గద్దర్ : ఒక జ్ఞాపకం

–మలసాని శ్రీనివాస్

రాజ్యాన్ని (State) వరదలా హోరెత్తించే గొంతుతో సవాల్ చేసిన భారతదేశంలో ఏకైక కళాకారుడు గద్దర్ అని నా అభిప్రాయం.

1981 మే నెలలో నెల్లూరు టౌన్లో కనకమహల్ ధియేటర్ లో గద్దర్, వంగపండు, నరసింగరావుల తృయం 40 మంది బాలలకు పాట-ఆట లపై తర్పీదు ఇచ్చారు. నెల రోజుల పాటు గద్దర్ తో గడిపిన బృందంలో అప్పటికి 14 ఏళ్ల బాలుడునైన నేను ఒకడిని.

ఆయనతో గడిపిన నెల రోజుల జ్ఞాపకాలు నేటికీ రక్తాన్ని ఉరకలెత్తించే ఊరించే ఊటబావే. ఆయన అమరుడు పీడిత ప్రజల పక్షాన నిలిచిన కళాకారుడు. ఆయన పాట విని విప్లవోద్యమంలోకి వచ్చిన వారు వేలాదిమంది. వారిలో నక్సలైట్ పార్టీలో కేంద్ర కమిటీ స్థాయికి చేరిన వారు పదుల సంఖ్యలో ఉన్నారు. వందల మంది ఎన్ కౌంటర్లో చనిపోయిన అమరవీరులున్నారు. భారతదేశ ప్రజా ఉద్యమ చరిత్రలో ఆయన పాత్ర చిరస్మరణీయం. మావో అన్నట్లు “ప్రజల కోసం బతకడం-మరణించడం హిమాలయాలకంటే ఉన్నతమైనది”.

వృద్ధాప్యం కారణంగా కొద్ది కాలం మినహా గద్దర్ జీవితం ప్రజల పక్షాన నిలిచి పాడిన-ఆడిన చరిత్రే. ప్రపంచ విప్లవ కళా ఉద్యమంలో ఒక పాల్ రాబ్సన్, ఒక గద్దర్. ఆయన మరణం సహజం.

ఆయన బతికిన తీరు ఆదర్శనీయం. ప్రజల కష్టాలను కన్నీళ్లను పాట రూపంలో తుపాకీ తూటాగా భూస్వాములపైనా, కంపెనీ యజమానులపైనా, రాజ్యవ్యవస్థపైనా ప్రయోగించి “ప్రజాయుద్ధనౌక” అనిపించుకొన్న యోధుడు గద్దర్ గారికి నమస్కారం.

(మలసాని శ్రీనివాస్ , జర్నలిస్టు, కాకినాడ)

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *