సెన్సేషనల్ న్యూస్… భారత్ ను దాటి దూసుకు పోతున్న బంగ్లాదేశ్…

ఒక వైపు భారతదేశం జిడిపి పెరుగుదల అంచనా రేటును రిజర్వు బ్యాంక్ 60.9 శాతం నుంచి 6.1 శాతానికి కుదిస్తే, పొరుగు దేశం బంగ్లాదేశ్ జిడిపి గ్రోత్ రేట్ రాకెట్ లాగా దూసుకుపోతున్నది.
ఆశ్చర్యం ఏమిటంటే ఆసియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ (వేగంగా అభివృద్ధి చెందున్న ఆర్థిక వ్యవస్థ) అనే టాగ్ ను భారతదేశం కోల్పోయింది. ఇదొక విచారకరమయిన విషయం.
అయితే మరొక విచారకరమయిన విషయమేటంటే ఏసియన్ డెవెలప్ మెంట్ బ్యాంక్ (ADB) ఈ ట్యాగ్ ను బంగ్లాదేశ్ కు తగిలించింది.
ఇంతవరక ఆసియా పేద దేశంగా ఉన్న బంగ్లాదేశ్ గత ఆర్థిక సంవత్సరంలో 8.1 శాతం రేటు అభివృద్ది రేటు సాధించి చూపించింది.
భారతదేశ ప్రగతి రేటు ఎంతో తెలుసా? 6.8 శాతమే.
ఇపుడు రిజర్వు బ్యాంక్ ఇండియా ఈ ఏడాది గ్రోత్ ఫోర్ కాస్టును 6.1 శాతానికి తగ్గించింది. బంగ్లాదేశ్ వృద్ధి రేటు 8.3 శాతానికి పెరిగేఅవకాశం ఉందనేది ఎడిబి ఫోర్ కాస్ట్.
2019 ఆర్థిక ప్రగతి ADB అంచనాలివి:ఇండియా 7.2 శాతం, పాకిస్తాన్ 3.9 శాతం, వియత్నాం 6.8 శాతం, ధాయ్ లాండ్ 3.9 శాతం,మలేషియా 4.5 శాతం, మయన్మార్ 2.5 శాతం,హాంకాంగ్ 2.5 శాతం, నేపాల్ 6.2 శాతం, శ్రీలంక 3.6 శాతం. బంగ్లాదేశ్ 8 శాతం.
అయితే, బంగ్లాదేశ్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ మాత్రం 2019-2020లో జిడిపి 8.13 శాతం పెరుగుతుందని అంచనా వేసింది.
బంగ్లాతలసరి ఆదాయం బాగా పెరిగింది. 2006లొ కేవలం 543 డాలర్లున్న పర్ క్యాపిటా ఇన్ కం 2019 నాటికి 2000 డాలర్లకు పెరిగింది. న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వచ్చిన ఒక రిపోర్టు ప్రకారం బంగ్లా ఎగుమతులుకూడా బాగా పెరిగాయి.
గత 12 సంవత్సరాలలో ఈ దేశ ఎగుమతులు మూడింతలుపెరిగాయి. వాటివిలువ 40.53 బిలియన్ డాలర్లకు చేరింది. బంగ్లాదేశ్ దగ్గిర 33 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ఉందని ఏషియన్ డెవెలప్ మెంట్ బ్యాంకు పేర్కొంది.
దీనితో ఏషియా-పసిఫిక్ ప్రాంతంలో బంగ్లాదేశ అగ్రగామి దేశమయిందని బ్యాంకు వ్యాఖ్యానించింది.
శుక్రవారం నాడు పారిశ్రామిక వేత్తలతో మాట్లాడుతూ ప్రధాని షేక్ హసీనా ,‘‘ బంగ్లాదేశ వస్త్రాల ఎగుమతులలో ఏసియాలో రెండో పెద్ద ఎతుమతి దారు, వరిపంటంలో నాలుగో స్థానంలో, విదేశాలనుంచి వస్తున్న రెమిటాన్సెస్ లో ఎనిమిదో స్థానంలో ఉంది,’’ అని పేర్కొన్నారు.
ఇటీవల బంగ్లాదేశ్ లో ప్రాథమిక వసతుల రంగం మీద విపరీతంగా ఖర్చు చేసింది.దీనితో ఉపాధికల్పన పెరిగింది. బంగ్లాదేశ్ నిరుద్యోగం 4.3 శాతానికి పడిపోయింది. ఇండియాలో ఇది 8.4 శాతం.