తెలంగాణ నిరుద్యోగులు కాంగ్రెస్ ఘోష వింటరా?

తెలంగాణ నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ నేతలు చాలా వాదిస్తున్నారు. వారికి జరిగిన అన్యాయాన్ని వేలెత్తిచూపుతున్నారు. ముఖ్యమంత్రి ఉద్యోగాలివ్వలేదు, ప్రామీస్ చేసిన నిరుద్యోగ భృతి ఇవ్వలేదని కాంగ్రెస్ వాళ్లు నిరద్యోగులకు  గత ఆరేళ్లలో నిరుద్యోగులకు ఎత అన్యాయం జరిగిందో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

అంకెలు చూపి ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ మార్చి 14 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కువో టేసి  నిరద్యోగులకు అన్యాయం జరిగిందని ఒప్పకుంటారా? లేక  లేద మేమే తెలంగాణ రాష్ట్ర సమతి లెక్కలేనని నమ్ముతామని రుజువుచేస్తారా? వారి తీర్పెలా ఉన్నా కాంగ్రెస్ నేతలంతా నిరుద్యోగుల పక్షాన నిలబడుతున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ను, ఐటి మంత్రి కెటిఆర్ ను చాలెంజ్ చేస్తున్నారు.

ఇదిగో ఈ రోజు  కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి నిరుద్యోగుల గురించి ఉద్యోగుల పిఆర్ సీ గురించి ఏమంటున్నారో చూడండి.

పీఆర్సీ గడువు ముగిసినా .. దేశంలో మధ్యంతర భృతి ఇవ్వని ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం, పీఆర్సీ పై ప్రభుత్వం ఇంకా త్రిసభ్య కమిటీ అని కాలయాపన చేస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు.

ఈ రోజు గాంధీ భవన్ లో విలేకరులతోమాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులో ఉండగా  29 శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం ఎలా లీక్ ఇస్తుందని ఆయన ప్రశ్నించారు.

ఈసీ అనుమతి తీసుకోకుండా  త్రిసభ్య కమిటీ నివేదిక ఇవ్వకుండా సిఎం ఎలా ప్రకటన చేస్తారని చెబుతూ ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు

ఇంకా ఏమన్నారంటే…

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 20 శాతం మేర ఉద్యోగ ఖాళీలు ఉండేవి. నేటి అసమర్ధ ప్రభుత్వం నిర్వాకం కారణంగా రాష్ట్రంలో 40 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉండటం దారుణం.

సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ నిరుద్యోగుల ఆశలు అడియాశలు అయ్యాయి.

బిస్వాల్ కమిటీ కూడా రాష్ట్రంలో 1 లక్ష 90 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి అని పేర్కొంది.

ఆ ఖాళీల భర్తీ విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తూ నిరుద్యోగుల భవిష్ట్యట్ తో చెలగాటం ఆడుతోంది.

నిరుద్యోగ భృతి కూడా ఇవ్వని దుస్థితి నెలకొంది

ఉద్యోగాలు ఇవ్వాల్సిన టీఎస్ పీఎస్సీ  (TSPSC) లోనే పూర్తిస్థాయి లో ఉద్యోగులు లేరు

కేసీఆర్ కార్పొరేట్ విద్యా సంస్థల వారికి ఎమ్మెల్సీ టికెట్స్ ఇచ్చారు

పీవీ నరసింహారావు ను సమైక్యవాది అని విమర్శించిన కేసీఆర్ .. ఆయన ఫోటో పెట్టుకొని ఓట్లు అడగటం సిగ్గు చేటు

కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడేందుకు గ్రాడ్యుయేట్ లకు ఎమ్మెల్సీ ఎన్నికలు మంచి అవకాశం

విభజన చట్టం అమలు చేయని బీజేపీ కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగాల కల్పనపై ప్రధాన ఎజెండా గా ప్రభుత్వాన్ని నిలదీస్తాం

ఉద్యోగ సంఘాల లో శ్రీనివాస్ గౌడ్ ఒక్కడు మంత్రి అయితే .. అందరికీ న్యాయం జరిగినట్లేనా.ఇప్పటికైనా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కళ్ళు తెరవాలి

ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే ప్రగతి భవన్ తలుపులు తెరుచుకున్నాయి

ఎన్నికల తరువాత ప్రగతి భవన్ గేట్లు మూసుకు పోతాయి.

గత 9 నెలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావాలంటర్లకు జీతాలు కూడా చెల్లించని అసమర్ధ ప్రభుత్వం ఇది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *