కెసిఆర్ ‘దళిత బంధు’ పథకం వల్ల ఏంప్రయోజనాలున్నాయ్!

తెలంగాణ దళిత బంధు పథకానికి   అర్హులైన లబ్ధిదారులకు ఏలాంటి ప్రయోజనాలు నెరవేరతాయో ఉదహరిస్తూ ఎస్సీ సంక్షేమ శాఖ వివరాలందించింది.

గ్రామీణ, ఉప పట్టణ, పట్టణ ప్రాంతాల్లో లబ్దిదారులు ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో వ్యాపార, ఉపాధి, రంగాలను గుర్తించింది. వాటి వివరాలు

దళితబంధు పథకం ఆర్ధికాభివృద్ధి పథకాల జాబితా :

రూరల్ (గ్రామీణ) ప్రాంతాల్లో..

మినీ డెయిరీ యూనిట్, పందిరి కూరగాయల సాగు, వరినాటు యంత్రాలతోపాటు పవర్ టిల్లర్, వేపనూనె పిండి తయారీ, ఆటో ట్రాలీ పథకాలున్నాయి.

రూరల్ (గ్రామీణ), ఉప పట్టణ (సబ్ అర్బన్) ప్రాంతాల్లో..

సాగు యంత్ర పరికరాల సేల్స్, మట్టి ఇటుకల తయారీతోపాటు ఆటో ట్రాలీ, ట్రాక్టర్, ట్రాలీ, కోళ్ల పెంపకంతోపాటు ఆటో ట్రాలీ (సుగుణ, వెంకోబ్ ఫ్రాంచైసీ) పథకాలున్నాయి.

రూరల్ (గ్రామీణ), సబ్ అర్బన్ ( ఉప పట్టణ), అర్బన్ (పట్టణ) ప్రాంతాల్లో..

సెవన్ సీటర్ ఆటో, ప్యాసింజర్ ఆటో రిక్షా, త్రీ వీలర్ ఆటో ట్రాలీ, విత్తనాలు/ఎరువుల, క్రిమిసంహారక మందుల దుకాణం (ప్రభుత్వ అనుమతితో), టెంట్ హౌస్ తో సహా డెకొరేషన్ లైటింగ్, సౌండ్ సిస్టమ్ తోపాటు, ఆటో ట్రాలీ, మడిగల నిర్మాణం మరియు వ్యాపారం, ఆయిల్ మిల్, పసుపు, కారం, బియ్యం పిండి గిర్నీల పథకాలున్నాయి.

సబ్ అర్బన్ ( ఉప పట్టణ), అర్బన్ (పట్టణ) ప్రాంతాల్లో..

ప్రయాణీకులు/సరుకుల రవాణాకు నాలుగు చక్రాల వాహనం, ఎలక్ట్రానిక్ గూడ్స్ సేల్స్, డయాగ్నస్టిక్ ల్యాబ్ మరియు మెడికల్ షాప్, ఎలక్ట్రికల్ షాప్, బ్యాటరీ సేల్స్ అండ్ సర్వీసెస్, హార్డ్ వేర్ సానిటరీ షాప్ తోపాటు ఆటో, సిమెంట్ ఇటుకలు/ రింగుల తయారీ ప్రి కాస్టింగ్ స్ట్రక్చర్ తోపాటు ఆటో ట్రాలీ, సెంట్రింగ్/ఆర్.సి.సి. రూఫ్ మేకింగ్ (స్టీల్, వుడెన్), కాంక్రీట్ రెడీ మిక్స్ తయారీ యంత్రం, అకృలిక్ షీట్స్, టైల్స్ వ్యాపారంతోపాటు ఆటో ట్రాలీ పథకాలున్నాయి.

హోటల్, క్యాటరింగ్ (ధాబా)తోపాటు ఆటో ట్రాలీ, ఐరన్ గేట్స్, గ్రిల్స్ తయారీ యూనిట్ తో పాటు ఆటో ట్రాలీ, మెడికల్ – జనరల్ స్టోర్స్ (ప్రభుత్వ అనుమతితో), మినీ సూపర్ బజార్, డీటీపీ, మీసేవ, సీఎస్సీ ఆన్ లైన్ సర్వీస్, ఫొటో స్టుడియో, బిల్డింగ్ మెటీరియల్ స్టోర్స్/హార్డ్ వేర్, మార్బుల్, పాలిషింగ్ / గ్రానైట్ కటింగ్ / పీఓపీ, ఫుడ్ రెస్టారెంట్, సిమెంట్ / స్టీల్ దుకాణం (సబ్ డీలర్ షిప్), పశువులు, కోళ్లదాణా తయారీ కేంద్రంతోపాటు ఆటో ట్రాలీ, చెప్పులు/లెదర్ గూడ్స్ షాపు, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ డ్రోన్ కెమెరా (అన్ని ఫంక్షన్ల కోసం), ప్రభుత్వ అనుమతులతో రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లకు కూరగాయలు, ఆహార పదార్థాల సరఫరా కోసం 2 ఆటో ట్రాలీలను అందించే పథకాలున్నాయి.

పట్టణ (అర్బన్) ప్రాంతాల్లో..

మొబైల్ టిఫిన్ సెంటర్ (4 వీలర్స్), క్లాత్ ఎంపోరియం – టెక్స్ టైల్, రెడీమేడ్ గార్మెంట్స్ షోరూం, పేపర్ ప్లేట్స్/గ్లాసెస్, బ్యాగ్స్, తయారీ యూనిట్ (ఆటో ట్రాలీతో కలిపి), కార్ టాక్సీ (క్యాబ్), ఎంబ్రాయిడరీ, టైలరింగ్, లేడీస్ ఎంపోరియం, కిచెన్ వేర్ – ఫర్నీచర్ షాప్ (సేల్స్, సర్వీస్), ఫ్లెక్సీ, వినైల్ డిజిటల్ ప్రింటింగ్ (ఆటో ట్రాలీతో కలిపి), డిజిటల్ ఫొటో స్టుడియో – ల్యాబ్, ఆటో మొబైల్ షాప్-సర్వీసింగ్ యూనిట్, డిస్పోజబుల్ పేపర్ ప్లేట్స్, గ్లాసెస్, పేపర్ న్యాప్కిన్స్ సేల్స్ షాపు మొదలైన పథకాలున్నాయి.

ఈ పథకాల తమకు అనువైనవేవో ఎంచుకుని దళిత సమాజం సభ్యులు ప్రభుత్వం సాయం పొందవచ్చు.

ఈ రోజు ప్రగతి భవన్ లో జరిగిన దళిత బంధు అవగాహన సదస్సుకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున దళితులను ఆహ్వానించి ఈ పథకం గురించి అవగాహన కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *