మంచు లక్ష్మీ కుమార్తెకు నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు

కలెక్ష‌న్ కింగ్ డా మోహ‌న్‌బాబు మ‌నవ‌రాలు, ప్ర‌ముఖ న‌టి మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌ కూతురు విధ్యా నిర్వాణ యంగెస్ట్ చెస్ ట్రైన‌ర్‌ గా నోబుల్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. డిసెంబ‌ర్ 19న నొబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్ర‌తినిధి డా. చోక‌లింగం బాలాజి స‌మ‌క్షంలో జ‌రిగిన ప‌రీక్ష‌ల్లో ఆమె తన ప్రతిభ చూపి ఈ రికార్డ్ సొంతం చేసుకుంది.
ఈ సంద‌ర్భంగా మంచు ల‌క్ష్మి మాట్లాడుతూ చెస్ అనేది కేవ‌లం ఆట మాత్ర‌మే కాదు అదొక లైఫ్ స్కిల్ అని తాను న‌మ్ముతానని పేర్కొంది. అందుకే ఆమెకు న్న వ‌య‌సులోనే చెస్ ట్రైనింగ్ ఇప్పించానని కానీ రెండు వారాల్లోనే ఆమె కోచ్ కార్తిక్ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి చెస్ చాలా బాగా ఆడుతుంది, ఈ రికార్డ్‌కి మనం అప్లై చేద్దాం అని చెప్పారని పేర్కొంది.
 ఇప్పుడే వ‌ద్దు ఇంకా కొన్ని రోజులు చూడండి త‌ర్వాత చూద్దాం అన్నానని కానీ ఆమెలో టాలెంట్ ఉన్నప్పుడు మ‌నం ఎందుకు స‌పోర్ట్ చేయ‌కూడ‌దు అని రికార్డ్ కోసం ఓకే చెప్ప‌డం జ‌రిగింది.

విధ్యా నిర్వాణ ఇంత చిన్న వ‌య‌సులోనే  `యంగెస్ట్ చెస్ ట్రైన‌ర్‌` గా నొబెల్ బుక్ ఆప్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నందుకు ఒక త‌ల్లిగా ఎంతో గ‌ర్వంగా ఉందని మంచు లక్ష్మి పేర్కోన్నారు. ఇక డా. మోహ‌న్ బాబు మాట్లాడుతూ నాకు ఈ రోజుకి కూడా చెస్ ఆడ‌డం తెలీదని కానీ నా మ‌నవ‌రాలు విధ్యా నిర్వాణ చెస్ నేర్చుకుంటుంది అని లక్ష్మీ చెప్పిన‌ప్ప‌డు ఎందుక‌మ్మా ఇవ‌న్నీ చ‌క్క‌గా చ‌దువుకోనివ్వు  అన్నానని అన్నారు. లేదు త‌ను చాలా ఆస‌క్తిగా ఉందని చెప్పడంతో సరేనన్నానని పేర్కొన్నారు. త‌ను ఈ వ‌య‌సులో ఈ రికార్డు లో స్థానం సంపాదించుకున్నందుకు ఒక తాత‌గా ఎంతో గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను. ఈ సంద‌ర్భంగా త‌ల్లిదండ్రులకి నేను చెప్ప‌ద‌లుచుకుంది ఏంటంటే వారి పిల్ల‌ల‌కు దేనిమీద అయితే ఆస‌క్తి ఉందో చ‌దువుతోపాటు దానికి కొంత స‌మ‌యం కేటాయిస్తే త‌ప్ప‌కుండా ప్ర‌తిఒక్క‌రు గొప్ప స్థాయికి చేరుకుంటారని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *