంపిక చేశారు.

‘పయోనీర్స్’ లో భారతదేశానికి సంబంధించి ఇద్దరు మహిళలను, అరంధతి కత్జూ, మేనకా గురుస్వామిలను ఎంపిక చేశారు. వీరిద్దరు న్యాయవాదులు. ఎల్ జిబిటి హక్కుల కోసం అరుంధతి, మేనకలు చేపట్టిన క్యాంపెయిన్ వల్ల 157 సంవత్సరాల కింద రూపొందిన ఒక బూజుపట్టిన చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 377 ప్రకారం అసహజ లైంగిక కార్యకలాపాలు చట్ట వ్యతిరేకం. దీని మీద లోతైన పరిశోధన చేసి, అరుంథతి , మేనకలు ఈ సెక్షన్ ఎలా సమాజంలోని ఒక వర్గం హక్కులను కాలరాస్తుందో వాదించి కోర్టును వప్పించారు. దీనితో 157 సంవత్సరాల పాత చట్టం వదిలించుకోగలిదింది దేశం. అరుంధతి, మేనక గురించి నటి ప్రియాంక చోప్రా చక్కటి పరిచయం రాశారు.

తర్వాత భారతదేశానికి చోటు దక్కిది ‘టైటాన్స్’ వర్గంలో. ఇందులో మార్క్ జుకెర్ బర్గ్, టైగర్ వూడ్స్, మెహమెద్ సలా వంటి 15 మంది ప్రముఖలు సరసన ముఖేష్ అంబానీ కి చోటుదక్కింది.

ఇందులో ముఖేష్ అంబానీ గురించి ఆనంద్ మహీంద్ర పరిచయ వాక్యాలు రాశారు.

ముఖేష్ అంబానీ , తండ్రి ధీరుబాయ్ అంబానీ కంటే ఎక్కవ ఆశయం ఉన్నవాడని చెబుతూ రిలయన్స్ జియో గురించి ప్రత్యేకంగా ఆనంద్ మహీంద్ర ప్రస్తావించారు.

తక్కువ ధరకు 4G సర్వీసులను సర్వ వ్యాపితం చేసిన రిలయన్స్ జియో ఏ విధంగా తీసుకున్నా మన మీద ముద్రవేస్తుందని ఆయన అన్నారు. ఎన్ని రకాల బిజినెస్ ఏరియాలలో రిలయన్స్ ఆదిపత్యం ఉందో తెలిస్తే ఆశ్చర్యానికి గురి కాకతప్పదని ఆయన రాశారు.

లీడర్లలో భారతీయులు లేకపోవడం వెలితిగా కనిపిస్తుంది.

దానికితో డు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఇందులో చోటు దక్కింది. టైమ్ మ్యాగజైన్ ఎంపిక చేసిన influential people లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్, మహతీర్ మొహమద్, నాన్సి పెలాసి, జెసిండా అర్డెర్న్, బెంజమిన్ నెతన్యాహు, సైరిల్ రామఫోజా, పోప్ ఫ్రాన్సిస్.. మొత్తం 26 మంది నాయకులున్నారు.

భారతీయులెవరూ లేరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *