మరో కోనసముద్రం అనిపించే నర్మెట్ట ఇనుం పరిశ్రమ
కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ నర్మెట గ్రామం బయట ఇనుము తయారీ బట్టిని గుర్తించాడు.
ఆ తావులో బట్టీ ఇటికెలతో, కాల్చిన మట్టిగొట్టాలతో నిర్మించినట్టు తెలుస్తున్నది. అక్కడ దొరికిన ఇటికెలు చాలా దృఢంగా తయారుచేయబడ్డాయి.7,8 అంగుళాల పొడవు,4 అంగుళాల వెడల్పు, 3 అంగుళాల మందంతో ఉన్నాయి ఇటికెలు. మట్టిగొట్టాలు అమర్చడానికి తగినట్టు ఇటుకలలో అర్థవృత్తాకారపు గాడులు చేయబడివున్నాయి. గొట్టాలలో కరిగించిన ఇనుం ప్రవహించేదని ఒక గొట్టంలో ఇరుక్కుని వున్న ఇనుం వల్ల తెలుస్తున్నది. ఈ ఇటికెలు, మట్టిగొట్టాల తయారీ ఆధారంగా అక్కడ 17వ శతాబ్దపునాటి ఇనుం తయారీబట్టి వుండేదని గుర్తించవచ్చు.
పూర్వ నిజామాబాద్ జిల్లా కోనసముద్రంలో ఇటువంటివే కాల్చిన మట్టిగొట్టాలు, ఇనుం చిట్టేలు లభించాయి.
క్షేత్ర పరిశోధన: కొలిపాక శ్రీనివాస్, 7799669143, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు
విషయ రచన: శ్రీరామోజు హరగోపాల్, 9949498698, కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం