మన ముందున్న ముప్పు మీద అంతర్జాతీయ సదస్సు

ఇటీవల కాలంలో ప్రపంచ మానవాళి చేస్తున్న విధ్వంస కరమైన అభివృద్ధి నమూనా లో అనంత కోటి జీవ రాశులు అంతరించి పోయే ప్రమాదం ఏర్పడింది.,వాతావరణం లో వస్తున్న మార్పులు ప్రపంచ దేశాల ను ఆందోళన కు గురి చేస్తున్నాయి.
ఆయా దేశాల పాలకులు ఏమిచేయాలో తెలియక ప్రజలనుండి వచ్చే డిమాండ్ లు, పర్యా వరణ వేత్తల హెచ్చరికలు వలన వాటిని తట్టు కోవడం కోసం, నివారణ చర్యలు తీసుకుంటామని ఎప్పటి కప్పుడు రక రకాల విధానాలు పద్దతులు రూపొందిస్తున్నారు కానీ ఆచరించటం లేదు.

ఈ క్రమం లో ప్రతీ ఏటా “యునైటెడ్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్” నిర్వహించి సభ్య దేశాలు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ దుబాయ్ (ఎక్స్ పో సిటీ) లో కోప్ -28(కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్) సదస్సు వచ్చే నవంబర్ 30 వతేదీ నుండీ డిసెంబరు 12 వరకు జరుగుతుంది.

మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఒప్పందాల పై మన దేశం కూడా సంతకం చేసింది. అభివృద్ధి పేరుతో యూరప్ దేశాల తో పోటీ పడటానికి మన దేశంలో ఉన్న విస్తారమైన భూములను, అడవులను, సముద్రాన్ని, ఖనిజాల ను ద్వంసం చేస్తూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు.

భారత దేశం విషయానికి వచ్చేసరికి ప్రపంచ కాలుష్య కారక దేశాల లో మనం 8 వ స్థానం లో ఉన్నామని “ప్రపంచ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ – 2022 స్పష్టం చేసింది.

ఢిల్లీ నగర పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. మనం ప్రపంచ దేశాల అనుభవాల నుంచి నేర్చుకోవాల్సింది, చాలా ఉంది.

మానవ తప్పిదాల వల్లే ఇంత పర్యావరణ విధ్వంసం  జరుగుతుంది. ఒక వైపు హిమనీ నదాలు కరిగి పోతున్నాయి. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి.
విపరీతంగా ప్లాస్టిక్ వాడకం వల్ల, వ్యర్ధాలు సముద్రాల్లో వేయడం సముద్ర జీవరాశులు అంత రించి పోతున్నాయని పర్యా వరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు.

అభివృద్ధి పేరుతో మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాము. మేన్ మేడ్ డిజాస్టర్ లు సృష్టిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.

సాంకేతికంగా ఎంతో అభివృద్ది చెందిన దేశంగా భారత్ అవతరించి జబ్బలు చరుచు కుంటుంది. కానీ ప్రజలను పేదరికం నుండి బయట పడేసే పథకాలు, విధానాలు అమలు చేయటం లేదు.

భూ వాతావరణం 2030 నాటికి 4.5.సెల్సియస్ డిగ్రీలు పెరుగు తుందని అంచనా. మంచు పర్వతాలు కరిగి, సముద్ర మట్టాలు 300 అడుగు లు పెరిగే ప్రమాదం ఉంది. ఓజోన్ పొర కు కన్నం పడి ఉష్ణోగ్రత లు పెరుగు తున్నాయి.

వీట్నిటికంటే ముఖ్యంగా, ఆహార భద్రతకు ముప్పు పొంచి ఉంది.

, సామాన్య ప్రజలు తీవ్ర మైన అనారోగ్య సమస్య లు ఎదుర్కొంటున్నారు.ఊపిరి పీల్చ లేక పోవడం, కేన్సర్, కిడ్నీల పనితీరు పాడవడం, తల నొప్పి మొదలగు జబ్బుల బారిన పడుతున్నారు.పెద్ద నగరాల లో వాహనాల నుండి వెలువడే పొగ, వాయు కాలుష్యము వలన విష పూరితం మబ్బులు కమ్ము కుంటున్నాయి. పొగ మంచు దట్టంగా పెరిగి పోతుంది.

అభివృద్ధి పేరుతో అనేక రకాల ప్రాజెక్ట్ లు అనగా రోడ్లు రైల్వే పరిశ్రమ లు,నీటిపారుదల ప్రాజెక్ట్ లు, ఫార్మా కంపెనీలు ఎస్.ఇ.జెడ్ లు, ఎయిర్ పోర్టు నిర్మాణం ఇలా అనేక మైన వాటి కోసం ప్రభుత్వాలు ప్రజల నుండి భూములు సేకరిస్తున్నారు. పర్యావరణం లో వచ్చే మార్పులు వలన వ్యవసాయ రంగం సంక్షోభం లో పడ్తుంది. అకాల అధిక వర్షాలు , వరదలు కరువులు,విపరీత మైన చలి గాలి, అధిక వేడి ఇవన్నీ వ్యవసాయ అనుకూల వాతావరణం పాడేయ్యేల చేస్తున్నాయి.
పంట దిగుబడి తగ్గటం వలన ఆహార సంక్షోభం ఏర్పడుతుంది.
పేదల కు నాణ్యత కలిగిన ఆహారం లభించటం లేదు. కరువులు వచ్చి ఆహార భద్రతకు ముప్పు ఏర్పడి జీవనోపాధి కోసం ప్రజలు వలస బాట పడుతున్నారు.

వ్యవసాయ రంగం లో వచ్చిన యంత్రాలు వాడకం వల్ల, రసాయన ఎరువులు పురుగు మందులు వాడటం వలన భూసారం పాడై పోతుంది. విత్తన కంపెనీలు,నూతన వంగడాలు, ప్రవేశ పెట్టే సీడ్ సాగు పద్ధతులు వల్ల పంట దిగుబడులు తగ్గుతున్నాయి. తక్కువ పోషక విలువలు కలిగిన ఆహారం ఉత్పత్తి చేస్తున్నారు.
విపరీతంగా భూ గర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు ఎండిపోతున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వ్యవసాయ రంగం గురించి పట్టించు కోవడం లేదు.

రైతులు చెమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కోసం రోడ్లు ఎక్కాల్సిన దుస్థితి.
చేసిన అప్పులు తీరక ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు.

వ్యవసాయ కూలీలు ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను వెతుక్కుంటూ పట్టణాలకు వలసలు పోతున్నారు.
పోలవరం ప్రాజెక్టు లో వేలాది ఎకరాలు అడవి, లక్షలాది ఎకరాలు సాగు భూమి మునిగి పోతుంది. వీటిపై ఆధార పడిన సుమారు నాలుగు లక్షల మంది, ఆదివాసీలు, దళితులు, రైతులు నిర్వాసితులు అవుతున్నారు.

ఫారెస్ట్ కన్వర్షన్ బిల్లు తెచ్చి కేంద్రం విస్తారమైన అటవీ ప్రాంతం ను ఓపెన్ మార్కెట్ చేసి నూతన ఆర్థిక విధానాల ద్వారా స్థానిక ప్రజల నుండి లాక్కొని కంపెనీల కు ఇవ్వాలని చూస్తుంది.

సముద్ర తీరాలలో భూమి కోతకు గురవుతూ ఉండడం వల్ల,మత్యకారులకు ఆవాసాలు, ఉపాధి కరువవు తుంది.
ఆక్వా సాగు దెబ్బతిని, ఎగుమతులు లేక రైతులు నష్ట పోయారు.
కేంద్ర ప్రభుత్వం “నేషనల్ మిషన్ ఫర్ సస్టైన్ బుల్ అగ్రి కల్చర్” మరియు నేషనల్ ఏక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ లాంటి కార్య క్రమాలు ద్వారా వాతావరణ మార్పులు తేవాలని విధానాల రూప కల్పన చేసింది. కానీ ఆశించిన ఫలితాలు రావడం లేదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం దుర్భిక్ష ప్రాంతాల ను గుర్తించాలి.
వాతావరణ మార్పులు, ఆరోగ్య కరంగా, తిరిగి పునరుద్ధరణ కోసం వ్యసాయ రంగంలో పద్దతులు, పరిస్థితుల కు తగ్గట్టుగా, దీర్ఘకాలిక ప్రయోజనాలు సమకూర్చే ప్రజా అనుకూల విధానాల ద్వారా వాతావరణ మార్పులు సాధించ వచ్చని ఆశిస్తూ మన రాష్ట్రం లో

అక్టోబరు 2 గాంధీ జయంతి నుండీ 16 వరకు ప్రపంచ ఆకలి దినం వరకు” ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ వృత్తి దారుల యూనియన్ “అలాగే జాతీయ స్థాయిలో “నేషనల్ అగ్రికల్చర్ ఏలిడ్ వర్కర్స్ యూనియన్” లాంటి సంఘాల తో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

ఆయా ప్రాంతాల్లో, ప్రజలతో మమేకమై వారి వారి సమస్య లు పై, అటవీ భూమి కి మహిళలు పేరుతో హక్కులు, ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టం అమలు, జీ.ఓ.నెంబరు 3 ఖచ్చితంగా అమలు చేయాలని,ఇండ్ల స్థలాలు,స్మశాన వాటిక స్థలాలు, పేదలు సాగుచేసు కుంటున్న ప్రభుత్వ భూముల కు డి.ఫారం పట్టాలు కోసం, పోలవరం ప్రాజెక్టు లో భూములు కోల్పోయిన వారికి భూమికి భూమి, నష్ట పరిహారం చెల్లించాలని , రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని, వ్యవసాయ రంగం లో సుస్థిర సాగు పద్ధతులు ప్రోత్సహించాలి అని అనేకమైన డిమాండ్ల సాధనకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ కార్య క్రమం లో మేధావులు, మానవ హక్కుల కార్య కర్తలు, మీడియా కలిసి రావాలని కోరుకుందాం.

-ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తి దారుల యూనియన్ రాష్ట్ర కమిటీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *