కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర రు.100 తగ్గించారు…

రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేస్తున్న  కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను  సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రు. 100 తగ్గించింది. గతంలో ఈధరను డోస్ కు రు. 400 లుగా ప్రకటించిన కంపెనీ ఇపుడు కరోనా పరిస్థితులలో దాతృత్వం ప్రకటిస్తూ వందరుపాయలుతగ్గించింది. ఈ విషయాన్ని కంపెనీ సిఇవొ ఆదార్ పూన్వాలా ట్వీట్ చేశారు.

“దాతృత్వంతో సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తరఫున కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను రు.400 నుంచి రు.300 కు తగ్గిస్తున్నట్లు ప్రకటిస్తున్నాను. ఈ ధర వెంటనే అమలులోకి వస్తుంది. దీనివల్ల రాష్ట్రాల మీద వేలకొట్ల రుపాయల భారం తగ్గుతుంది. దీనితో మరింత ఎక్కువగా వ్యాక్సిన్ కొనవచ్చు. ఎక్కువ మంది ప్రాణాలు కాపాడవచ్చు,” పూనవాలా ట్వీట్ చేశారు.

 

 

కోవిడ్ వ్యాక్సిన్ ధరలు బాగా ఎక్కువగా ఉన్నాయనే విమర్శ సర్వత్రా ఎదురవుతున్నది. అంతర్జాతీయ ధరలకంటే ఇండియాలోవ్యాక్సిన్ల ధరలు ఎక్కువగా ఉన్నాయని, దానికి రెండు కంపెనీల ధరలలోచాలా వ్యత్యాసం ఉందనే చర్చు దేశమంతా కొనసాగుతూ ఉంది. అంతేకాదు, ధరలు నిర్ణయయించే విధానమేమిటో చెప్పాలని, ఇందులో కేంద్రం జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు నిన్ననే కేంద్రాన్ని ఆదేశించింది. ఇది జరిగిన 24గంటల్లోనే సీరమ్ఇన్ స్టిట్యూట్ ధరలను తగ్గిస్తూ ‘దాతృత్వం’ ప్రదర్శించింది.

మే నెల ఒకటో తేదీనుంచి వ్యాక్సిన్ డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే,  18నుంచి 45 సంవత్సరాల మధ్యవారికి కూడా వ్యాక్సిన్ వేయాలని కేంద్రం  ప్రకటించింది. దీనికి ఈ రోజునుంచే రిజస్ట్రేషన్ మొదలయింది. ఈ దశలో వ్యాక్సిన్ ధరలువివాదాస్పదమయ్యాయి. కోర్టు జోక్యం చేసుకొనకముందే ఇపుడు సీరమ్ ఇన్ స్టిట్యూట్   ధరలనుతగ్గించింది.  ఇక భారత్ బయోటెక్ ఎలాస్పందిస్తుందో చూడాలి.

 

One thought on “కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర రు.100 తగ్గించారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *