రష్యా- ఉక్రెయిన్ యుద్ధం : చైనా  దౌత్యం మీద ఆశలు

 

                                                                  —-డాక్టర్ . యస్. జతిన్ కుమార్ 

[ గ్లోబల్ టైమ్స్, కౌంటర్ కరెంట్ కలెక్టివ్– 27/04/2023 న  అందించిన సమాచారం, రిపోర్టులు ఆధారంగా]  

ఏడాది క్రితం ఉక్రెయిన్లో మాస్కో తన సైనిక చర్యను ప్రారంభించిన తర్వాత ఉక్రేయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తో 26-04-2023 న  చాలా సేపు ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్ జెలెన్స్కీ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ బుధవారం మధ్యాహ్నం ఆయనతో మాట్లాడారు. చైనా-ఉక్రెయిన్ సంబంధాలు, ఉక్రెయిన్ సంక్షోభంపై ఇరు పక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. ఉక్రెయిన్ తో సంబంధాలను పెంపొందిం చు కోవడానికి చైనా సంసిద్ధత స్థిరంగా, స్పష్టంగా ఉందని జిన్ పింగ్ పునరుద్ఘాటించారు, శాంతిని పునరుద్ధరించడం లో, ఉక్రెయిన్ సంక్షోభాన్ని దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించడంలో చైనా కీలక పాత్ర పోషించాలని జెలెన్స్కీ స్వాగ తించారు. ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధిని బలంగా ప్రోత్సహించే చర్చ సుదీర్ఘంగా, అర్థవంతంగా ఉందని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.ఈ పరిణామం పై మీడియా రిపోర్టు లు ఇలా ఉన్నాయి.

జిన్ పింగ్, జెలెన్స్కీతో- ఉక్రెయిన్ సంక్షోభం యొక్క రాజకీయ పరిష్కారంకోసం  చర్చలు, సంప్రదింపులు మాత్రమే ఆచరణీయమైన మార్గమని అన్నారు. చైనా రగులుతున్న మంటలను చోద్యంగా చూస్తూ కూర్చోదని, అలాగే ఆ  మంటలకు ఆజ్యం పోయదని, ఆ విషమ స్థితిని అవకాశంగా  వినియోగించుకుని తాను లాభాలు ఆర్జించుకోదని జిన్ పింగ్ స్పష్టం చేశారు. ఈ వివాదం ఇంకా పెద్ద ఘర్షణగా మారే అవకాశం ఉన్నందున అన్ని పక్షాలు ప్రశాంతంగా, సంయమనంతో ఉండాలని చైనా అధ్యక్షుడు కోరారు. అణు యుద్ధంలో ఎవరూ గెలవరని ఆయన హితవు చెప్పారు.

ఈ సంభాషణ సుదీర్ఘంగా, అర్థవంతంగా ఉందని జెలెన్స్కీ ట్వీట్ చేశారు. చైనాకు తమ రాయబారి నియామకంతో పాటు ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి ఈ సంభాషణ బలమైన ప్రేరణను ఇస్తుందని ఆయన అన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం, యురేషియన్ వ్యవహారాలపై చైనా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిని ఉక్రెయిన్ మరియు ఇతర దేశాలకు పంపి వివాద పరిష్కారానికి సంబంధించి లోతైన చర్చ నిర్వహిస్తామని జిన్ పింగ్ హామీ ఇచ్చారు. 

ఇదంతా ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. మొదటిది ఉక్రెయిన్ సంక్షోభ తీవ్రత కారణంగా “చైనా-ఉక్రెయిన్ సంబంధా లను అభివృద్ధి చేయడానికి చైనా సుముఖత”లో గాని, “రెండు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన సహకార  ” లో గాని మార్పు లేదు. రెండవది, ఉక్రెయిన్ సంక్షోభంలో శాంతి నెలకొల్పడానికి  చర్చలను ప్రోత్సహించాలనే చైనా యొక్క ప్రధాన వైఖరి మారలేదు. చైనా ఈ సమస్య పట్ల దార్శనికత తో, ఆచరణాత్మక వైఖరిని తీసుకుంటున్నది.   దాన్ని బలంగా, స్థిరంగా కొనసాగిస్తున్నది, కనుక అది  ప్రపంచంలో మరింత స్పష్టంగా, బిగ్గరగా ప్రతిధ్వనిస్తున్నది. వీలైనంత త్వరగా కాల్పుల విరమణకు, శాంతి పునరుద్ధరణకు దోహదపడేలా  చైనా చేస్తున్న తాజా ప్రయత్నమిది.

 ఈ ఫిబ్రవరిలో, మాస్కో మరియు కీవ్ మధ్య శాంతి కోసం బీజింగ్ 12 పాయింట్ల రోడ్ మ్యాప్ ను ఆవిష్కరించింది.  శత్రుత్వాలకు ముగింపు పలకడానికి, మధ్యవర్తిత్వం వహించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. అనేక పాశ్చాత్య దేశాల మాదిరిగా కాకుండా, చైనా తన వ్యూహాత్మక భాగస్వామి అయిన రష్యాపై ఆంక్షలు విధించడానికి నిరాకరిం చింది. రష్యాను ఉక్రేయిన్ పై దాడిచేసిందని ఖండించ లేదు కూడా. 

గత నెలలో మాస్కో వెళ్లిన జిన్ పింగ్ అక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో సమావేశమయ్యారు. వాణిజ్యం, ఇతర రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామని ఇరు నేతలు ప్రకటించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు “ప్రపంచ చిత్రపటం లోనూ, మానవాళి భవిష్యత్తులోనూ కీలకమైన ప్రాముఖ్యతను సంతరించుకున్నా” యని జిన్పింగ్ అన్నారు.

ఉక్రెయిన్ లో చైనా ప్రత్యేక రాయబారి

ఉక్రెయిన్, ఇతర దేశాలకు దౌత్యవేత్త లీ హుయ్ ను ప్రత్యేక రాయబారిగా చైనా నియమించింది. ఉక్రెయిన్ సంక్షోభం రాజకీయ పరిష్కారంపై అన్ని పార్టీలతో లోతైన కమ్యూనికేషన్ నిర్వహించే బాధ్యతను రాయబారికి అప్పగిస్తామని జిన్ పింగ్ చెప్పారు. లీ 2009 నుంచి 2019 వరకు మాస్కోలో చైనా రాయబారిగా ఉన్నారు.

 చైనాలో ఉక్రెయిన్ రాయబారి చైనాలో తమ దేశ కొత్త రాయబారిగా మాజీ వ్యూహాత్మక పరిశ్రమల మంత్రి పావెల్ రియాబ్కిన్ను జెలెన్స్కీ నియమించారు.

 జిన్పింగ్ -జెలెన్స్కీ పిలుపు పై మాస్కో స్పందన 

ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య జరిగిన ఫోన్ కాల్ గురించి అడిగిన ప్రశ్న కు సమాధానంగా రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా ” ఉక్రెయిన్ అవాస్తవిక డిమాండ్లు శాంతి చర్చలకు అడ్డంకిగా నిలుస్తున్నాయని” అన్నారు.అర్థవంతమైన చర్చలను పునఃప్రారంభించడానికి బీజింగ్ చేస్తున్న ప్రయత్నాలను జఖరోవా ప్రశంసించారు. శాంతి మార్గం కోసం రష్యా, చైనా దార్శనికత ఒకదానికొకటి అనుగుణంగా ఉన్నాయని ఆమె అన్నారు. మంచి ప్రణాళికలు లేకపోవడమే సమస్య అని జఖరోవా అన్నారు. ఉక్రేనియన్ సంక్షోభంలోకీవ్ ప్రభుత్వం ఇంతవరకు సహేతుకమైన చొరవను స్వీకరించలేదు. చర్చలుజరిపేందుకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని అవాస్తవిక డిమాండ్లతో, అల్టిమేటమ్ లతో ముడిపెడుతోంది” అని వ్యాఖ్యానించారు. 

గత వసంతకాలంలో రష్యా, ఉక్రెయిన్ జట్లు పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించినప్పుడు చర్చలు విఫలం కావడానికి కీవ్ కారణమని రష్యా అధికార ప్రతినిధి ఆరోపించారు. ఇదిలా వుండగా, రష్యా ఇటీవల విలీనమైన భూభాగా లను సరెండర్ చేసిన తర్వాతే చర్చలు పునఃప్రారంభమవుతాయని కీవ్ పదేపదే చెబుతోంది. ఇలాంటి డిమాండ్లు ఆమోదయోగ్యం కాదని మాస్కో పేర్కొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చర్చలు జరపడం అసాధ్యమని ప్రకటించే డిక్రీపై జెలెన్స్కీఅక్టోబర్ లో సంతకం చేశారు.

 నాటో కూటమి లో ఏమి జరుగుతొంది 

ఉక్రెయిన్ విషయంలో నాటోకూటమి ఏకాభిప్రాయం తో లేదు. అమెరికా వ్యూహాలను, ఎత్తుగడలను అన్ని దేశాలు ముక్తకంఠం తో ఒప్పుకోవటం లేదు.  ముఖ్యంగా ఫ్రాన్స్ తన స్వంత విధానంలో సాగుతోంది. చైనా మధ్యవర్తి త్వంతో రష్యా-ఉక్రెయిన్ వివాదంపై దౌత్యపరమైన చర్చలు ప్రారంభించడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్   ప్రయత్నిస్తున్నారు. చైనా సహాయంతో ఈ వేసవి నాటికి రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలను పునరుద్ధరించాలని ఫ్రాన్స్ చూస్తోందని గత వారం బ్లూమ్బర్గ్ అజ్ఞాత వర్గాలను ఉటంకిస్తూ తెలిపింది. సంక్షోభాన్ని పరిష్కరించడానికి రోడ్ మ్యాప్ ను రూపొందించడంపై విదేశీ సంబంధాల ఇన్ చార్జి చైనా ఉన్నతాధికారి వాంగ్ యీతో నేరుగా కలిసి పనిచేయాలని మాక్రాన్ తన విదేశాంగ విధాన సలహాదారు ఇమ్మాన్యుయేల్ బోన్ ను కోరినట్లు పేర్కొన్నారు. మాక్రాన్  ఇలా ఏకపక్షంగా ప్రయత్నించడం పై వైట్ హౌస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ అంశంపై అమెరికా ప్రభుత్వ ఆలోచనా విధానం తెలిసిన వ్యక్తుల ప్రకారం, ఫ్రెంచ్ నాయకుడు ఇటీవల తీసుకున్న చర్యకు  వాషింగ్టన్ సుముఖం గా లేదు” అని ఒకఏజెన్సీ ఆదివారం నివేదించింది. మిత్రదేశాలతో సంప్రదింపులు జరప కుండా సున్నితమైన దౌత్య పరమైన అంశంపై మాక్రాన్ స్వేచ్ఛగా, ఏక పక్షంగా మాట్లాడటంపై వైట్ హౌస్ ఆగ్రహం వ్యక్తం చేసిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఫ్రెంచ్ అధ్యక్షుడి చొరవ విజయవంత మవుతుందని తాము విశ్వసించడం లేదని, ఇంతకు ముందు కూడా  ఆయన  అనేక ఇతర శాంతిచర్యలను  ప్రతిపాదించారని, కానీ తరువాత వాటిని వెనక్కి తీసుకున్నారని  బ్లూం బర్గ్ వార్తా సంస్థ ఉటంకించిన వ్యక్తులు పేర్కొన్నారు

ఉక్రెయిన్ లో శాంతి చర్చలు అవసరమని బీజింగ్ నెలల తరబడి చెబుతూనే, ఏ పరిష్కారమైనా అన్ని పక్షాల ప్రయోజనాలను గౌరవించాలని నొక్కి చెబుతోంది. నాటో తూర్పు విస్తరణ సహా అమెరికా, దాని మిత్రదేశాల చర్యలే ఈ ఘర్షణకు కారణమని చైనా అధికారులు  స్పష్టంగా  చెబుతున్నారు. అయినప్పటికీ, మాక్రాన్  చైనా పై వాషింగ్టన్ దూకుడు వైఖరి నుండి పారిస్ ను దూరంగా ఉంచడానికి  ప్రయత్నిస్తున్నాడు, బీజింగ్ పర్యటన తరువాత “యురోపి యన్లు ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించలేరు” కాబట్టి ఐరోపా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి కోసం చూడాలని ఆయన పట్టుబట్టారు.

