దేశానికే స్ఫూర్తినిచ్చే విధంగా, డా. బీఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా “తెలంగాణ దళిత బంధు” అమలు చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ఈ రోజు ఆయన దళిత బంధు పథక అవగాహన సదస్సులో ప్రసంగించారు.
దళితుల సాధికారత కోసం నిర్విరామంగా కృషి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన దళితులతో కలిసి భోజనం చేశారు.
దళిత బంధు పథకం ద్వారా లబ్ది పొందే అర్హులకు గుర్తింపు కార్డును అందిస్తాం. ప్రతీ లబ్ధిదారునికి ప్రత్యేకమైన బార్ కోడ్ తో కూడిన ఎలక్ట్రానిక్ చిప్ ను ఐడీ కార్డులో చేర్చి పథకం అమలు తీరును ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందుపరుస్తాం. నిరంతర పర్యవేక్షణ ద్వారా ఎటువంటి ఒడిదుడుకులు రాకుంట జాగ్రత్తలు తీసుంటం. లబ్ధి దారుడు తను ఎంచుకున్న పని ద్వారా ఆర్థికంగా ఎదగాలి తప్ప జారి పడనివ్వం అని సీఎం కెసిఆర్ అన్నారు.