సిద్ధిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రం 9అడుగుల ఎత్తైన జైనతీర్థంకరుని శిల్పంతో ప్రసిద్ధికెక్కింది. నంగునూరులోని పాటిగడ్డమీద మరిన్ని జైనశిల్పాల ఆనవాళ్ళను కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించాడు.
వీటిలో తల, నడుం కిందిభాగం విరిగిన జైన తీర్థంకరుడు మహావీరుని విగ్రహం, విగ్రహానికి సంబంధించిన ఆధారపీఠం,(అధిష్టానం )ఆ పీఠంపై మూడు సింహాలు చెక్కబడివున్నాయి.
వీటిలో తల, నడుం కిందిభాగం విరిగిన జైన తీర్థంకరుడు మహావీరుని విగ్రహం, విగ్రహానికి సంబంధించిన ఆధారపీఠం,(అధిష్టానం )ఆ పీఠంపై మూడు సింహాలు చెక్కబడివున్నాయి. ఈ సింహాలు మహావీరుని అధికార లాంఛనం. మరొక శిల్పం జైన ప్రతిమాలక్షణశాస్త్రం ప్రకారం జైన తీర్థంకరుడు నేమినాథుని శాసనదేవత ఆమ్రకూష్మాండిని పూర్తిశిల్పంలో చిన్న భాగం. సింహంపై కూర్చొనివున్న బాలుడు ఆమ్రకూష్మాండిని పుత్రులలో ఒకడు. ఈ శిల్పాలు రాష్ట్రకూటశైలికి(8,9వ శతాబ్దాల కాలం) చెందినవి. ఇటువంటి విరిగిన ఒక విగ్రహ శకలం భువనగిరి ఖిల్లాకు ఎదురుగా కుమ్మరివాడలో కూడా లభించింది. సంపూర్ణమైన శిల్పం జనగామ జిల్లా సిద్దెంకిగుట్ట మీద చెక్కివున్నది.