జర్మనీ, పోలాండ్ ల  వైఖరి 

వీరు ఉక్రేయిన్ ను, తైవాన్ ను అనుచితంగా పోలుస్తూ కలగలిపి వ్యవహరిస్తున్నారు.చైనాని అనవసరంగా రెచ్చగొట్టాలని చూస్తున్నారు. చైనాలో పర్యటించిన జర్మన్ విదేశాంగ మంత్రి అన్నాలెనా బేర్బాక్ కూడా తైవాన్ విషయంలో అమెరికా వైఖరిని పూర్తిగా సమర్థించారు.  యూరప్ లో తాము వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి కోసం ప్రయత్నిస్తే ఈయూ తమ మోకాలిపై కాల్పులు జరుపుతుందని, కూటమిని బీజింగ్ పై ఆధారపడేలా చేస్తుందని ఆమె పోలిష్ మంత్రి మాటియస్జ్ మొరావికీ అన్నారు. చైనాతో సంబంధాలను మెరుగుపరచడానికి మరియు ఉక్రెయిన్లో శాంతి ప్రక్రియలో పాల్గొనడానికి మాక్రాన్ చేసిన ప్రయత్నాలు అకాలమని మరియు కూటమి ఐక్యతను దెబ్బతీస్తాయని ఇతర ఇయు దేశాలు విమర్శించాయి.

ఉక్రెయిన్ శాంతి ప్రయత్నాలకు చైనా మద్దతు 

ఉక్రెయిన్ పై శాంతి చర్చలను ప్రారంభించడానికి, చివరికి ఖండానికి సమతుల్యతా, స్థిరమైన భద్రత కలిగించే  ఫ్రేమ్ వర్క్ ను సృష్టించడానికి ఐరోపా ప్రయత్నాలకు బీజింగ్ మద్దతు ఇస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ చెప్పారు. చర్చలు ఐరోపా యొక్క “ప్రాథమిక దీర్ఘకాలిక ప్రయోజనాల” ఆధారంగా ఉండాలి “అన్ని పక్షాల న్యాయబద్ధమైన ఆందోళనలను” పరిగణనలోకి తీసుకోవాలి” అని చైనా అధికారి బుధవారం ఒక రోజువారీ మీడియా సమావేశంలో అన్నారు.

ఉక్రెయిన్ కు ఆయుధాలను సరఫరా చేసిన దేశాలలో ఫ్రాన్స్ ఒకటి, తన పొరుగు దేశానికి వ్యతిరేకంగా మాస్కో యొక్క సైనిక చర్య “అకారణంగా జరిగింది” అనే వాషింగ్టన్ వాదనకు మద్దతు ఇచ్చింది. అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాపై చేస్తున్న విస్తృత పరోక్ష యుద్ధంలో భాగంగానే వీటిని రష్యా భావిస్తోంది.

ఉక్రెయిన్ తనదిగా చెప్పుకునే భూభాగాల్లో రష్యన్ దళాలు ఉన్నంత కాలం కాల్పుల విరమణ లేదా శాంతి చర్చలను పదేపదే తోసిపుచ్చిన కీవ్ లేదా దాని మిత్రదేశాల నుండి మాక్రాన్ ప్రణాళికకు ఏదైనా మద్దతు లభించిందో లేదో తెలియదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పదవిలో ఉన్నంత కాలం మాస్కోతో చర్చలు జరపడం చట్ట విరుద్ధం చేసే చట్టంపై అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీసంతకం చేశారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీకి విదేశీ వ్యవహారాలకు నేతృత్వం వహిస్తున్న వాంగ్ తో బోన్ మాట్లాడే అవకాశం ఉందని మాక్రాన్ కార్యాలయం ధృవీకరిం చింది.  ఫ్రెంచ్ శాంతి ప్రణాళిక గురించి తమకు తెలియదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పగా, క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్  కూడా విలేకరులతో మాట్లాడుతూ మాక్రాన్ చొరవపై మాస్కో వద్ద ఎటువంటి సమాచారం లేదని చెప్పారు. మాక్రాన్ ఇటీవల చైనాలో పర్యటించిన కొద్దిసేపటికే ఈ వార్త వెలుగులోకి వచ్చింది.

గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ వద్ద చైనా మరియు ఫ్రెంచ్ నాయకుల మధ్య చర్చల తరువాత, చైనా శాంతి చర్చలకు పిలుపునిస్తూనే ఉందని, రష్యా మరియు ఉక్రెయిన్ రెండింటి “సహేతుకమైన భద్రతా ఆందోళనలను” గౌరవించాలని చైనా నాయకుడు పునరుద్ఘాటించారు.

అమెరికా ప్రతిపాదించిన ‘ఉక్రెయిన్ విజయం’ తీర్మానాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్  జెలెన్స్కీ ఉన్నత సలహాదారు మిఖాయిల్ పొడోలియాక్ ప్రశంసించారు.కీవ్ ను నాటోలో చేర్చుకోవడం ద్వారా, దాని యుద్ధ లక్ష్యాలను ఆమోదించడం ద్వారా ‘చారిత్రక తప్పిదాన్ని’ సరిదిద్దుకోవడానికి వాషింగ్టన్ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.

“ప్రతినిధుల సభ తీర్మానం స్పష్టంగా ఉంది: దురదృష్టవశాత్తు, యునైటెడ్ స్టేట్స్, ఇతర పాశ్చాత్య దేశాలతో పాటు, ఈ ప్రాంతంలో భద్రత, స్థిరత్వాలను నిర్ధారించడానికి అణ్వాయుధాలు, ఇతర ఆయుధాలను సిద్దంచేసి పెట్టుకోమని ఉక్రెయిన్ను ప్రోత్సహించింది. ఇది ఐరోపాలో పెద్ద యుద్ధానికి దారితీసింది” అని పొడోలియాక్ ట్వీట్ చేశారు.ప్రాదేశిక సమగ్రత హామీలకు బదులుగా 1994 బుడాపెస్ట్ మెమోరాండం ప్రకారం మాస్కోకు అణ్వాయుధాలను తిరిగి ఇవ్వడానికి ఉక్రెయిన్ అంగీకరించినందున మాస్కో నుండి రక్షించడానికి యు.ఎస్ బాధ్యత వహిస్తుందని కీవ్ చాలా సంవత్సరాలుగా ఆశిస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఈ నెల ప్రారంభంలో ఐరిష్ బ్రాడ్ కాస్టర్ ఆర్టీఈకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనికి క్షమాపణలు చెప్పారు. ఈ ఆయుధాగారం  ఉక్రెయిన్ది కాదని, సోవియట్ యూనియన్ కు చెందినదని, దీనికి రష్యా ఏకైక వారసుడిగా గుర్తించబడిందని పేర్కొంది. 2022 జనవరిలో అణ్వాయుధాలను తిరిగి పొందడం గురించి జెలెన్స్కీ చేసిన ప్రకటనలను కూడా రష్యా తన ప్రస్తుత సైనిక చర్యకు సమర్థనగా ఎత్తి చూపింది.

యు.ఎస్ విధానం ఉక్రెయిన్ యొక్క 1991 సరిహద్దులను పునరుద్ధరిస్తుందని, రష్యా నష్టపరిహారం చెల్లించాలని , దాని నాయకత్వాన్ని యుద్ధ నేరాల కోసం విచారించాలని ప్రకటించింది.”పాశ్చాత్య నాగరికత సంస్కృతి యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం  గత అనుభవాలను విశ్లేషించే మరియు తప్పులను అంగీకరించే సామర్థ్యం” అని పోడోలియాక్ మంగళవారం తీర్మానం గురించి వ్యాఖ్యానించడానికి వచ్చినప్పుడు యాహూతో అన్నారు. అణ్వాయుధాలను విడిచిపెట్టాలని ఉక్రెయిన్ పై అమెరికా తప్పుగా ఒత్తిడి తెచ్చిందన్న తీర్మానం వాదనను ఇది ప్రస్తావించింది.

ఈ వివాదంలో తాము పాల్గొనలేదని అమెరికా వాదిస్తుంది, కానీ గత ఏడాదిలో కీవ్ కు 100 బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక  సైనిక సహాయాన్ని అందించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సలహాదారు మిఖాయిల్ పొడోలియాక్  మాట్లాడుతూ, చాలా ప్రచారం పొందిన వసంత కాలపు  “కౌంటర్ అఫెన్సివ్” కోసం ఉక్రెయిన్కు ఇంకా మరిన్ని ఆయుధాలు పరికరాలు అవసరం. అంటాడు.  ఐరోపాలోని నాటో దళాల అమెరికా జనరల్ కమాండింగ్ జనరల్ క్రిస్టోఫర్ కవోలి తో ఆయన విభేదించారు, వాగ్దానం చేసిన యుద్ధ వాహనాలలో 98% ఇప్పటికే పంపిణీ చేయబడ్డాయని కాంగ్రెస్ కు  కవోలి చెప్పారు. ఉక్రెయిన్ టెలివిజన్ నిర్వహించిన టెలిథాన్ లో మాట్లాడిన పొడోలియాక్ ఆ ప్రకటనను సవాలు చేశాడు.”చాలా పరికరాలు ఉండాలి, షెల్స్, ముఖ్యంగా హెవీ క్యాలిబర్ల కొరత ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం.ప్రస్తుత సరఫరా రేటు ఉక్రెయిన్ సైన్యాన్ని ఫ్రంట్ లైన్లో “కొన్ని చర్యలు” తీసుకోవడానికి  అనుమతిస్తుంది, రష్యా వంటి శత్రువును ఎదుర్కొనటా నికి  “తగినంత” ఆయుధాలు, పరికరాలు లేవని పొడోలియాక్ అన్నారు. 

గత వారంలో అనేక యుఎస్ అవుట్లెట్లు ఉక్రెయిన్ దాడి గురించి అంచనాలను తగ్గించడానికి ప్రయత్నించాయి, దాని వైఫల్యం నుండి రాజకీయ పతనం గురించి ఆందోళన చెందుతున్న ప్రభుత్వ అధికారులను ఉటంకిస్తూ బదులు గా రష్యా దాడి జరిగే అవకాశం ఉందని గత శుక్రవారం వైట్ హౌస్ హెచ్చరించింది.

ఎదురుదాడి విఫలమైతే ఉక్రెయిన్ పాశ్చాత్య మద్దతు కోల్పోయే ప్రమాదం వుందని న్యూయార్క్ టైమ్స్ హెచ్చరి స్తోంది. పాశ్చాత్య ఆయుధాలు, శిక్షణ, ఇంటెలిజెన్స్ మద్దతు పొందినప్పటికీ ఉక్రెయిన్ రష్యాపై ఎదురుదాడితో విజయం సాధిస్తుందన్న గ్యారంటీ లేదని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఒక నిరాశాజనక పరిణామం కీవ్ మద్దతు దారులను శాంతి కోసం చర్చలు జరిపేందుకు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని ఆ వార్తాపత్రిక అంచనా వేసింది.

రష్యాతో పోరులో తదుపరి దశ నిర్ణయాత్మకమని కీవ్ ఎప్పటి నుంచో భావిస్తోంది. ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ ష్మిగల్ ఇటీవల వేసవి వరకు దాడి జరగకపోవచ్చని అంచనా వేసినప్పటికీ, మే నెలలోనే దాడిని ప్రారంభించవచ్చని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. పెంటగాన్ లీక్స్  లో భాగంగా పంచుకున్న రహస్య పత్రాల ప్రకారం, ఉక్రెయిన్ రష్యా దళాలకు వ్యతిరేకంగా పునరుద్ధరించిన ప్రచారంలో సుమారు 4,000 మంది సైనికులతో కూడిన 12 పోరాట బ్రిగేడ్లను  ఉపయోగించాలని యోచిస్తోంది. యు.ఎస్ మరియు దాని మిత్రదేశాలు ఆ తొమ్మిది యూనిట్లకు శిక్షణ ఇవ్వడంలో సహాయపడ్డాయి, సైనికులకు పాశ్చాత్య దేశాలు అందించిన పరికరాలను ఉపయోగించడం, జర్మనీలోని అమెరికన్ సైనిక సౌకర్యాలలో వ్యూహాత్మక సలహాలను స్వీకరించడం నేర్పించారు. ఉక్రెయిన్ మద్దతుదారులు ప్రతిపాదిత దాడి కోసం ఇంటెలిజెన్స్ ను కూడా అందించాలని భావిస్తున్నారు.

రష్యాలో అమెరికా మాజీ రాయబారి, నాటో సీనియర్ అధికారి అలెగ్జాండర్ వెర్ష్బో మాట్లాడుతూ.. “ప్రతి ఒక్కరూ ఆశాజనకంగా ఉన్నారు, అతి ఆశావహంగా ఉండవచ్చు. కానీ ఉక్రేనియన్లకు మంచి ఫలితం ఉంటుందా లేదా అనేది ఇది నిర్ణయిస్తుంది. అన్ని విధాలా  పాశ్చాత్య సహాయంతో కూడా, “పెద్ద లాభాలకు గ్యారంటీ లేదు, లేదా తప్పనిసరి   విజయం పొందే అవకాశం కూడా లేదు” అని న్యూయార్క్ టైమ్స్ హెచ్చరించింది. “సమీప భవిష్యత్తు కోసం పాశ్చాత్య దేశాలు  పునర్నిర్మించే అవకాశం చాలా తక్కువ” అని నివేదిక వాదించింది. అమెరికా, దాని మిత్రదేశాలు సైనిక సహాయంతో కీవ్ ను ముంచెత్తిన తర్వాత తమ సైనిక నిల్వలను చాలావరకు ఖాళీ చేశాయని, దీనివల్ల వచ్చే ఏడాది వరకు ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.గణనీయమైన లాభాలు ఆర్జించే  ఈ వాకిలి నిరవధికంగా తెరుచుకొని వుండక పోవచ్చని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. 

భారీ నిల్వలు తమ వద్ద ఉన్నందున, మాస్కో ఈ పోరాటంలో విజయం సాధించగలదని అభిప్రాయ పడింది. పేలవంగా అమలు చేయబడిన ఉక్రేనియన్ ప్రతిదాడుల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి వైట్ హౌస్ సన్నద్ధమవుతోందని పొలిటికో ఇంతకు ముందు నివేదించింది. తాత్కాలిక కాల్పుల విరమణ తరువాత మరొక దాడికి ముందు సైనిక నిర్మాణానికి కీవ్ కు సమయం  ఇస్తుందని యుఎస్ అధికారులు అవుట్ లెట్ కు పేర్కొన్నారు.  

చైనా  మొదటినుంచి   రష్యా, ఉక్రెయిన్ సహా అన్ని దేశాలతో పాటు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ సహా యూరోపియన్ శక్తులతో మంచి సంబంధాలను, మాటామంతీ కొనసాగిస్తోంది. అమెరికా తోను , బ్రెజిల్ వంటి ఇతర వర్ధమాన శక్తులతో కూడా సమాచారం మార్పిడి చేసుకుంటోంది. అందువల్ల సంఘర్షణ లో శాంతియుత పరిష్కారాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నించ గలుగుతోంది. . ఈ ప్రయత్నాలలో, దేశాధినేత దౌత్యం గణనీయమైన మార్గదర్శకత్వాన్ని అందించి  చోదక పాత్రను పోషించింది.

 అమెరికా, పాశ్చాత్య దేశాలలో కొందరు ప్రతిపాదించిన “ద్వంద్వ” విధానానికి భిన్నంగా, చైనా  “తూర్పు జ్ఞానం” తో నిండిన భిన్నమైన మార్గాన్ని అందిస్తున్నది. చైనా- ఉక్రెయిన్ సంక్షోభ సృష్టికర్తా కాదు, భాగస్వామీ కాదు. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం గా, బాధ్యతాయుతమైన ప్రధాన శక్తిగా, ఉక్రెయిన్ సంక్షోభానికి రాజకీయ పరిష్కారాన్ని ప్రోత్సహించాలనే చైనా నిజాయితీగా, నిస్వార్థంగా ఆకాంక్షిస్తోంది. శాంతి, చర్చలు, చరిత్రలో సరైన పక్షాన దృఢంగా నిలబడటం  చైనా విధానం.ఇది కాల పరీక్షను తట్టుకున్నది. ప్రజల సంకల్ప శక్తికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇప్పుడు, శాంతినీ, చర్చలను ప్రోత్సహించడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలను రష్యా మరియు ఉక్రెయిన్ రెండూ స్వాగతించా యి. ఫ్రాన్స్, జర్మనీ వంటి ఐరోపా శక్తులు, అలాగే యూరప్ యూనియన్ నాయకులు కూడా శాంతి చర్చలను ప్రోత్సహించడంలో చైనా ఇంకా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని చైనా  సంక్లిష్టమైన, విడదీయడానికి కష్టమైన చిక్కుముడిలా చూస్తోంది. మెల్లమెల్లగా అడ్డంకు లను ఒక్కొక్కటిగా తొలగించి, అంతిమంగా సంక్షోభం నుంచి సంపూర్తిగా  తప్పించుకోవడంసాధ్యమవు తుంది అని భావిస్తోంది. 

సంక్లిష్టమైన వైరుధ్యాలను క్రమేపీ విచ్ఛిన్నం చేస్తూ, ఓపికగా, స్థిరంగా సమస్య యొక్క కేంద్ర బిందువును చేరుకోవడానికి అపారమైన రాజకీయ జ్ఞానం, సహనం పట్టుదల అవసరం. ప్రస్తుతం ప్రజలు చూస్తున్న ఉత్తమ పరిష్కారం కూడా. వాస్తవానికి, కాలం గడిచేకొద్దీ, రష్యా మరియు ఉక్రెయిన్, అలాగే ఐరోపాలోని ఇతరులతో సహా అనేక దేశాలు చైనా ప్రతిపాదిత పరిష్కారాన్ని క్రమంగా గుర్తించాయి లేదా పాక్షికంగా అంగీకరించాయి. చైనా స్వరాన్నిప్రపంచం వినాలిఅని చెప్పే గొంతులు అమెరికాలో కూడా పెరుగుతున్నాయి.  

చైనా, ఉక్రెయిన్ నేతల మధ్య సమావేశం అనంతరం శ్వేతసౌధం కూడా ఈ పిలుపును స్వాగతిస్తూ ఇది మంచిదే  అనక తప్పలేదు.  ఉక్రెయిన్లో ప్రస్తుత సంక్లిష్టమైన, నిరంతరం మారుతున్న పరిస్థితిలో చైనా ప్రయత్నాల ప్రత్యేక విలువను ఇది ఎత్తి చూపుతోంది. 

రష్యా-ఉక్రెయిన్ వివాదం మొదలైనప్పటి నుంచి అమెరికా, కొన్ని పాశ్చాత్యదేశాలు చైనాపై బురద చల్లి, వారిని కించ పరిచే  ప్రయత్నంలో వదంతులు సృష్టిస్తున్నాయని గమనించాలి. కానీ కాలం గడుస్తున్నకొద్దీ, అవి వీగిపోయి వారికే  స్వీయ-ఓటమిని కలిగిస్తున్నాయి. శాంతి నిర్మాణ దారుగా చైనా గుర్తింపు పెరుగుతోంది. రష్యా ,ఉక్రెయిన్లు రెండూ దీనిని చూడగలుగు తున్నాయి. ఇతర దేశాలు, అంతర్జాతీయ సమాజం కూడా దీనిని గమనించాలి   చైనా అన్ని పక్షాలతో నేరుగా సంభాషించ గలుగుతోంది. ఏకాభిప్రాయాన్ని, సానుకూల ప్రతిస్పందనలను పొందగలుగుతుంది, ఎందుకంటే చైనా ఎల్లప్పుడూ నిష్పాక్షికమైన, న్యాయమైన వైఖరికి కట్టుబడి ఉంది. ఒక ప్రధాన శక్తిగా తన పాత్ర మరియు బాధ్యతను నిర్వహిస్తోంది.ఈ పాత్రను, ప్రభావాన్ని నేటి ప్రపంచంలో  వేరెవరూ భర్తీ చేయలేరు..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *