పోలవరం నిర్వాసితుల తరలింపుపై స్టే పొడిగింపు

(జువ్వాల బాబ్జీ)

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను పునరావాస కాలనీల కు తరలించరాదని హైకోర్టు ఆదేశించింది.

నిర్వాసితులను వాళ్ల అభీష్టానికి వ్యతిరేకంగా ఏ మాత్రం వసతులు లేని పునరారవాస కాలనీలకు తరలిస్తున్నారని, కోర్టు జోక్యం చేసుకుని తరలింపును నిలిపివేయాలని ప్రజా వ్యాజ్యం (పిల్ నేం:56/2021) హైకోర్టులో దాఖలయిన సంగతి తెలిసిందే.

ఏ మాత్రం వసతులు లేని పునరావాస కాలనీలకు నిర్వాసితులను తరలించడం మీద ఇప్పటికే స్టే ఉంది.

ఈ కేసులో నిన్న మరొక సారి  ఏ. పి. హై కోర్టు చీఫ్ జస్టిస్, అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ ప్రవీణ్ కుమార్ ల బెంచ్ మరొక సారి వాదనలు వింది. అనంతరం  జూన్ వరకు  ఏ విధమైన తరలింపు చర్యలు చేపట్ట రాదని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ  గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వు లను పొడిగించింది.

ఈ సారి పునరావాస కాలనీలలో అసంపూర్తిగా ఉన్న పనులు ఎలా ఉన్నాయో, ఈ కాలనీలు ఎలా నివాసయోగ్యం కాదో చూపే ఫోటోలను పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.


అసంపూర్ణ పునరావాస కాలనీ

దీనిపై స్పందించిన కోర్టు   దీని మీద  కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాతన్ని ఆదేశిస్తూ  అప్పటి వరకు నిర్వాసితుల ను పునరావాస కాలనీ లకు తరలించ వద్దని ఉత్తర్వులు జారీ చేశారు.

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కష్టాలు ఎంతకు తీరడం లేదు.  ప్రభుత్వాలు చాలా అయిష్టంగా, నామమాత్రంగా పునరావాస కాలనీలను ఏర్పాటుచేసి ఏదో విధంగా వారిని అక్కడికి తరిమేయాలని చూస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా  ఐక్యంగా ఉండి హక్కులు సాధించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఒక వైపు కోర్టు తీర్పు ఉన్నప్పటికీ, భూసేకరణ అధికారులు ముంపు గ్రామాలలో సమావేశాలు పెడుతున్నారు. అంటే, ప్రభుత్వం నిర్వాసితుల పట్ల ఏ మాత్రం మానవీయ కోణం నుంచి చూడటంలేదని అర్థం అవుతుంది.

గ్రామాలు ఖాళీ చేయటానికి సిద్ధంగా ఉన్నారని పత్రికలలో ప్రకటన లిస్తూ  ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ రోజు ‘ఈనాడు’ పేపర్, 6వ పేజీ లో ఉన్న వార్త “ప్యాకేజీ ఇస్తే వెళ్ళ డానికి సిద్ధం”అని రాశారు. ఈ ప్రకటన పోలవరం తహశీల్దార్ సుమతి గారి పేరుతో వచ్చింది. మరొక వైపు అదే పేపర్లో “ముంపు లెక్కలపై మల్ల గుల్లాలు”అని రాశారు.

ఇలాంటి కాలనీలకు నిర్వాసితులను తరిమేస్తున్నారు

ముంపు గ్రామాల పరిధి, భూములు సరిహద్దు రాళ్లలో స్పష్టత లేకపోవడం వలన  అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలనీ చాలా మంది అధికారులకు  ఫిర్యాదులు చేశారు.

దీనిపై దృష్టి సారించిన అధికారులు నిర్వాసితుల నుండి వివరాలు సేకరిస్తూ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజలు అనేక సమస్య లను  వారి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా 2005 నాటి సర్వే పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని  పున్నః పరిశీలన కోసం డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

‘పోలవరం రాజకీయాల్లో పడి నిర్వాసితులను గాలి కొదిలేశారు’

జగన్ గారూ, పోలవరం అవినీతే కాదు, ముంపు బాధితుల గురించి మాట్లాడండి

ఇలాగే,  అసలు 41.15కాంటూరు పరిధిలోకి వచ్చే గ్రామాలను తప్పించారని, గత ఏడాది వరదల్లో చిక్కుకుపోయిన గ్రామాల వివరాలను నీటిలో మునిగిన ఆనవాళ్లను గుర్తులుగా అధికారుల కు చూపిస్తున్నారు.

గత ఏడాది వరదల్లో మునిగిన కుకునూరు మండలం లోని బెస్త గూడెం,అంబోతులగూడెం వంజం వారి గుంపు, కిస్టారం , మాధారం, కౌండిన్య ముక్తి గ్రామాల ప్రజలు తమ సమస్య ను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

అంతే కాకుండా ఈ అంశంపై పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్, ఆర్ అండ్ ఆర్ ఇంచార్జ్ ఆనంద్  కూడా 2005లో జలవనరుల శాఖ జరిపిన సర్వే కొంత లోపభూయిష్టంగా ఉందని అభిప్రాయపడుతున్నారు.

దీనితో  గత ఏడాది వరదల కారణంగా నష్ట పోయిన గ్రామాలను ముఖ్య మంత్రి  పరిశీలిస్తూ ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇక్కడ ఎన్నో సమస్యలున్నాయి. వాటిని పరిష్కారం చేయకుండా నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యల కు పూనుకోవడం అన్యాయ మని ప్రజలు వాపోతున్నారు.


List of facilities not provided in R&R colonies:

*No religious place of worship;

*No Anganwadi center and community hall;

*No veterinary hospital;

*LNo shopping complex or park for kids;

*No CC roads and underground drains;

*No street lights; No GCC store;

*No provisions to store grains and graze cattle; No primary health care centre.


అంతే కాకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పెంపుదల కోసం ప్రభుత్వం ఇచ్చిన జీ. ఓ. నెంబర్: 350 గురించి కూడా అధికారులు స్పష్ట త ఇవ్వడం లేదు.

ముందు పరిహారం రు. 6.86లక్షలు ఇస్తామని చెప్పారు. తర్వాత పునరావాస కాలనీలకు వెళ్ళాకే పెంచిన సొమ్ము చెల్లిస్తాం అని ఇటీవల ఆనంద్  ప్రకటించారు. ఇది ఎంత అన్యాయం. అది జరిగే పనేనా?

గతంలో తరలించిన పోలవరం మండలము లోని 14గ్రామాల నిర్వాసితులు ఇప్పటికీ పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తెస్తూ మాకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించి, పెంచిన విధంగా  ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ  ఇస్తేనే గ్రామాలు ఖాళీ చేస్తామని అధికారులు ముంపు గ్రామాలను సందర్శ నకు వచ్చినప్పుడల్లా చెపుతున్నారు.

ఏదైనా సరే, నిర్వాసితులు ఐక్యంగా ఉండి హక్కులు సాధించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ప్రజలను ఖాళీ చేయటానికి 6నెలల ముందుగా అన్ని రకాల చర్యలూ పూర్తి చేయాలనీ భూసేకరణ చట్టం 2013స్పష్టం చేస్తుంది. కానీ, ఇవేమీ పట్టని అధికారులు నిర్వాసితుల ను పునరావాస కాలనీలకు తరలించాలనే ఆత్రుత లో అనేక తప్పులు చేస్తూ కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికే సేకరించిన భూములలో కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకుంది. ఆ కేసు ఇంకా పెండింగులో ఉంది. ఇప్పుడు మరొక కేసు ప్రజల కోసం హైకోర్టు ముందుకు వచ్చిన సందర్భంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరైన అవగాహన తో చర్యలు తీసుకోవాలనినిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.

(జువ్వాల బాబ్జీ అడ్వకేట్. ఫోన్ నెంబర్:9963323968)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *