KCR కు అంత డబ్బెక్కడిది?

 

దేశంలో కెసిఆర్ అంత అవినీతి పరుడు ఎవరు లేరని మోడి , అమిత్ షా అన్నారని అందుకే మొత్తం ఎన్నికల ఖర్చు తానే పెడుతానంటున్నాడని చెబుతూ ఇలాంటి కేసీఆర్ మీద
మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు.

ప్రముఖ పాత్రికేయుడు రాజ్దీప్ సర్దేశాయ్ కేసీఆర్ ‘తన నాయకత్వాన్ని ప్రతిపక్షలు అంగీకరిస్తే మొత్తం ఎన్నికల ఖర్చు తానే భరిస్తాను’ అని అన్నట్లు తన కాలమ్ లో రాసిన విషయం పొన్నాల ప్రస్తావిస్తూ ఇలా ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిఈ మీద కేంద్రం చర్య తీసుకుంటుందా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ హయాంలో స్వయం ప్రతిపతి కలిగిన సంస్థలుగా సీబీఐ , ED సంస్థని ఏర్పాటు చేశారని చెబుతూ,ఈ రోజు అ సంస్థలు ఎవరి కన్నుసన్నలో పని చేస్తున్నాయో ప్రజలు చూస్తున్నారని అన్నారు.

ఆయన ఇంకా ఏమన్నరంటే…

2014 ఎన్నికల్లో నల్లధనం తీసుకొస్తాము అన్నారు .. ఇప్పటివరకు ఎంత నల్లదనం వచ్చింది వివరాలు ఇస్తారా?

2014 లో స్విస్ బ్యాంక్ లో 14 వేల కోట్లు ఉంటే ..2022 నాటికీ 34 వేల కోట్లు ఉన్నాయని ప్రభుత్వ గణాంకాలు చెపుతున్నాయి ..

కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తిసుకొచ్చింది. ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలనే అలోచన చేయకుండా దానిలోని లొసుగులని ఉపయోగించుకుని 8 రాష్ట్రాలో ప్రభుత్వాలని కూలగొట్టారు ..

2014 ముందు మి పార్టీ లకి ఆస్తులు ఎంత ఇప్పుడు ఎంత?

పార్లమెంట్ లో అదానీ అక్రమాలని ప్రశ్నిస్తే రాహూల్ గాంధీ ని బర్తరప్ చేసారు.

GST పన్నుల వసూళపై గొప్పలు చెపుతున్నారు కానీ పన్నులు 70 శాతం సామన్య మధ్యతరగతి
ప్రజలు కడుతుంటే .. 30 శాతం
సంపన్నులు కడుతున్నారు …

సంపన్నులు కట్టే పన్నులు తగ్గితే .. సామన్య మధ్యతరగతి ప్రజలు కట్టే పనులు ఎక్కువయ్యాయి ..

సంపన్ను వర్గాలవారికి మోడి కొమ్ముకాస్తున్నారు ..

దేశంలో టాక్స్ కట్టేవాళ్ళు 10 శాతం ఉన్నారా ..?

భారత ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి , ( దేశంలో & state లో జరుగుతున్న దోపిడీ విశయం ) రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రా ..

రాహూల్ గాంధీ సూరత్ కోర్టుకి వెళ్లినపుడు మా నాయకులు వెళ్ళితే ప్రభావితం చెయ్యడానికి అని బిజెపి వాళ్లు అనడం సిగ్గు చేటు .

ప్రభావితం చేయగలిగే party అయితే Disqualification కాక పోవు గదా ? ఎందుకు , ఏ విధంగా జరిగిందో ప్రజలు గమనించడం లేదనుకోవడం BJP నాయకుల భ్రమ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *