సమరానికి ఆంధ్రా ఉద్యోగుల సన్నాహం

*ఉద్యోగుల చనిపోయిన పిల్లలకు ఉద్యోగాలు సకాలంలో ఇవ్వడంలేదు

 *ఉద్యోగులు చావుబతుకుల్లో ఉన్నాసరే EHS ద్వారా వైద్యం అందడంలేదు 

 *మేము దాచుకున్న డబ్బులు ప్రభుత్వానికి వాడుకొనే హక్కు ఎవరిచ్చారు..దీంతో మా కుటుంబాల్లో శుభకార్యాలు కూడా వాయిదా పడుతున్నాయి.

*కడప, అన్నమయ్య జిల్లాలలో ఉద్యోగుల ఉద్యమ సన్నాహా సమావేశం లో బొప్పరాజు & పలిశెట్టి దామోదరరావు ప్రకటన

ఆంధ్రప్రధేశ్ ఉద్యోగ, ఉపాధ్యయ, కార్మిక, రిటైర్డు కాంట్రాక్టు & ఔట్ సోర్శింగు ఉద్యోగుల దీర్ఘకాలిక ఆర్ధిక, ఆర్ధికేతర సమస్యల పరిష్కారపై గౌఃముఖ్యమంత్రి, మంత్రివర్గ ఉపసంఘం అంగీకరించిన డిమాండ్లు అమలుచేయమని కోరుతున్నాం.

ఉద్యోగుల హక్కులు కాపాడాలని, ప్రతినెలా 1 నే జీతాలు, పెన్సన్ వేయాలని, మేము దాచుకున్న డబ్బులు మా అవసరాలకు మాకు ఇవ్వాలని, చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సబ్యులకు ఉద్యోగాలు సకాలంలో ఇవ్వాలని, EHS ద్వారా మెరుగైన కార్పొరేట్ వైద్య సౌకర్యాలు అందించడంలేదని,62 సంఃలు రిటైర్ మెంటు వయసుని పబ్లిక్ సెక్టార్, గురుకులాలు, యూనివర్సిటీస్ ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని, రిటైర్ మెంటు అయిన, చనిపోయిన వారి బకాయిలు తక్షణమే చెల్లించాలని, లీవ్ ఎన్ క్యాష్ మెంట్లు చెల్లించాలని, పెండి డిఏలు ఇవ్వాలని, ఆర్టీసి ఉద్యోగుల నిలిపివేసిన OT అలవేల్సులు చెల్లించాలని తదితర డిమాండ్లు తో గతనెల 13 న గౌః ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగారి ఇచ్చిన మెమోరాండంలో అనేక ఆర్ధిక, అర్ధికేతర సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేస్తున్నామే తప్ప, ఇది ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం కాదు.

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారించడంలో ప్రభుత్వం ఇంకా జాప్యం చేస్తేమాత్రం ప్రస్తుతానికి ఈనెల 9 నుండి ఏఫ్రీల్ 3 వరకు దశలవారిగా ప్రారంభించిన పోరాటంకాస్తా మలి ఉద్యమంగా ఉదృతం చేస్తామని, అన్ని ఉద్యోగ సంఘాలను, ట్రేడ్ యూనియన్లను, ప్రజాసంఘా లను కలుపుకొని ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని బొప్పరాజు, దామోదర్ రావు తెలిపారు.

ఈ రోజు శనివారం కడప లోని వై.యస్.రాజశేఖర్ రెడ్డి ఆడిటోరియంలో కడప జిల్లా ఉద్యోగులను ఉద్యమానికి సిద్దం చేసేందుకు ముందుగా జిల్లా, డివిజన్ స్థాయి అన్నీ శాఖల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశం ఏపిజెఏసి అమరావతి కడప జిల్లా చైర్మన్ ఆర్.జీవన్ చంధ్రశేఖర్ అధ్యక్షత వహించగా, జిల్లా ప్రధానకార్యదర్శి కె.కె.కుమార్, ఇతర కడప జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ శాఖాపరమైన సంఘాల నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు.

అలాగే అన్నమయ్య జిల్లాలో ఆ జిల్లా చైర్మన్ శ్రీ పి.నరసింహ అధ్యక్షత వహించగా వారి ప్రధాన కార్యదర్శి శ్రీ బి.మల్లికార్జున, ఇతర అన్నమయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ శాఖాపరమైన సంఘాల నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు.

ఈసమావేశంలో ఎపిజెఏసి అమరావతి రాష్ట్రనాయకులు యస్.మల్లేశ్వరరావు,ఆరేపల్లి సాంబశివరావు, ఆర్టీసి ఇ.యు రాష్ట్ర ఉపప్రధానకార్యదర్శి జి.వి.నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

*అనంతపురంలో

*ఉద్యోగులపట్ల ప్రభుత్వం చుపిస్తున్న నిర్లక్ష్యాధోరణే ఈఉద్యమానికి కారణం.

శనివారం అనంతపురం జిల్లాలో ఉద్యోగుల ఉద్యమ సన్నాహాసమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఏపిజేఏసి అమరావతి అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు,రెవిన్యూ అసోషియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చేబ్రోలు కృష్టమూర్తి మాట్లాడు ఈఉద్యమానికి ఉద్యోగులపట్ల ప్రభుత్వం భవలంబిస్తున్న నిర్లక్ష్యమే కారణమని,ఈఉద్యమంలో అన్నిడిపార్టుమెంటు ఉద్యోగులు పాల్గొని విజయవంతంచేసి ఉద్యోగుల న్యాయమైనడిమాండ్లు పరిష్కరించుకోవాలని కోరారు.

ఈసమావేశంలో ఏపిజెఏసి అమరావతి జిల్లా చైర్మన్ ఆర్.యన్.దివాకర్, జిల్లా ప్రధానకార్యదర్శి పి.యస్.ఖాన్ తో అధికసంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

*శ్రీకాకుళంలో...

*ఉద్యోగులు సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం.

శనివారం శ్రీకాకుళం జిల్లాలో ఏపిజెఏసి అమరావతి రాష్ట్రకమిటి పిలుపు మేరకు ఉద్యోగులను ఉద్యమానికి సన్నద్దం చేసే సమావేశం జరిగింది.
ఈసమావేశంలో ముఖ్యఅతిధులుగా ఏపిజెఏసి రాష్ట్ర ఆర్గనైజింగు కార్యదర్శి యస్.కృష్టమోహన్,జెఏసి రాష్ట్రనాయకులు జి.డి.ప్రసాధ్ రావు,కె.ఆంజనేయకుమార్ (చంటి)పాల్గొని మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తే మాత్రం మాఉద్యమాన్ని ఇంకా ఉదృతం చేస్తామని అన్నారు.ఈసమావేశంలో జిల్లాజెఏసి చైర్మన్ శ్రీరాములు,జిల్లా ప్రధానకార్యదర్శి సీపాన వెంకటరమణ తో పాటు అధికసంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

గుంటూరులో..

*మాజీతాలు/పెన్సలు ఎప్పుడు డిస్తారో మాకేతెలియని పరిస్దితి ఈప్రభుత్వంలో ఉంది

ఈప్రభుత్వం మాకు రావల్సిన భకాయిలు ఇవ్వరు,డిఏలు ఇవ్వరు,మెడికిల్ రైఅంబస్ మెంట్లు ఇవ్వరు,సిక్కులు జీతాలు ఇవ్వరు..చివరికి ఉద్యోగులు జీతాలు/పెన్సలు కూడా ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్దితిలో ఉద్యోగులపరిస్దితి ఉంది అందుకే ఈఉద్యమం ప్రారంబించబోతున్నామని పేర్కొన్నారు.

ఏపిజేఏసి అమరావతి రాష్ట్రకోశాధికారి వి.వి.మురళి కృష్టం నాయుడు,ఉపాద్యక్షులు రామిశెట్టి వెంకట రాజేశ్,ఆర్టీసి ఇ.యు రాష్ట్రకార్యదర్శి యన్.వి.కృష్టారావు తోపాటు జిల్లా చైర్మన్ కె.సంగీతరావు,జిల్లా ప్రధానకార్యదర్శి పి.ఏ.కిరణ్ తో పాటు అధికసంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *