కుల అత్యాచారాల పై విప్లవ కమ్యూనిస్టు డివి ఏమన్నారు?

   [ 12-07-2023  దేవులపల్లి  39 వ వర్ధంతి సందర్భంగా ]

–ఎం. కృష్ణమూర్తి 

     

కృష్ణా జిల్లాలోని కంచికచర్ల, తమిళనాడులోని కీలవెన్మణి రెంటినీ అక్కడ 1968లో జరిగిన దారుణాల వల్ల ఇప్పటికీ మరచిపోలేము. కంచికచర్లలో కోటేసు అన్న దళిత యువకుణ్ణి, కీలవెన్మణి లో 42 మంది నిరుపేద వ్యవసాయకూలీల్ని భూస్వాములు సజీవదహనం చేసారు. దుర్ఘటనలు అపూర్వ సంచలనం కల్గించి, పతాక శీర్షికలకెక్కాయి.

 

అంతగా నమోదు కాని మరో ఘటన ఒంగోలు జిల్లా భీమవరంలో ఒక హరిజనుడు‘ (ఆ రోజుల్లో ఈ పదం సర్వ సాధారణం, తర్వాత దళిత పదం స్థిరపడింది) ‘సర్పంచి అయినందున కక్షతో 1969లో భూస్వాములు పట్టపగలే అతన్ని హత్య చేసారు. హరిజన వాడపై పడి స్త్రీలను, పిల్లలను,వృధ్ధుల ను హింసించి, భీభత్సం  సృష్టించారు (పే 282) .  అలాటి ఘాతుక సంఘటనలే   ఉత్తర ప్రదేశ్, బీహార్లలోనూ జరిగాయి. వాటిని, మరికొన్ని  కొన్ని సంఘటనల్ని– ‘హరిజనులపై’, గిరిజనులపై, ఇతర  గ్రామీణ పేదలపై భూస్వాముల దాడుల్నిఉదహరించి, దేశంలో ఫ్యూడలిజాన్ని రద్దు చేయాలని చెప్తూ కోర్టులో నాల్గు రోజుల పాటు కుట్ర కేసులో తన డిఫెన్సు  వాదనను విన్పించారు కామ్రేడ్ దేవులపల్లి వేంకటేశ్వర రావు 

1947 నుంచీ, 1950 రాజ్యాంగంనుంచీ, సంస్కరణవాదుల, దళిత,బహుజన వాద ఉద్యమాల కాలం నుంచీ, కారంచేడులూ, చుండూరులూ, ఖైర్లాంజీలూ, గరగపర్రులూ కొనసాగుతూనే ఉన్నాయి.  రాజ్యాంగపర, చట్టపరసామాజిక సంస్కర్తలూ సంస్కరణలూ రావటం పోవటం  చాలా చూసాందళితులపై దోపిడీ అణచివేతలను  పట్టించుకోటంలో విఫలమైనారని పార్టీలు పరస్పరంనిత్యం  నిందించుకొంటువుంటాయి.మరోవైపు వారిని వదిలి కమ్యూనిస్టు వ్యతిరేకతతో మరికొందరు ప్రచారం సాగిసున్నారు.   

