దేశంలో ఇపుడు మెడికల్ ఆక్సిజన్ మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంది. వేల సంఖ్యలో కరోనా బారిన పడిన రోగులకు ఆక్సిజన్ అందించలేకపోవడంతో చూస్తుండగానే రాలిపోతున్నారు. తమ కళ్లెదుటే తమ పక్క పడకల మీద ఉన్న రోగులు ఆక్సిజన్ అందక చనిపోయారని చాలా మంది రోగులు చెబుతున్నారు. వూపిరాడక ఆసుపత్రికి చేరుకునేలో పే కొందరు చనిపోతున్నారు. ఆక్సిజన్ కోసం చూసిచూసి ఆసుపత్రి పడకల మీద కొందరు ప్రాణం విడుస్తున్నారు. ఆక్సిజన్ సాయం చేయండని ఆసుపత్రులే అర్తనాదాలు చేస్తున్నాయి. ఇలాంటి దయనీయమయిన వార్తలుపాండెమిక్ సమయంలో ఏ దేశం నుంచి రాలేదు. అందుకే ప్రపంచం భారత్ ను చూసి ఇపుడు తల్లడిల్లిపోతున్నది.
ఢిల్లీ సర్ గంగారామ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 25 మంది రోగులు గంటకొకరు చనిపోయారు. ఆక్సిజన్ ఇచ్చి ఈ పేషంట్లను ఆదుకోండని ఆసుపత్రి ప్రపంచానికి విజ్ఞప్తి చేసింది. దీనితో ఏప్రిల్ 21న ఢిల్లీ హైకోర్టు రాత్రి పొద్దుపోయాక ఆక్జిజన్ కొరతకు సంబంధించిన కేసును విచారణకు స్వీకరించింది.
సరిగ్గా ఒక వారం కిందటే భారత ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేస్తూ దేశంలో తయారయ్యే మెడికల్ ఆక్సిజన్ కేవలం 54 శాతం మాత్రమే వాడుకుంటున్నట్లు చెప్పింది.
ఈ ప్రకటన ప్రకారం దేశంలో 7127 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతూ ఉంది. ఏప్రిల్ 12న వినియోగం కేవలం 3842 మెట్రిక్ టన్నులు. అంటే ఉత్పత్తిలో 54 శాతమే.
It is pertinent to note that there is a sufficient production capacity of around 7127 MTs for oxygen in the country, and as per need, the surplus oxygen available with the steel plants is also being utilized. The country has a daily production capacity of 7127 MT of oxygen per day. Against this, the total production has been 100 percent since the past two days, as directed by EG2, since supply to medical oxygen has gone up rapidly. On 12th April 2021, the medical oxygen consumption in the country was 3842 MTs, which is 54 percent of the daily production capacity. The maximum consumption of medical oxygen in the country is by states of Maharashtra, Gujarat, Madhya Pradesh, Uttar Pradesh, Karnataka, Tamil Nadu, Delhi, followed by Chhattisgarh, Punjab, Rajasthan. (Source: PIB).
కాని, రోజూ లెక్కలేనంత మంది రోగులు కేవలం ఆక్సిజన్ అందక చనిపోతున్నారు. ఆక్సిజన్ సిలిండర్ల దొంగలించుకుపోతన్నారు. బ్లాక్ లో అమ్ముతున్నారు. మీ సిలిండర్లు మీరు తెచ్చుకోండని ఆసుపత్రులు రోగులుకు షరతు పెడుతున్నాయి. అంటే భారతదేశానికి ఆక్సిజన్ ఎమర్జన్సీ వస్తే తట్టుకునే శక్తి లేదనే గా. ఈ కొరతకి, ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనకి పొంతనే లేదు.
దీనికి మోదీ ప్రభుత్వ వైఫల్యం అని కొందరంటున్నారు, కాదు,రాష్ట్రాలు కూడా బాధ్యత విస్మరించాయని,సొంతంగా ఖర్చు తక్కువ ఆక్సిజన్ పాంట్ అను ఎందుకు ఏర్పాటు చేసుకోలేదని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కొరత గురించి కొన్ని వాస్తవాలు,వైరుధ్యాలు:
భారత ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో వేసిన ఒక అఫిడవిట్ లో దేశంలోని ఆక్సిజన్ కొరత ఎందుకొచ్చిందో స్పష్టంగా పేర్కొంది. ఈ ఆఫిడ విట్ ప్రకారం… ఏప్రిల్ 21 నాటికి దేశానికి రోజూ 8000 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ అవవసరం ఉంది. తయారుచేసే కెపాసిటి 7,200 మెట్రిక్ టన్నులే. అంటే మొత్తం యూనిట్లను పనిచేయించినా ఇంకా 800మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కొరత ఉంటుంది. గత కేంద్రం ప్రతిపాదించిన 162 ప్లాంట్ ల వల్ల రోజూ ఉత్పత్తయ్యే ఆక్సిజన్ 152 మెట్రిక్ టన్నులే.ఈ ప్లాంటులు పూర్తిగా ఏర్పాటయి పనిచేసినా ఆక్సిజన్ కొరత తీరదు. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనకు, కోర్టు కు తెలియ చేసిన వివరాలకు తేడా గమనించండి.
ఆక్సిజన్ ప్లాంట్ లను సొంతంగా ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు?
ఈ ఆక్సిజన్ ప్లాంట్లు ఏమంత ఖరీదయిన వ్యవహారం కాదు. ఒక్కొక్క ప్లాంట్‌కు రు. రు 1.25 కోట్లు మాత్రం ఖర్చవుతాయి. నూరు లీటర్ల నుంచి వేయి లీటర్ల సామర్థ్యం ఉండేలా ప్లాంట్ లను తక్కువ ఖర్చుతోనే ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ చిన్న మొత్తం కోసం రాష్ట్రాలు కేంద్రం ఏర్పాటు చేసే దాకా ఆగాల్సి న అవసరం లేదు.
ఛత్తీష్ గడ్ ఇదే చేసింది. నిజానికి, ఆ రాష్ట్రానికి ఎంతయినా ఆక్సిజన్ సరఫరా చేసే పరిశ్రమలున్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 20 ఆక్సిజన్ ప్లాంట్ ల ఏర్పాటుకు కాంట్రాక్టులిచ్చింది. ఇందులో 15 పూర్తయి పనిచేస్తున్నాయి. కాని మధ్య ప్రదేశ్ ను తీసుకోండి, ఆరాష్ట్రాలో ఆక్సిజన్ పాంట్లే లేవు. వందల సంఖ్యలో ప్రాణాలు గాలిలోకలసిపోతన్నపుడు మొన్న ఏప్రిల్14న 13 పిఎస్ ఎ ఆక్సిజన్ ప్లాంట్ లను ఏర్పాటుచేసేందుకు పూనుకుంది.
కేంద్రమూ ఆశ్రద్ధ చేసింది
కరోనా మొదటి దశలో దేశాన్ని కుదిపేసినప్పుడు యుద్దప్రాతిపాదికన ఆక్సీజన్ ప్లాంట్లను నెలకొల్పాల్సిన కేంద్ర ప్రభుత్వం కేవలం బిడ్లను ఆహ్వానించడానికి 8 నెలల సమయం తీసుకుంది
అంటే గతేడాది మార్చిలో కరోనా ప్రవేశిస్తే అక్టోబర్ 21,2020 నాడు 14 రాష్ట్రాలలో 150 PSA ఆక్సీజన్ ప్లాంట్ల ( Pressure Swing Adsorption Technology) స్థాపన కోసం బిడ్లను ఆహ్వానించింది. తర్వాత మరొక 12 ప్లాంట్లను జత చేశారు. అంటే 162 పిఎస్ ఎ ఆక్జిజన్ ప్లాంట్ల ఏర్పాటుచేయాలనుకున్నారు. వీటికి నిధులు పిఎం కేర్స్ ఫండ్ (Prime Minister’s Citizen Assistance and Relief in Emergency Fund) నుంచి ఇవ్వాలి. బిడ్స్ ని కేంద్రం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ పరిశీలించి, వెండర్లను ఎంపిక చేయాలి.ఈ వెండర్లు ఎంపిక చేసిన జిల్లా ఆసుపత్రులలో ఆక్జిజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర లేదు. రాష్ట్రాలు చేయాల్పిందల్లా ఎంపిక చేసిన జిల్లా ఆసుపత్రిలో సివిల్ పనులు, ఎలెక్ట్రికల్ పనులు పూర్తిచేయడమే. జిల్లా ఆసుప్రతి స్థలం ఉందని ఒక సర్టిఫికేట్ (Site readiness certificate) వెండర్ కు అందించాలి.
అయితే, వెండర్లను ఎంపిక చేసే అక్టోబర్ 2020 దాకా మొదలుపెట్టనేలేదు. అంటే ఎనిమిది నెలలు కాలయాపన చేశారు. నిజానికి పని మొదలు పెట్టి ఉంటే ఈ ఎన్నిమిది నెలల్ల్ ప్లాంట్ ల నిర్మాణం పూర్తయి ఉండేది.
బిడ్డర్స్ నవంబర్ 10,2020 దాకా బిడ్స్ సబ్ మిట్ చేసేందుకు అనుమతించారు. చివర. డిసెంబర్ ఫైనల్ కాంట్రాక్టులు ఖరారు చేశారు. అంటే, పాండెమిక్ మొదలయైన పది నెలల తర్వాత అక్సిజన్ ప్లాంట్ ల నిర్మాణం మొదలవుతున్నదన్నమాట.
టెండర్ డాక్యుమెంట్ ప్రకారం, ఇన్ స్టలేషన్ పని 45 రోజులలో నే (minimum required period of 45 dyas) పూర్తి చేయాలి. ఈ నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న వాళ్లు చెప్పేదాని ప్రకారం ఒక ప్లాంట్ ఇన్ స్టలేషన్ నాలుగు నుంచి ఆరువారాలలో పూర్తవుతుంది.
అయితే, కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించ లేదు. కాంట్రాక్టు దొరికించుకున్న వెండర్లు పత్తా లేకుండా పోయారని అనేక జిల్లా ఆసుపత్రులు అధికారులు చెప్పినట్లు Scroll.in రాసింది. ఇంకా చెప్పాలంటే వెండర్లో ముగ్గురు ఏప్రిల్ 13నే సిఎంఎస్ ఎస్ (CMSS) బ్లాక్ లిస్టు చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఆద్వర్యంలో రాజధాని ఢిల్లీలో నడిచే సఫ్దర్ జంగ్ హాస్పిటల్ కూడా పిఎస్ ఎ ఆక్సిజన్ ప్లాంట్ ఇంకా తయారు కాలేదు. కేంద్రం ఎంపిక చేసిన 162 ఆసుపత్రులలో ఇదొకటి.
అన్న రాష్ట్రాలకంటే ఎక్కువగా ఉత్తర ప్రదేశ్ కు 14 ఆక్సిజన్ ప్లాంటులు కేటాయించారు. స్క్రోల్ ఈ ఆసుపత్రుల అధికారులను ఈ ప్లాంట్ ల ఏర్పాటు గురించి వాకబు చేసింది. ఏ ఒక్క ఆసుపత్రిలో కూడా ఆక్సిజన్ ప్టాంట్ రెడీ కాలేదు. తర్వాత, ప్రభుత్వం వివరణ ఇస్తూ, ఒక ఆసుపత్రిలోమాత్రం ఆక్సిజన్ పాంట్ సిద్ధమయిందని పేర్కొంది.
కొరత తీరాలంటే ఎన్ని ప్లాంటులు ఏర్పాటు చేయాలో కేంద్రానికి, రాష్ట్రాలకు బాగా తెలుసు. దేశప్రజల ప్రాణాలు కాపాడటం ముఖ్యం అని అనుకుని ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక రు. 1000 లేదా రు. 2000 కోట్ల ఖర్చు పెట్టి ఉంటే దేశంలోఇపుడు ఆక్సిజన్ కొరత ఎదరై ఉండేదేకాదు. ఎవరూ ఎమర్జన్సీ వస్తే ఏంచేయాలనే దాని మీద దృష్టిపెట్టలేదు. పెద్దగా అసవరంలేనపుడు ఉత్పత్తి వినయోగం చూపి దేశంలోఆక్జిజన్ మిగులు ఉందని చంకలేగరేసుకున్నారు. ఏ ప్రభుత్వం క్రైసిస్ మేనేజ్ మెంట్ ప్లాన్ లేదని ప్రభుత్వాలు కోర్టులకు సమర్పిస్తున్నఅఫిడవిట్లు, కోర్టులు వ్యక్తం చేస్తున్న ఆగ్రహం, తీర్పులు, మీడియా రిపోర్టుల వల్ల అర్థమవుతుంది.
నిజానికి గత ఏడాది పాండెమిక్ ఎదరయిన అనుభవంలోనేప్రభుత్వాలు ఆక్సిజన్ కొరత వూహించి, అదనపు ఉత్పత్తి కోసం ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన చేసి ఉండాలి. ఆపి కేంద్రమూ చేయాలేదు, రాష్ఱ్రాలు చేయలేదు. కాబట్టి ఇపుడు ఆక్సజిన్ కొరత కు కేంద్రం, రాష్ట్రాలు రెండు బాధ్యులే అనాల్సి వస్తుంది.