జిహెచ్ ఎంసికి ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో తీసుకోవడం బాగా అలవాటు. ప్రాపర్టీ టాక్స్ లో 50 శాతం రిబేట్ ప్రకటించి, మరొక చేత్తో గతంలో టాక్స్ మినహా యింపు ఇచ్చిన వారి మీద భారం మోపబోతున్నది. వాళ్లకి మినహాయింపు ముగిసిందని, టాక్స్ 100 శాతం పెంచి 2018 నుంచి బకాయీలతో భారీగా లాగేందుకు అధికారులు రంగం సిద్దం చేసి నోటీసులు పంపిస్తున్నట్లు తెలిసింది.
హైదరాబాద్ లో లక్షల మంది కి నోటీసులు జారీ చేస్తున్నది. వీళ్లకందరికి నూరుశాతం టాక్స్ పెంచుతూ 2018నుంచి అరియర్స్ వసూలు చేస్తే 50 రిబేట్ లోటుపూడటమే కాదు, లాభం కూడా ఉంటుంది.
మొన్నజిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రాపర్టీటాక్స్ ను లో కొంతమందికి 50 శాతం రిబేట్ ఇస్తున్నట్లు మునిసిపల్ మంత్రి కెటి రామారావు ఎన్నికల క్యాంపెయిన్లో ప్రకటించారు.
ఎన్నికలయిపోయాక జిహెచ్ఎంసి కమిషనర్ దగ్గిర నుంచి ఈ మేరకు అర్హులయిన వాళ్లందరికి ఎస్ ఎం ఎస్ వచ్చింది. టాక్స్ రిబేట్ 50 శాతం అమలుచేసినట్లు లెక్క. ఎవరైనా ఇప్పటికే టాక్స్ పూర్తిగా కట్టి వుంటే, 50 శాతాన్ని వచ్చే ఏడాది టాక్స్ కింద పరిగణిస్తామని చెప్పారు. ఈ రిబేట్ వల్ల జిహెచ్ ఎంసికి సుమారు రు.300 కోట్ల ఆదాయం పడిపోతుందని ఒక అంచనా.
అయితే, ఈ లోటుపూడ్చుకునేందుకు జిహెచ్ ఎంసి లొసుగులు వెదకడం మొదలుపెట్టింది. గత మునిసిపల్ ఎన్నికల్లో రు. 1200 లోపు టాక్స్ ఉన్న వాళ్లందరికి టాక్స్ మినహాయింపు ఇచ్చి కేవలం రు. 101 కడితే చాలని చెప్పారు.
ఇపుడు కొత్తలోటు పూడ్చుకునేందుకు పాత వాళ్ల మీద టాక్స్ మోపుతున్నారు. రు. 101 టాక్స్ మినహాయింపు ఇచ్చిన జీవొ కాలపరిమితి అయిపోయిందని వాళ్ల టాక్స్ ను 100 శాతం పెంచారని అదికారులు చెబుతున్నారు. అంటే, ఒక్కొక్క 101 టాక్స్ దారునుంచి కనీసం 4000 రుపాయలు వసూలు చేసేందుకు రంగం సిద్ధమయింది. ఈమేరకు జిహెచ్ ఎంసి నోటీలు పంపిస్తూ ఉంది. ఇదొక నోటీసు
ఉదాహరణకు 2016 కు ముందు మీ ప్రాపర్టీ టాక్స్ రు. 750 అనుకోండి. మినహాయింపుతో మీ టాక్స్ కేవలం రు.101 అయింది. ఇపుడు వాళ్లందరికి పాత రేటు మీద 100 శాతం పెంచి రు. 1500 కట్టాలని చెబుతున్నారు. అంటే, ఈ ఏడాది అరియర్స్ తో కలసి వీళ్లంతా రు. 4500 కట్టాల్సి ఉంటుంది. ఇలా భారీగా పన్నులు చేసేందుకు అధికారులు నోటీసులు పంపిస్తున్నారు.