అదొక అద్భుత మార్మికానందం – వాగేటి కోన

*భూమన్

తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో దట్టమైన శేషాచల అడవిలో అద్భుత జలపాతాల సరసన ఈ సారి ట్రక్కింగ్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాదాపు 90 మందిని జత కూడుకునాము . ఈ ఎండాకాలం ఎక్కడికీ పోదాం అని ఆవు రావు రమని ఉంటున్న మిత్రులం తా సార్ ఈ మారు మంచి ట్రక్కింగ్ వేయండంటే ముందుగా మా టీం లీడర్ బాచికి చెబితే గుంజన కు పోదాం సర్, మిమ్మల్ని తాడుగట్టి గుంజన లోకి దించుచాలనే నా కోరిక ఈ మారైన నెరవేరాలంటే సరే అన్నాను ఆ తర్వాత లేదు సార్ మీరేప్పుడో గుంజన కిందికి పోవాలనుకున్నారు కదా ,అక్కడికైతే ఒక రాత్రి బాసతో ట్రక్కింగ్ ఉంటుందంటే ,దేని కైనా సరే అన్నట్టు గానే భరోసా కదా మా వాళ్ళకి సరేనన్నాను .బాగా ఎండలు వడ బెడుతున్నాయి. శనివారం జర్నలిస్టుల ZOOM మీటింగు, ఆ వెంటనే senate hall లో రోడ్లు మీద సభ భాగంగా ఉన్న మాటకు కట్టుబడి ఆ ఎండలకు ఎదురీది రెండు రోజుల ప్రయాణానికి సిద్ధమైనాను నేను మా శీను తో కలసి .కుక్కల దొడ్డికి చేరగానే అందరం ద్విచక్ర వాహనాలు, జీపులు ,కార్లల్లో దాదాపు 90 మంది పొగైనారు .శెట్టిగుంట దగ్గర నుండి పచ్చటి పరింగాయలు, అరటి తోటల మధ్యన చాలా ఆహ్లాదకరంగా సాగింది పయనం. చెరువు బాగా ఎండిపోయింది కొద్ది నీళ్లు మాటున అక్కడక్కడ రెడ్ శాండిల్ చెట్లు, కొంగలు,ఆ సూర్యాస్త సమయాన గొప్ప అనుభూతి తో అందరం ఫోటోలకీ దిగిన నడక మొదలు పెట్టినాము.ఏ టెంబడి సాగుతున్నది నడక . అన్ని రాళ్లే , గులకలే . ఎక్కడ కానీ మైదానం లేదు . ఏట వాలున్నా కొండలు.ఆ కొండలన్నీ పట్టుచీరలు కట్టుకొని సింగారించుకున్నట్టుగా మహాద్భుతంగా ఉన్నాయి .అదొక కనుల పండుగే.అందరం ఈ వాగేటి కోన పూర్వపరాలు తెలుసుకుంటూ, ప్రకృతిలో భాగమైనందుకు మాకు మేము గర్వపడుతూ, తుళ్లుతూ,పడుతూ లేస్తూ సాగుతున్నాము .ఇంతలో ఒక నీటి మడుగు.అది తొలిది. ఇట్లాంటివి 11 ఉంటాయని మా F R O ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. ఇంత మటుకేనా అంటే కాదు సార్ ముందు ముందు అన్ని మడుగులు ఈతతోనే అంటున్నాడు.సరే కానీమ్మనీ ఉత్సాహంగా ముందుకు సాగా రాత్రి 7 గంటలకు ఒక స్థావరం ఎన్నుకున్నాము .

పక్కనే నీటిమడుగు .నీళ్లు అత్యంత స్వచ్ఛంగా ఉన్నాయి. కొండల అంచున ఆ మడుగు బాగా ఆకర్షకంగా ఉంది.ఉన్న ఫలానా కొందరం నీళ్లల్లోకి దూకి బాగా ఈదులాడి తెచ్చుకున్న తిండి ఏదో తిని ,ఆకులు అలమలు ఏరుకొచ్చి పడక సిద్ధం చేసుకుని నిద్రకు ఉపక్రమించనాము. నిద్రొస్తే కదా. చుట్టూ కొండలు, పక్కన మడుగు, కీచురాళ్ల శబ్దాలు,మధ్య మధ్యన కణుతుల అరుపులు, ఎలుగుబండ్ల కేకలు పైన నక్షత్ర కాంతులతో అలరారుతున్న ప్రకాశవంతమైన ఆకాశం.ఎంతటి అదృష్టవంతులం రా మేము అనుకుంటూ అలా కునుకు తీసి కళ్ళు తెరిచి చూస్తే మహాద్భుత చోటున మేం వర్ణించ వీలు గాని ఆ సౌందర్య రాశుల మధ్యన నన్ను నేను పోగొట్టుకున్నాను.

అందరం రేయి అయ్యి గుంజన కింద భాగానికి నడక మొదలు పెట్టినాము. పొద్దుటికి మరో 20 మంది వచ్చి చేరినారు. మేం నలుగురం ముందుగానే బయలుదేరినాము .దాదాపు ఐదు గుండాలు దాటుకుంటూ, దాటుకుంటూ అంటే ఈతాడుతూ ఈతరాణి వారికి దారం కట్టే, ట్యూబుల ద్వారా ఒడ్డుకు చేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు, ప్రతి అంగుళం వదిలిపెట్టి రాబుద్ధి గావడం లేదు.ఆ కొండలు ,ఆ మలుపులు, ఆ ఎర్రచందనపు అందాలు కట్టి పడేస్తున్నాయి. చివరిగుండం చాలా పెద్దది శేషాచలకు అడవులలో శీను చూసిన అన్ని గుండాల కన్నా పెద్దది. దాదాపు 100మీటర్లు పొడవుంది లోతు 50 మీటర్లకు తక్కువ ఉండదంటున్నారు.అంత దూరం ఈతాడడం కష్టమేమో సార్ అంటే రండయ్య నీళ్లలోకి దూకి వాన పెట్టున జలపాతపు అంచుకు చేరుకోవడం ఒక గొప్ప సాహసం.

 

 

 

 

నాగు రెగ్యులర్ ఈత అలవాటు కావడం వల్ల ఇదేమంత కష్టంగా అనిపించలేదు. కొన్ని పదుల సార్లు గుంజన జలపాతాన్ని పైనుండి చూశాను కానీ కింద నుండి చూడటం ఇదే తొలిసారి .పై భాగాన ఉన్న జలపాతం మా కంటికి అంద లేదు కొండల మలుపుల మధ్య ఉంది .ఆపెద్ద జలపాతం కింద ఒక గుండం దాని కింద ఇంకొకటి, మేము దిగిన ఆ పెద్దగుండం మూడోది. వర్షాకాలం అయితే వచ్చే ప్రసక్తే ఉండదు .జోరున కురిసే జలపాతాల మధ్యన మేం నడిచిన దారంతా నీటి మయమే. ఇది మంచి సీజన్ గనుక అక్కడక్కడ నీరు చల్లిన ఆ స్వచ్చ నీటి గుండాల గుండా దాదాపు 7 గుండాలను దాటుకుంటూ మొత్తం ఏటి రాళ్ల కాల్వగుండ నడుచుకుంటూ పోవడం అదొక మరుపురాని సహస్రయాత్ర. ఆ గుండంలో తనివి తీరా ఈదులాడి ,జలపాతపు నీటి అంచున సయ్యాటలాడుతూ దాదాపు గంటకు పైగా ఉండి వెనుతిరిగినాము.

 

మేం పయనించిన ఆ దారి వాగేటి కోన . దాదాపు రానుపోను దూరం పది కిలోమీటర్లు పైనే. మైదానంలో నైతే అది 22 కిలోమీటర్లు పై మాటే. ఇంత అద్భుతమైన సౌందర్య రాశులను వెదజల్లిన ఆ ప్రకృతి ఒడికి ఒక నమస్కారం వదిలి వెనుదిరిగా లేక తప్పదు కనుక వెనక్కి వచ్చి మా భాస్కర విశ్వనాథ్ చేతి వంట వేడి వేడి సాంబార్ అన్నం తింటుంటే. తిందంటే ఇదే కదా అనుకొని అందరం భోజనాలు ముగించుకొని గ్రూపు ఫోటో దిగి ,మా FRO లను, బెంగళూరు నుండి వచ్చిన ISRO సైంటిస్ట్,మొన్న చంద్రయాన్ ప్రయోగంలో కీలక పాత్రవహించిన హరినాథ్ శర్మ ను ,మా టీం లీడర్ బాచిని ,నా అనుంగు శిష్యుడు శీను, మా ఆడివి గైడ్ మణి ని సన్మానించి తిరుగు ప్రయాణమైనాను.

ఈ వాగేటి కోన మా ట్రక్కింగు లోనే ఒక తలమానికం.ప్రకృతి బాట పట్టిన మమ్మల్ని గొప్పగా ఆదరించిన ఆ జలపాతపు సొగసుల్ని మా గుంజన హోయలును గుండెల్నిండా పదిల పరుచుకుని ఎవరెవరి ఇండ్లకు వాళ్లం చేరినాము.
మా ఈ ప్రకృతి యాత్ర పది మందికి చేరువ కావాలని ,పది మందీ ఆరోగ్యకరంగా మనుగడ సాధించాలనేది మా లక్ష్యం ఆశయం

One thought on “అదొక అద్భుత మార్మికానందం – వాగేటి కోన

  1. సూపర్ సార్…
    మీరు చెప్పిన తీరు మేము మీతో పాటే వచ్చినట్లు అనిపించింది….ఎంతైనా మీరు అదృష్టవంతులు…మీరు వంద సంవత్సరాలు ఇలాగే ప్రకృతిలో తరించాలని నా ఆశ..ఆకాంక్ష…
    మీ శిష్యుడు
    పేటశ్రీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *