వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. తాగి తన మాట విననివాళ్ల ఇళ్లమీదకు,తన గురించి వ్యతిరేకంగా రాసిన వాళ్ల ఇళ్ల మీదకు వెళ్తున్నారు. గొడవచేస్తున్నారు.
ఈ సారి ఒక ఎంపిడివొ ఇంటి మీదకు వెళ్లారు ,ఆమె లేదని తెలిసి తల్లిని నానామాటలాడి, చిన్న పాటి విధ్వం సం సృష్టించాడు.
నిజానికిదంతా చూస్తే ఆయన చింతమనేని డబల్ యాక్షన్ అనిపిస్తుంది. మొత్తానికి ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి జగన్ జోక్యంతోనే  ఇపుడు అరెస్టు చేశారు.
నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో సరళ  చేసిన   ఫిర్యాదుతో  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆదివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు.
కోటంరెడ్డి తన ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేశారని, దాడి చేసేందుకూ ప్రయత్నించారని నిన్న సరళ ఫిర్యాదు చేశారు. ఆమె ఇంటి మీద జరిగిన దాడి పెద్ద సంచలన సృష్టించింది.
గత అయిదేళ్ల కోటం రెడ్డి నియోజకవర్గంలో పాదయాత్రలతో గడిపాడు. అపుడంతా ఆయనను చాలా మందివాడు,నియోజకవర్గంలో బాగా తిరుగుతున్నాడు,ప్రజల్లో కష్టపడి చేస్తున్నాడునుకున్నారు.దానికితోడు చీటికి మాటికి ప్రజాసమస్యలని ధర్నాలు, హెచ్చరికలు చేస్తుంటే ఆయన ప్రజా పోరాటయోధుడనుకున్నారు. ఆయన ఎంత బిజిగా ఈ కార్యక్రమాల్లో ఉండే వారంటే, చివరకు జగన్ యాత్రల్లో కూడా మినిమమే కనిపించేవారు.అయితే, ఈ రెండో సారి ఎమ్మెల్యే అయ్యాక  ఆయన లో మార్పు వచ్చింది.
ఆయన తాగి వెళ్లి దాడి చేయడమనేది తీవ్రమయిన విషయంగా పేర్కొంటున్నారు. ఆయన విషయంలో సీరియస్ గా వ్యవహరించకపోతే, చింతమనేని విషయంలో టిడిపికి వచ్చిన చెడ్డపేరు వైసిపికి వస్తుందని పార్టీమేలుకోరే వారే ముఖ్యమంత్రి జగన్ కు లేఖలు రాశారు.
దీనితో వ్యవహారం సిఎంవో దాకా వెళ్లింది. సిఎం ఆగ్రహించారని చెబుతున్నారు. ఎంపిడివొ సరళ మీద జరిగిన దాడిమీద ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు చివరకు   కోటంరెడ్డి దాడి చేశారనడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని తేల్చారు.
ఆపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
 నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో జీవీఆర్ కృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డిల లేఔట్ కు వాటర్ కనెక్షన్ ఇచ్చే విషయమై ఎంపీడీవో, కోటంరెడ్డి మధ్య వివాదం తలెత్తిందన్న సంగతి తెలిసిందే. మధ్యలో ఈయనకు సంబంధమేమిటి? ఎమ్మెల్యే స్వయంగా సెటిల్మెంట్ కు వెళ్లడమేమిటని అంతా ఆశ్చర్యపోతున్నారు.
కోటంరెడ్డి దురుసు ప్రవర్తన మీద విమర్శులు రావడంతో ,‘ చట్టం ముందు అందరూ సమానమే.  అనుచితంగా ప్రవర్తించే వారు ఎవరైనా ఉపేక్షించ వద్దు,’ అని   ముఖ్యమంత్రి జగన్  డీజీపీ గౌతమ్ సవాంగ్ కు చెప్పినట్లు తెలిసింది.
దీనితో కోటంరెడ్డి అరెస్ట్ కాకతప్పలేదు.
అయితే, ఇందులో కుట్రవుందని కోటంరెడ్డి ఆరోపిస్తున్నారు.విచారణలోనిజాలు తెలుస్తాయని ఆయన అరెస్టయిన సందర్భంగా వ్యాఖ్యానించారు. తాను ఎంపి డివొ ఇంటి మీద దాడిచేయనేలేదని,అసలు వెళ్లనే లేదని అంటూ తాను చెప్పు చేసినట్లు రుజువయితే రాజకీయాలనుంచి తప్పుకుంటానని కోటంరెడ్డి చెప్పారు.