కమ్యూనిస్టులు కులసమస్యనూ, దళితుల అణచివేతనూ పట్టించుకోలేదనీ, కారంచేడు తర్వాతే ఆ సమస్యలు ముందుకొచ్చాయనీ ప్రత్యేకించి గత మూడు దశాబ్దాలుగా  ఒక ప్రచారం ఉంది. దాని గురించి యూనివర్సిటీ స్థాయి వారే కాక, ‘ఉద్యమాల ఉపాధ్యాయులు,’  రకరకాల సిధ్ధాంతకారులూ చాలా చాలా  రాసారు. తమ ముందే, తమ ఇళ్లలోనే ఉన్న దేవులపల్లి పుస్తకాన్ని విస్మరించి, కులతత్వంతో కళ్లు మూసుకుపోయిన ప్రచారాలు సాగించారు. అది తప్పుడు ప్రచారం అని వివరాలు ప్రకటించినా, ఇంకా గుడ్డిగా విష ప్రచారం సాగిస్తున్నారు.  మీ విప్లవాల విజయం దాకా ఎన్ని దారుణాలు సాగినా పట్టించు కోరా? అని ఎద్దేవా చేస్తారు. కుల సమస్యపై సిధ్ధాంత పరంగా చెప్పినవే కాక, ఆవేదనతో ఆచరణ పరంగా ఈ సమస్యను కారంచేడుకి 15 ఏళ్ల ముందే దేవులపల్లి చర్చించారు.  విప్లవాల విజయం దాకా ఆగటం కాక, వెంటనే ప్రతిఘటన చేయాలని దేవులపల్లి నొక్కి చెప్పారుమిగతా అనేకమంది కమ్యునిస్టులకూ ఆయనకూ మౌలిక తేడా ఉన్నది: 1940ల నుంచీ  భారత దేశ  గ్రామీణ స్థితిగతుల్ని లోతుగా నిర్దిష్టంగా పరిశీలించిన వ్యవసాయ విప్లవ సిధ్ధాంతఆచరణల పితామహుడుఆయనప్రసిధ్ధి గాంచిన తన  కోర్టు స్టేట్మెంట్లో ( 1971 డిసెంబర్ లోనేఏం  చెప్పారో ఈ వ్యాసంలో  క్లుప్తంగా ఉదహరించ టమైనది. అది 1973లోభారత జనతా ప్రజాతంత్ర విప్లవంకార్యక్రమంవివరణఅన్న పుస్తక రూపంలో  వెలువడింది.  ఆపై ఇప్పటికీ నాలుగు పునర్ముద్రణలు పొందింది

పీడిత వర్గాల ప్రజలు అణిగిమణిగి పడి ఉన్నంతకాలం మాత్రమే గ్రామాల్లోప్రశాంతతకన్పడుతుందికాగా వారిలో చైతన్యం, ఆత్మాభిమానం పెరిగినా కొద్దీ వైరుధ్యాలు బైటపడుతాయి. అవి క్రమేణా తీవ్రరూపం దాలుస్తాయి.   “అన్ని రాష్ట్రాలలో భూస్వాములకు తలవంచని హరిజనులను సాంఘికంగా బహిష్కరించటం, తమ పొలాల్లోకి కూలి పనులకు రానివ్వక పోవడంపబ్లిక్ స్థలాలను ఉపయోగించు కోనివ్వక  పోవటం మామూలుగా సాగిపోతున్నది. .. హరిజనులను ఇళ్లలో నుంచి  తరిమి వేయటం, ఇళ్ళను తగలబెట్టడం లాంటి ఘాతుకాలు ..” అనేకం జరుగుతున్నాయి ( కుల వ్యవస్థ, పే.189 ).పాత తెలంగాణలోబీహారు రాజస్థాన్ ఉత్తరప్రదేశ్  లాటి చోట్లరాయలసీమలో తుపాకు లతో కూడా దౌర్జన్యాలు సాగుతుంటాయి. వాటిని గూర్చి  ఇలా రాసారు:  

నేడు ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయివీటిలో కొన్ని మాత్రమే వార్తాపత్రికల ద్వారా ప్రపంచం దృష్టికి వస్తున్నాయి. భూస్వాములు, వారి గూండాలు సాయుధులై తుపాకులతో నిర్మాణయుతంగా పేద రైతు కూలీలపై దాడి చేయటం అన్ని సంఘటనలలో సర్వసాధారణమైన అంశంగా ఉంటున్నది. ఇళ్లల్లో పెట్టి తగుల బెట్టటం, మంచినీటి బావులకు రానివ్వక పోవడం, పబ్లిక్ స్థలాల్లో నడవ నీయక పోవడం మామూలుగా సాగిపోతున్నది. ఇలాంటి సందర్భంలో రాజ్యాంగము చట్టాలు చూడడానికైనా కనిపించవు. ఇలాంటి సంఘటనలు జరిగిన కొద్ది రోజులకు తీరికగా పోలీసులు వెళ్లడం, క్యాంపు వేయడం జరుగుతుంది. పోలీసులు ప్రజలు భూస్వాముల పైన పగ సాధించకుండా భూస్వాములకు రక్షణ ఇవ్వడానికి ఉంటారు కానీప్రజలకు రక్షణ ఇవ్వడానికి కాదు.”

పేద ప్రజల దుస్థితిని కళ్లకు కట్టినట్టు ఇలా వర్ణిస్తారు:   “వాస్తవానికి ప్రజలకు రక్షించవలసిన అంత పెద్ద ఆస్తులు ఏమీ లేవుపెద్ద ఇళ్లు లేవు. ధాన్యపు కొట్లు లేవుబంగారం వెండి నగలు, వస్తువులు లేవుడబ్బు లేదు. వడ్డీలకి ఇచ్చిన పత్రాలు లేవువారికి ఉన్నదంతా పూరి ఇల్లు, వంట సామాగ్రి , ఇంట్లో నాలుగైదు ప్రాణాలు.. పోలీసులు వచ్చే సరికే భూస్వాములు ఇళ్లను తగులబెట్టి, వంట సామాగ్రి ఎత్తుకొని పోయికొందరి ప్రాణాలను తీసి ఉంటారుతర్వాత వారికి రక్షించుకోవటానికి మిగిలే దేమీ ఉండదు.”ఆ తర్వాత ఆయన  మనప్రజాస్వామ్యంలో జరిగే తంతుని గూర్చి ఇలా చెప్తారు

ప్రజల రక్షణకు పోలీసు వచ్చిందని చెప్పటం ప్రజలను అపహాస్యం చేయడం తప్ప వేరు కాదుఇలాంటి సంఘటనలు జరిగిన కొంతకాలానికి శాసనసభల్లోనూ , పార్లమెంటులోనూ వీటి ప్రస్తావన రావడంవార్తా పత్రికలలో వచ్చిన సంఘటన మేరకే ప్రభుత్వ ప్రతినిధులు ఏదో సమాధానం చెప్పడంతో పార్లమెంటరీ వ్యవస్థ పని అయిపోతుంది.”

తర్వాత పోలీసున్యాయవ్యవస్థలను ఇలా పేర్కొంటారు:   

పోలీసులు ఇలాంటి దుర్మార్గాలకు బాధ్యులైన వారిని తప్పించి అనామకులపై కేసు పెట్టటం, కొందరికి కొద్దిపాటి శిక్షలు పడటం మనం చూస్తున్నాము. తరచుగా పోలీసులు భూస్వాములతో కుమ్మక్కై, కేసును బలహీన పరచటంకేసులు కొట్టివేయటం జరుగుతుంది. తాత్కాలికంగా సమస్య వెనక్కి పోతుంది. ప్రజలు ఇలాంటి దురాగతాలను సహించరు వారు ప్రతిఘటించాలనే కోరుకుంటారు. (పే 282-283)  

తర్వాత ప్రజలు ప్రతిఘటించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తారు.   

ఆంధ్రదేశంలో ప్రజలు సాయుధులై సంఘటిత శక్తితో, స్వీయ రక్షణ ఉద్యమ రక్షణ చేసికొనక పోయి నట్లయితే, ప్రతి గ్రామమూ ఒక కీలవేన్మణి (తమిళనాడు) గానో, ఒక  బెహరా( ఉత్తర ప్రదేశ్) గానోరూపాస్పూర్ (బీహార్) గానో మారిపోయేది.   ఇప్పటికీ అనేక గ్రామాలలో నిరాయుధమైన పేదలను భూస్వాములు కొట్టి చంపుతు న్నట్టు అనునిత్యం మనకు వార్తలు వస్తున్నాయిగ్రామీణ పేదలంతా వ్యవసాయ విప్లవంలో పాల్గొంటూ సంఘటిత శక్తితో సాయుధం గా రక్షించుకున్నప్పుడే పరిస్థితి లేకుండా పోతుందిప్రజలను దీనికి సిద్ధం చేయటమే మా కర్తవ్యం గా స్వీకరించాము. (పే.281-288, నాల్గవ ముద్రణ, 2014, ప్రొలెటేరియన్ లైన్ ప్రచురణలు). 

ఆత్మరక్షణ చేసుకోటానికి ప్రజలు ఏమి చేయాలో తెలంగాణ తదితర పోరాటాల అనుభవాల ఆధారంగా ఇలా వివరిస్తారు:  

పరిస్థితులలో నిరాయుధమైన ప్రజలు ఆత్మరక్షణ చేసుకోవలసి వస్తే వారు తమ ప్రత్యేక విధానాలను అనుసరించవలసి వస్తున్నది; అవే విప్లవ విధానాలు. తాము స్వయంగా సంఘటిత శక్తిగా రూపొందటం, ఆయుధాలను ఉపయోగించటం  నేర్చుకోవడంఆయుధాలను సంపాదించటంఇదంతా విప్లవాత్మకంగానే సాధ్య మవుతుందిఇలా చేయగలిగినప్పుడే వారు స్వీయ రక్షణ చేసుకోగలుగుతారు. తమ సంఘటిత ఉద్యమాన్ని కాపాడు కోగలుగుతారువ్యవసాయ విప్లవాన్ని, జనతా ప్రజాతంత్ర విప్లవాన్ని జయప్రదం చేయగలుగుతారుఇదే జరగకపోతే విప్లవ ప్రతిఘాత శక్తుల సాయిధ దాడులకు ప్రజలు బలి కావాల్సిందేకీలవేన్మణి ,  బెహరా రూపాస్పూర్ అనుభవాలు దీనినే రుజువు చేస్తున్నవి.”  

అలా ఆత్మరక్షణ చేసుకొంటే కలిగే ఫలితాలను సజీవంగాఅప్పటికే జరిగిన  కీలవేన్మణి, బీహారు ఘటనల్ని, ఆతర్వాత సంభవించిన  కారంచేడు, చుండూరు వంటి సంఘటనల్ని తలపించేలా ఇలా చెప్తారు:  

పేద రైతులు సాయుధులై తమ పంటను, తమ భూమిని, తమ ఇల్లు వాకిళ్ల ను, తుదకు తమ ప్రాణాలను రక్షించుకుంటే బీహార్ లోను, ఉత్తరప్రదేశ్ లోను, తమిళనాడులోను, ఇతర అన్ని రాష్ట్రాలలోనూ జరిగిన సంఘటనల అవసరమేమీ ఉండదు. సాయుధులైన భూస్వాములు తరుముతూ ఉంటే, భయానికి ఇళ్ళలో చొరబడవలసిన పనిలేదు . దుర్మార్గులు తమ ఇళ్ళను తగుల పెడితే నిస్సహాయులై చూస్తూ, ఇళ్లలో సజీవ దహనం కావలసిన అవసరం లేదు. వారు వెంటపడి తుపాకులు  కాలిస్తే తుపాకి గుండ్లకు పిట్టల మాదిరిగా బలి కావలసిన అవసరం లేదుప్రజలు సాయుధులై ప్రతిఘటిస్తే, ప్రతిఘటనలో కొందరి ప్రాణాలు పోవచ్చును. నిర్వాసితులై, నిస్సహాయులై భూస్వాముల చేతుల్లో చచ్చేదాని కన్నా ప్రజలు సాయుధులై పోరాడి ప్రాణాలు విడవటం మంచిది. భూమి కోసం సాయుధులై పోరాడి ప్రాణాలు ఇవ్వటం మరీ మంచిది .“

(పేజీ నంబర్లు 2014, నాల్గవ ముద్రణలోనివి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *