ఒదిశాలో 24 గంటలు తిష్ట వేయనున్న యాస్ తుఫాన్

ఒదీశా మీద విరుచుకుపడనున్న యాస్ సైక్లోన్…

యాస్ సైక్లోన్ ఒదీశా వైపు అడుగులేస్తున్నది. తుఫాన్ ప్రభావం ఈ రాష్ట్రం తీవ్రంగా ఉండబోతున్నది. జార్ఖండ్ లోకి ప్రవేశించే ముందు ఒదిశాలో విళయం తాండవం సృష్టిస్తుందేమోనని ఆందోళన మొదలయింది. దీనిని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నది.

ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం మే 26న తుఫాన్ ఈ రాష్ట్రం మీద విరుచుకుపడుతున్నది. పూర్తిగా  24 గంటలో పాటు ఒదిషాలో ఈ తుఫాన్ నిలకడ రాష్ట్రంమీద వుంటుంది. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, బుధవారం (మే 26) తెల్లవారుజామున ఒదిశా తీరం తాకుతుంది. మే 27 గురువారం ఉదయం మాత్రం ఒదిశా వదలి జార్ఖండ్ లోకి ప్రవేశిస్తుంది.

యాస్ 24 గంటల దాడికి ఒదిశా సమాయత్తమవుతున్నది.  మే 26 ఉదయం భడ్రక్,  కేంద్రపాద, బాలాసోర్ లలో  గంటకు 137 కిమీ వేగంతో గాలులు వీస్తాయి.

మే 25వే తేదీ రాత్రి 9.30 నుంచే వర్షం కురవడం మొదలవుతుంది. ఆతెల్లవారు జామున 2.30 నుంచి జగత్సింగ్ పూర్, కేంద్రపాద లలో భారీ వర్షం మొదలవుతుంది.  మే 26 ఉదయం  కేంద్రపాదలో గంటలకు20 మి.మి వర్షం కురుస్తుందని అంచనా.

తర్వాత ఇంకా తీవ్రమయి గంటలకు 50.50 మి.మీ లకు పెరుగుతుంది. బద్రక్, బాలాసోర్ లలో  గంటకు30 మి. మీ వర్షపాతం కురుస్తుంది. కటక్, భువనేశ్వరలలో  గంటకు 5మి.మి వర్షపాతం కురుస్తుంది. మధ్యాహ్నానికి  14 మి.మీ కు పెరుగుతుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *