ప్రపంచ శాంతికోసం, శాస్త్ర సాంకేతిక రంగాలలో మానవజాతి పురోగతి కోసం పనిచేసిన వారికి నోబెల్ బహుమతి ఇస్తారు.
2019 నోబెల్ బహుమతులు ప్రకటించేందుకు రంగం సిద్దమయింది. అక్టోబర్ ఏడు నుంచి పద్నాలుగు మధ్య నోబెల్ బహమతులు ప్రకటించబోతున్నారు.
ప్రపంచంలో ఇంత ప్రతిష్టాత్మకమయిన బహుమతి మరొకటి లేదు. మరొకటి వచ్చే అవకాశం కూడా లేదు. అయితే, శాంతికి, మానవజాతి పురోగతి కృషి చేసిన వారికి బహమతులివ్వాలన్న ఆలోచన ఆల్ ఫ్రెడ్ నోబెల్ (Alfred Bernhard Nobel 1833-1896) కు ఎలా వచ్చిందనే దాని వెనక ఆసక్తికరమయిన చరిత్ర ఉంది.
బహుమతులివ్వాలని ఆయన దీర్ఘంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు. అనుకోకుండా తట్టిన ఆలోచన,దీనికి వెనక జర్నలిస్టు చేసిన పొరపాటు ఉంది.
Physiology or Medicine – Monday 7 October, 11:30 a.m. at the earliest
Physics – Tuesday 8 October, 11:45 a.m. at the earliest
Chemistry – Wednesday 9 October, 11:45 a.m. at the earliest
Literature – Thursday 10 October, 1:00 p.m. at the earliest
The Swedish Academy will announce the Nobel Prize in Literature for both 2018 and 2019.
Peace – Friday 11 October, 11:00 a.m.
Economic Sciences – Monday 14 October, 11:45 a.m. at the earliest
Times listed are local time in Sweden and Norway.
All announcements will be streamed live here.
ఆ పొరపాటు నోబెల్ ను బాగా కలచివేసింది. ఆయనకు తన వ్యాపారం మీద విరక్తి తెచ్చింది. తన సంపాదన ను శాంతి కోసం వెచ్చించాలనుకున్నారు.
బహుమతి కోసం తన సంపాదనను వెచ్చించాలని వీలునామా రాసి చనిపోయారు. నిజానికి ఆయన చనిపోయాక, వీలునామాలో ఏమిరాశాడనేది ఎవరికీ అంతుబట్టలేదు.
ఆయన వెనకేసిన సంపదకు ఎవరికి చెందుతుందని అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. వీలునామా లో ఎవరి పేర ఆస్తిరాశారో నని అంతా ఊపిరి బిగపట్టి ఎదురుచూస్తున్నారు.
అలాంటపుడు కుటుంబానికి పెద్ద షాకిచ్చి, వాళ్లకి నామమాత్రంగానే తన సందప మిగిలించి, మిగిలిన సంపదనంతా ఒక ఫౌండేషన్ కు అప్పగించి, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి, మెడిసిన్ (ఫిజియాలజీ)లో విశేష కృషి జరిపిన వారికి బహుమతులివ్వాలని రాశారు.
ఆయన వీలునామా చదివి వినిపించినపుడు అక్కడున్న బంధువులంతా అవాక్కాయ్యారు. నోబెల్ చేసిన పని వాళ్లెవరికి నచ్చ లేదు.
నోబెల్ తన 63 వ యేట 1896లో ఇటలీ లోని సాన్ రెమోలో చనిపోయారు.
శాస్త్ర పరిశోధనల మీద చాలా మక్కువ వున్న నోబెల్ నిజానికి ఇలాంటి పరిశోధనలు చేసే వారికి తన సంపదలో కొంత భాగాన్ని కేటాయించాలనుకున్నారు. అంతే తప్ప ఆయన ఆలోచనలు చివరకు నోబెల్ ప్రైజ్ గా మారతాయని ఎవరూ కూడా అనుకోలేదు.
వేయి హస్తలిఖిత పదాలున్న ఆయన వీలునామా తెరిచాక గాని ఈ నోబెల్ ఫౌండేషన్ ప్రాజక్టు గురించి ఎవరికీ తెలియదు.
నోబెల్ ను అంతగా కలచి వేసిన వార్త ఏమిటి?
1888 లో నోబెల్ సోదరుడు లుడ్విగ్ నోబెల్ గుండెపోటుతో చనిపోయాడు. లుడ్విగ్ కూడా పెద్ద ఇండస్ట్రియలిస్టు. బ్రదర్స్ నోబెల్ పేరుతో ఆయన కంపెనీ కూడా ప్రారంభించాడు.
ఇలాంటి ఒక నోబెల్ చనిపోయాడు. నోబెల్ చనిపోయాడనే వార్తని ఒక ఫ్రెంచ్ జర్నలిస్టు తప్పుగా అర్థం చేసుకున్నాడు. చనిపోయింది డైనమైట్ల వ్యాపారి ఆల్ ఫ్రెడ్ నోబెల్ అనుకున్నారు. మనుషుల్నిక్షణాల్లో తునాతునకలు చేసే శక్తి ఉన్న రకరకాల భయంకర పేలుడు పదార్థాలు సృష్టించిన ఆల్ ఫ్రెడ్ నోబెల్ చనిపోయాడనుకుకుని ఆయన మీద తన కసినంతా వెలిగక్కుతూ మరణ వార్త రాశాడు.
ఆలోచింప చేసే శీర్షిక ‘The Merchant of Death is Dead’ (Le Marchand De La Mort Est Mort) (మ్యత్యు వ్యాపారి మృతి)తో ఈ వార్త రాశాడు. బహుశా ఆమాట అప్పుడు బాగా, ఆ నాటి స్థాయిలో వైరలయిందేమో.
తనని మృత్యువ్యాపారిగా వర్ణించడం ఆల్ ఫ్రెడ్ ని చాలా బాధించింది. ఒకసారి ఆయన తన గతంలోకి తొంగిచూసుకుని తన సంపద ఎలా విధ్వంసం,రక్తపాతం నుంచి వచ్చిందో సమీక్షించుకునేలా చేసింది.
ఆయన తన సంపదను సద్వినియోగ పరిచేందుకు ఒక ఫౌండేషన్ స్థాపించి ఈ ఐదు నోబెల్ బహుమతులను (భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, వైద్యం, శాంతి) ప్రటించాలని వీలునామాలో రాశాడం వెనక ఈ ఆవేదన ఉంది.
ఇక్కడ మరొక విషయం నోబెల్ బ్రహ్మచారి.
ఆయన ఎవరితో పెద్దగా కలిసే వాడు కాదు. ఎపుడూ పర్యటనల్లో ఉండే వాడు కాబట్టి బంధువులతో కూడా పెద్దగా సంబంధాలుండేవి కావు. ఆయన సింపుల్ గా రుషిగా లాగా, ఒంటరిగా బతికే వాడు.
మృత్యు వ్యాపారి అన్నందుకు నోబెల్ కు అంత కోపం ఎందుకు వచ్చింది?
ఫ్రెంచ్ జర్నలిస్టు నోబెల్ ను మృత్యు వ్యాపారిగా వర్ణించడం ఆయన్ని తీవ్రంగా బాధించింది. బహుశా జనంలో ఆయన మీద ఈ అపప్రథ ఉండి వచ్చు, దానికే జర్నలిస్టు అక్షర రూపం ఇచ్చారు.
డైనమైట్ పుట్టుక
నోబెల్ కుటుంబ వ్యాపారం యుద్ధాలకు పేలుడు పదార్థాలు సరఫరా చేయడమే.
అంటే యుద్ధాలు జరుగుతున్నపుడు వీళ్ల వ్యాపారం బాగా జరిగి లాభాలు పెరిగేవి. శాంతియుత వాతావరణతో ఈ వ్యాపారం దెబ్బతినేది.
ఆల్ ఫ్రెడ్ నోబెల్ తండ్రి ఇమాన్యుయేల్ స్వీడిష్ మందుగుండు వ్యాపారి. ఆల్ ఫ్రెండ్ చిన్నగా ఉన్నపుడు ఆయన రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ కు మకాం మార్చాడు. రష్యా సైన్యానికి మందుగుండు సామాగ్రి సరఫరా చేయడం ఆయన వ్యాపారం. అంటే ఆయుధాల వ్యాపారం అని అర్థం.
చరిత్రపోడవునా ప్రపంచమంతా యుద్ధాలలో వాడిన ఏకైన పేలుడు పదార్థం గన్ పౌడరే. పారిశ్రామిక విప్లవం రోజుల్లో రోడ్లు వేయడానికి గనులు తవ్వడానికి కొండలు పెల్చేయడానికి మరింత శక్తి వంతమయిన పదార్థాలు అవసరమయ్యాయి. దీనికోసం లావోయిసీర్, డూ పాంట్ వంటి వాళ్లు గన్ పౌడర్ ను శక్తివంతంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.మరికొందరు ఆర్గానిక్ కాంపౌండ్సును నైట్రిక్ యాసిడ్ తో ట్రీట్ చేసి కొత్త పేలుడు పదార్థాలు కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కమ్రంలో వచ్చిందే నైట్రో గ్లైసరిన్ (Nitroglycerine C3H5N3O9). దీనిని స్థిరపరిచి నోబెల్ డైనమైట్ తయారు చేశారు.
ఇమాన్యుయేల్ నోబెల్ కుమారులకు రసాయన శాస్త్రంలో శిక్షణ ఇప్పించేవాడు. రసాయన శాస్త్రం అధ్యయనం చేయించేందుకు యూరోప్ అంతా తిప్పాడు. నోబెల్ ఇటాలియన్ కెమిస్టు ఆస్కానియో సెబ్రెరో తో కలసి పని చేశాడు. నెట్రో గ్లిజరిన్ ను కనుక్కున్నది (1846) ఈ సోబ్రెరో యే.
.మరొక వైపు క్రిమియన్ యుద్ధాల వల్ల ఇమాన్యుయేల్ బిజినెస్ వర్థిల్లుతూ ఉంది. అయితే యుద్ధాలయిపోగానే ఆయన వ్యాపారం కుదేలయింది.
తర్వాత తండ్రి కొడుకులు నైట్రో గ్లైసరీన్ ను నిర్మాణ రంగంలో వాడేందుకు ప్రమాదరహితంగా తయారుచేసే పనిలో పడ్డారు.
స్టాక్ హోమ్ వెళ్లిపోయి అక్కడ ఫ్యాక్టరీ తెరిచారు. ఈక్రమంలో ఫ్యాక్టరీలో ఒకసారి పెద్ద పేలుడు సంభవించింది. అందులో చాలా మందిచనిపోయారు. ఆయన చిన్న సోదరుడు కూడా ఈ ప్రమాదంలో కాలిపోయి చనిపోయాడు.
అయినా, తన ప్రయోగాలు, అంటే సురక్షితమయిన నైట్రోగ్లైజరిన్ ను తయారుచేయాలన్న ప్రయోగాలను మానుకోలేదు.
తర్వాత సిలికా మట్టితో కలిపి వాడటం వల్ల నైట్రోగ్లైజరిన్ ను సురక్షితం చేయవచ్చని కనుగొన్నారు.
ఇది విప్లవాత్మకం,ఎందుకంటే, నైట్రోగ్లిజరిన్ చాలా అస్థిరమయింది. ప్రమాదభరితమయింది. నోబెల్ కనిపెట్టిన కొత్త పదార్థానికి నైట్రోగ్లిజరిన్ శక్తి ఉంటుంది. స్థిరమయింది. దీనిని ఆయన డైనమైట్ (1867) అని పిలిచాడు.
ఆ తర్వాత ఆయన రకరకాల పేలుడు పదార్థాలు(జిలెటిన్ స్టిక్స్ కూడా) తయారు చేశారు. దాదాపు 350 పదార్థాలకు పేటెంట్లు సంపాదించారు. కత్తి అనేది తయారయితే కేవలం కూరగాయలు కోసేందుకు మాత్రమే ఎందుకు వాడతారు. అలాగే నిర్మాణం పనులలో, గనులలో పెద్ద బండలను పెల్చేందుకు సురక్థితంగా ఆయన డైనమైట్ ను కనుగొన్నా దానిని మానవ నాశనానికి కూడా వాడటం మొదలయింది.
నిర్మాణమే కాదు, విధ్వంసం కూడా మొదలయింది.పేలుడు పదార్థాల వాడకం పెరిగే కొద్ది ఆయన వ్యాపారం పెరిగింది. అందుకే ఆయనను ఫ్రెంచ్ జర్నలిస్టు ‘మర్చంట్ ఆఫ్ డెత్’ అని వర్ణించాడనిపిస్తుంది. ఆయన ఆగ్రహంలో వాస్తవం లేకపోలేదు.