ప్రపంచంలో అత్యధికంగా వ్యాక్సిన్ లను తయారుచేసే దేశం భారత దేశమే. ప్రపంచంలోనె నెంబర వన్ వ్యాక్సిన్ తయారీ దారులున్న దేశం భారతదేశమే. పల్స్ పోలియో వంటి ప్రపంచ వ్యాపిత వ్యాక్సిన్ ప్రోగ్రాంలు విజయవంతమయ్యాయంటే భారతదేశంలోని వ్యాక్సిన్ తయారీదారులే కారణం. అయితే, ఇపుడు భారతదేశం వ్యాక్సిన్ లకోసం నానా ఆగచాట్లు పడాల్సి వస్తున్నది. ఇక్కడ వ్యాక్సిన్ లు అవసరమయినన్ని తయారుకావడం లేదు. కొందామంటే అంతర్జాతీయ మార్కెట్లో స్టాక్ లేదు.
కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తూన్న సమయంలో తగినన్ని వాక్సిన్ లను భారతీయ కంపెనీలు తయారు చేయలేకపోతున్నాయి. వ్యాక్సిన్ తయారీ కెపాసిటీ పెంచుకోవాలని సీరమ్ ఇన్ స్టిట్యూట్ కు, భారత్ బయోటెక్ కు కేంద్రం పోయిన నెలలో భారీగా అడ్వాన్స్ లిచ్చింది. అవేవీ తక్షణావసరాలకు పనికిరావు.
దీనితో భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రొగ్రాం బలహీనపడిపోయింది. రోజూ వ్యాక్సిన్ తీసుకుంటున్నవారి సంఖ్య పడిపోతావుంది. మరొక వైపు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గ్లోబల్ టెండర్లు ఆహ్వానించి వ్యాక్సిన్ తెప్పిస్తామని ప్రకటించారు.
హిందూస్తాన్ టైమ్స్ లో వచ్చిన ఒక రిపోర్టు ప్రకారం మొత్తం 10 రాష్ట్రాలు వ్యాక్సిన్ దిగుమతి చేసుకునేందుకు సిద్దమయ్యాయి. వాటిలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్,రాజస్థాన్, ఒదిషాలు, ఢిల్లీ, పంజాబ్ కూడా ఉన్నాయి. అయితే, ఈ రాష్ట్రాలకు సప్లై చేసేందకు సిద్ధంగా ఉన్నా ప్రపంచంలో ఎక్కడా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. చాలా కాలం దాకా దొరక్క పోవచ్చు. ఎందుకంటే చాలా దేశాలు ముందుగానే బుక్ చేసుకున్నాయి.
తమ దగ్గిర ముందే బుక్ చేసుకున్న దేశాలకు సప్లయి చేశాక, మిగిలితే నే ఇతర దేశాలకు సరఫరా చేస్తామని అమెరికాకు చెందిన వ్యాక్సిన్ కంపెనీలు ప్రకటించేశారు. ఈ విషయం మీద కేంద్ర స్పష్టమయిన ప్రకటన చేసింది.
“వ్యాక్సిన్ లు తయారు చేస్తున్న ఫైజర్, మాడెర్నాలు తమ అర్డర్ బుక్స్ ఫుల్ అయినట్లు ప్రకటించాయి. ఈ కంపెనీల దగ్గిర వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చినపుడే వాటికి అప్రూవల్స్ ఇచ్చే విషయంలో ఆలోచిస్తా”మని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ వెల్లడించారు.
తమ అర్డర్ బుక్స్ ఫుల్ అయ్యాయని, వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే తామే భారత ప్రభుత్వానికి తెలియచేస్తామని ఫైజర్, మాడెర్నా కంపెనీలు చెప్పినట్లు అగర్వాల్ చెప్పారు. ఈ కంపెనీలు భారత ప్రభుత్వాన్ని సంప్రదిస్తూనే వ్యాక్సిన్ లు రాష్ట్రాలకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు
“Their order books are already full. It is depending on their surplus-how much they can provide to India, they will come back to the Government of India and we’ll ensure, facilitate supply at the state level.”
ఆంధ్ర తెలంగాణలకు మరొక సమస్య
ఇతర సరుకులు దిగుమతి చేసుకున్నట్లు రాష్ట్రాలు నేరుగా వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకోలేవు. వాటిని దేశంలోకి రప్పించాలంటే కేంద్ర అనుమతులు , పరీక్షలు అవసరం. ఇది కూడా చాలా పెద్దపని. ఢిల్లీ పంజాబ్ ప్రభుత్వాలు వ్యాక్సిన్ లు కావాలని అమెరికన్ వ్యాక్సిన్ కంపెనీలను సంప్రదిస్తే, వాళ్లు రాష్ట్రాలతో వ్యాపారం చేసేందుకు సుముఖంగా లేమని చెప్పారు. తాము నేరుగా భారత ప్రభుత్వంతోనే సంప్రదింపులు జరుపుతామని స్ఫష్టంగా చెప్పారు. రేపు తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు గ్లోబల్ టెండర్లు పిలిచినా ఇదే సమాధానం వస్తుందేమే.
కేంద్రం వ్యాక్సిన్ లను సరఫరా చేయలేకపోతున్నదని విదేశాలనుంచి కొందామనుకున్నా, దీనికి కూడా కేంద్రం దగ్గిరకు వెళ్ళాల్సి వస్తున్నది. కేంద్ర కంట్రోల్ నుంచి వ్యాక్సిన్ లను తప్పించడం చాలా కష్టం. అందువల్ల రాష్రాలకు నేరుగా అంతర్జాతీయ కంపెనీలనుంచి వ్యాక్సిన్ దొరికే అవకాశం బాగా తక్కువ.
ఇక్కడ మరొక సమస్య కూడా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ, స్పుత్నిక్ లకు మాత్రమే అనుమతి ఉంది. ఫైజర్ , మాడెర్నా వంటి కంపెనీల వ్యాక్సిన్ లకు అనుమతి లేదు.
అంటే అమెరికన్ కంపెనీ ల దగ్గిర వ్యాక్సిన్ స్టాక్ లేదు. ముందుగా బుక్ చేసుకున్నవారికి సప్లై చేశాక ఇండియాకు సరఫరా చేస్తారు. దీనికి ఎంతకాంలో పడుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఆవ్యాక్సిన్ స్టాక్ ఉన్నపుడే భారత్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తుంది.
ఇవీ భారతీయలు ఆగచాట్లు. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఇతర దేశాలు వ్యాక్సిన్ లను ముందే బుక్ చేసుకుంటున్నట్లు భారతదేశం ఎందుకు బుక్ చేసుకోలేదు? అనేది పెద్ద ప్రశ్న.
ఎపుడో, వస్తాయో రావో తెలియని యుద్ధాలకోసం దశాబ్దాలముందే సమాయత్తమవుతున్నపుడు, లక్షలాది మంది ప్రజలు చనిపోయే పరిస్థితులు దూరాన కనిపిస్తున్నపుడు వ్యాక్సిన్లు, మందులు, ఆసుపత్రి పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు సిద్దం చేసుకోవడం మరిచిపోతే ఎలా?
దేశంలోని ప్రతిమనిషకి వ్యాక్సిన్ వేయాలనుకున్నపుడు ఎంతమందికి అసరమో తెలుసు, ఎన్ని వ్యాక్సిన్లు కావాలో లెక్క కట్ట వచ్చు, మన కంపెనీలు రోజుకు ఎన్ని డోసులు తయారు చేస్తాయో తెలుసు… మరి ప్రజలందరికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఒక ఏడాది కాలంగా ప్రణాళిక సిద్ధం చేసుకోకుండా ప్రభుత్వాలు ఏంచేస్తున్నాయని ప్రఖ్యాత ఆర్థిక వేత్త ప్రొఫెసర్ ఆర్ రామకుమార్ ప్రశ్నిస్తున్నారు.
“The demand–supply mismatch shows poor planning. We would have known last year how doses we needed and what our production capacity was.”
గత ఏడాది లాక్ డౌన్ కాలంలో అమెరికా, యుకె, బ్రెజిల్ వంటి దేశాలు వ్యాక్సిన్ లను బుక్ చేసుకున్నాయి.
2020 నవంబర్ నాటికే ఫైజర్, మాడెర్నా, జాన్సన్ అండ్ జాన్స్ న్ వ్యాక్సిన్ డోసులన్నింటిని అడ్వాన్స్ గా బు క్ చేసుకున్నాయి.ఇలాంటి ముందుచూపు భారత ప్రభుత్వం లేకపోవడం ఆశ్చర్యం. 2021 మే నాటికి దేశంలో మృతుల సంఖ్య 3 లక్షలు దాటుతున్నపుడు…. విదేశీ వ్యాక్సిన్ లకు ఆర్డర్లు పెట్టలేదు, దేశీయంగా తయారీ చాలడం లేదు. మాన్యు ఫ్యాక్చరింగ్ కెపాసిటి పెంచుకునేందుకు చర్యలు తీసుకోలేదు.
సీరమ్ ఇన్స్ స్టిట్యూట్ నుంచి గాని, భారత్ బయోటెక్ నుంచి వ్యాక్సిన్ ల కొనుగోలుకు భారత ప్రభుత్వం 2021 జనవర ఆర్డర్లు బుక్ చేయలేని ఫ్రొఫెసర్ రామ్ కుమార్ వెల్లడించారు.