శరవేగంగా ‘వెనక్కి తిరిగి చూడకు’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు

 

* మెస్మరైజ్ చేసే స్పెషల్ ఎఫెక్ట్స్
* ఫోక్ సాంగ్ లో పొట్టిమామ డ్యాన్స్
* కీ రోల్ లో విరూపాక్ష క్రిష్ణేశ్వరర్రావు

‘వెనక్కి తిరిగి చూడకు’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు హైదరాబాద్ లో నిర్విరామంగా జరుగుతున్నాయి. శివాజీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డైరెక్టర్ శివప్రసాద్. ఈ మూవీలో స్పెషల్ ఎఫెక్ట్స్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తాయని శివప్రసాద్ అన్నారు. పూర్తి గ్రామీణ వాతావరణంలో తెరకెక్కిన ఈ సినిమాలో సన్నివేశాలు ఆకట్టుకుంటాయని భరోసా ఇస్తున్నారు. ఎక్కడా బోర్ లేకుండా ఏ సీన్ కా సీన్ ఉత్కంఠను రేకెత్తేలా తెరకెక్కించినట్లు తెలిపారు. ఇది కొత్తదనంతో కూడిన ఓ అందమైన ప్రేమకథ అని చెప్పారు. ఇందులో అనుకోకుండా జరిగే పరిస్థితులు, పర్యవసనాలు కీలక మలుపు అన్నారు. 90 శాతం అవుట్ డోర్ లోనే షూటింగ్ చేశామన్నారు.


మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణమని… లీలా మోహన్ సంగీత సారధ్యంలో రెండు పాటలు ఉన్నాయన్నారు. యుట్యూబ్ స్టార్ పొట్టిమామతో తీసిన ఫోక్ సాంగ్ ఈ మూవీకి అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు.

విరూపాక్ష ఫేమ్ క్రిష్ణేశ్వర్రావు పాత్ర సినిమాకు ఎస్సేట్ అన్నారు నిర్మాతల్లో ఒకరైన తిరుమలేశ్వరరావు. చీరాలలోని సముద్రతీర ప్రాంతాలు, కోటప్పకొండలోని సుందర ద్రశ్యాలు, ఇంకా గుంటూరు జిల్లాల్లోని అందమైన లొకేషన్లలో సినిమా షూటింగ్ జరిపినట్లు వివరించారు. హర్రర్ నేపథ్యంలో వస్తున్న మా ‘వెనక్కి తిరిగి చూడకు’ సినిమాలో చిన్నారుల ఎపిసోడ్ హైలెట్ గా నిలుస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా మూవీ నచ్చుతుందన్నారు తిరుమలేశ్వర్రావు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *