తెలంగాణలో కనిపించిన పురాతన లావా స్తంభాలు

కెరమెరి మండలంలోని అడవులలో కొత్త లావా స్ధంభాలు

కొత్తతెలంగాణ చరిత్రబృందం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గుర్తించిన కాలమ్నార్ బాసాల్ట్స్ ఆరు.

 

కొత్తతెలంగాణ చరిత్రబృందం సభ్యుడు తిరుపతి గిత్తే కొమరం భీం జిల్లా కెరమెరి మండలంలోని రాంనగర్, గౌరి గ్రామాలలోని అటవీప్రాంతాలలో కొత్త ‘కాలమ్నార్ బాసాల్ట్స్’ గుర్తించాడు.

ఆరున్నర కోట్లసం.రాల కింద భూగర్భంలోని రంధ్రాల నుంచి పైకి వచ్చి, గట్టిపడి, పరచుకున్న లావాప్రవాహం చల్లారుతున్నపుడు ఆరు కోణాల స్ధంభాకారా  శిలలుగా సంతరించుకున్న లావాయే  ‘కాలమ్నార్ బాసాల్ట్స్’.

భారతదేశంలో మహారాష్ట్రలో అంధేరి గిల్బర్ట్ హిల్ మీద, ఇటీవల కొల్లాపూర్, ఉస్మానాబాద్, బీడ్ చించోలిలలో ఈ కాలమ్నార్ బసాల్ట్స్ లభించాయి. ఇవి ‘లావా కాలమ్స్న్’ లేదా ‘బసాల్ట్ కాలమ్న్స్’ లేదా ‘కాలమ్నార్ జాయంటెడ్ వోల్కానిక్స్’గా గుర్తించబడ్డాయి.

తొలిసారిగా 2015లో తెలంగాణాలో ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలోని శాంతిపూర్ రిజర్వ్ ఫారెస్టులో, రెండవసారి 2021లో కొమరంభీం జిల్లాలోని బోర్ లాల్ గూడలో, మూడవసారి 2022లో ఆదిలాబాద్ పొచ్చెర జలపాతంవద్ద, నాలుగవసారి 2022లో నిర్మల్ జిల్లా వాస్తవపూర్ గ్రామం జలపాతంవద్ద, ఇపుడు కొమరం భీం జిల్లాలోని రాంనగర్, గౌరి గ్రామాల అడవులలో రెండుచోట్ల ‘బాసాల్ట్ శిలాస్తంభరూపాల’ను కొత్తతెలంగాణ చరిత్రబృందం సభ్యులు తిరుపతి గిత్తే గుర్తించారు. తెలంగాణ వారసత్వశాఖ ఈ చోట్లను ‘రక్షిత ప్రదేశం’గా ప్రకటించాలి..

మా చరిత్రబృందం సలహాదారులు, భూభౌతిక విజ్ఞానవేత్త, చకిలం వేణుగోపాల్ గారు, జీఎస్సై (రిటైర్డ్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్, తెలంగాణాలో ఇటువంటి శిలారూపాలు కనిపించడం చాలా అరుదని చెప్పారు.

కొలంబియా నది బాసాల్ట్ గ్రూపులో ఏర్పడ్డ కాలమ్నార్ బసాల్ట్స్ 1.7కోట్ల సం.రాల కిందటివి. మార్స్ గ్రహం మీద కనిపించిన బాసాల్ట్స్ ని వీటితో పోల్చుతున్నారు. ఈ బాసాల్ట్స్ రూపొందడంలో నిలువనీరు, ప్రవహించేనీరుల పాత్ర ముఖ్యమైనది.

కొత్తతెలంగాణ చరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ అభిప్రాయం ప్రకారం, భారతదేశంలోని అనేకచోట్ల ఈ కాలమ్నార్ బాసాల్ట్స్ కనిపించినప్పటికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికి గుర్తించినవి చాలా అరుదైనవి. వీటిలో కొన్ని జలపాతాలవద్ద కనిపించాయి. ఈ కాలమ్నార్ బాసాల్ట్స్ షడ్భుజ, పంచభుజాకారాలలో 3అడుగుల నుంచి 30 అడుగుల పొడవు కలిగినవి ఉన్నాయి.ఈ కాలమ్నార్ బాసాల్ట్స్ ఉన్న ప్రదేశాలను కలిపిచూస్తే ఇవన్నీ ఒకేవిధమైనవిగా వుండడం, ఇవి ఉన్న గుట్టలచాళ్ళు దగ్గరిగా వుండడం గమనించవచ్చు. పరిశోధించి మ్యాపింగ్ చేయాల్సివుంది. గతంలో 1980 ప్రాంతంలో జిఎస్సైవారు చేసిన మ్యాపింగు అసంపూర్తిగా ముగిసింది. Deccan traps DTVP (Deccan Volcanic Province ) దక్కన్లో అగ్నిపర్వతాల లావా విస్తరించిన ప్రదేశాలను గుర్తించిన పటంలో తెలంగాణా ప్రాంతం ఎక్కువగా వుంది. అందువల్ల ఈ కాలమ్నార్ బాసాల్ట్స్ తెలంగాణాలో ఎక్కువగా గుర్తింపబడే అవకాశముంది

పరిశోధన వివరాలు

క్షేత్రపరిశోధన, ఫోటోగ్రఫీ: తిరుపతి గిత్తే, మిత్రబృందం,9440634626 , కొత్తతెలంగాణ చరిత్రబృందం
నిపుణుల అభిప్రాయం: చకిలం వేణుగోపాల్ గారు, జీఎస్సై (రిటైర్డ్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్, 8284866622
విషయ వ్యాఖ్య: శ్రీరామోజు హరగోపాల్, 9949498698, కొత్త తెలంగాణ చరిత్రబృందం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *