డిసెంబ‌ర్ 31న ‘కొరమీను’ రిలీజ్

 

 ‘కొరమీను’ సినిమా చూసి హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు – సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ఆనంద్ ర‌వి
 

ఆనంద్ రవి కథానాయకుడిగా మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘కోరమీను’. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది కాప్షన్. శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీకి కొత్తగా వచ్చిన పోలీస్ మీసాల రాజు మీసాలు ఎవరు తీసేశారనేది ఆసక్తికరమైన అంశంతో మడిపడిన  మూవీ ఇది. ఓ డ్రైవర్, అహంకారంతో కూడిన, బాగా డబున్న అతని యజమాని, వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు … ఈ మూడు క్యారెక్టర్స్ మధ్య నడిచే చిత్రమే ‘కొరమీను’.

డిసెంబర్ 31న సినిమా రిలీజ్ అవుతుంది. పాటలు మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమా నుంచి ‘తెలిసిందే లే..’ అనే సాంగ్ రిలీజ్ ఈవెంట్ సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. బింబిసార ద‌ర్శ‌కుడు వ‌శిష్ట‌, సింగర్ సునీత్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా జరిగిన పాత్రికేయుల స‌మావేశంలో..లిరిసిస్ట్ ల‌క్ష్మీ ప్రియాంక‌, పూర్ణాచారి, జ‌బ‌ర్ద‌స్త్ ఇమ్మాన్యుయేల్‌, ఇందు, కిషోరి త‌దిత‌రులు మాట్లాడారు.

హీరో ఆనంద్ ర‌వి మాట్లాడుతూ ‘‘కొరమీను సినిమాలో మీసాల రాజుకి మీసాలు ఎందుకు తీసేశార‌నే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఈ ప్ర‌పంచ‌మంతా సినిమాల్లో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ, కిడ్నాప్ మిస్ట‌రీలుంటాయి. కానీ ఓ మ‌నిషికి మీసాలు ఎవ‌రు తీసేసుంటార‌నే కాన్సెప్ట్ ఎక్క‌డా లేదు. కాబ‌ట్టి ఇదొక జోనర్ మూవీ అనొచ్చు. దీన్నొక మీసాల మిస్ట‌రీ అనుకోవ‌చ్చు. క‌థ పుట్టిందే అక్క‌డ నుంచే. పేద‌వాడికి, గొప్ప వాడికి మ‌ధ్య జరిగే గొడ‌వను క‌థ‌లో తీసుకున్నాం. సినిమాలో చివ‌రి ముప్పై నిమిషాలు ఎంతో కీల‌కం. మీరు సినిమా చూస్తే స‌ర్ ప్రైజ్ అవుతారు. మా టీమ్‌కు చ‌క్క‌గా చూసుకున్న నిర్మాత‌గారికి థాంక్స్‌. థ్రిల్ల‌ర్ మూవీయే కాదు.. మంచి మ్యూజిక్ కంటెంట్ కూడా ఉంది. మ్యూజిక‌ల్ ఫిల్మ్‌గా సినిమాను ఎంజాయ్ చేస్తారు. డిసెంబ‌ర్ 31న సినిమాను చూసి న్యూ ఇయ‌ర్‌ను హ్యాపీగా సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని కోరుకుంటున్నాను. మేం కూడా అంతే హ్యాపీగా న్యూ ఇయ‌ర్‌ను సెల‌బ్రేట్ చేసుకునేలా చేస్తార‌ని భావిస్తున్నాం’’ అన్నారు.

జ‌బ‌ర్ద‌స్త్ ఇమ్మాన్యుయేల్  మాట్లాడుతూ ‘‘కామెడీ అనే కాకుండా ఓ మంచి రోల్ ఇచ్చిన మా డైరెక్ట‌ర్ శ్రీప‌తిగారికి థాంక్స్‌. కొర‌మీను అనే టైటిల్ విన‌గానే ఆశ్చ‌ర్య‌పోయాను. నిజంగానే రేపు సినిమా చూస్తే ఈ టైటిల్ ఎంద‌కు పెట్టార‌ని అర్థ‌మ‌వుతుంది. ఆనంద్ ర‌విగారు నీడ‌ను బేస్ చేసుకుని నెపొలియ‌న్ అనే సినిమా చేశారు. ఇప్పుడు కొర‌మీను సినిమా చేశారు. స‌పోర్ట్ చేసిన ఎంటైర్ టీమ్‌కు థాంక్స్‌’’ అన్నారు.

హీరోయిన్ కిషోరీ దత్రక్ మాట్లాడుతూ ‘‘నిర్మాత సమన్య రెడ్డిగారికి థాంక్స్. మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమా చేశాం. ఆయ‌న ఇంకా మ‌రెన్నో సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. డైరెక్ట‌ర్ శ్రీప‌తిగారు మీనాక్షి అనే మంచి రోల్ ఇచ్చారు. హరీష్ ఉత్తమన్ గారితో కాంబినేషన్ సీన్స్ చక్కగా కుదిరాయి.  నా పాత్ర మంచి ఇంపాక్ట్ ఉంటుంది. త‌ప్ప‌కుండా సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంది. సినిమాలో ప‌ని చేసిన అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.

న‌టీన‌టులు:

కోటి పాత్రలో ఆనంద్ రవి, కరుణగా హరీష్ ఉత్తమన్, మీసాల రాజు పాత్రలో శత్రు, మీనాక్షిగా కిషోరీ దత్రక్, దేవుడు పాత్రలో రాజా రవీంద్ర, సీఐ కృష్ణ పాత్రలో గిరిధర్, ముత్యంగా ‘జబర్దస్త్’ ఇమ్మాన్యుయెల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రమ్ పాత్రలో ప్రసన్న కుమార్, కరుణ అసిస్టెంట్ పాత్రలో ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక వ‌ర్గం:
 
ఈ చిత్రానికి పీఆర్వో : నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి బియాండ్ మీడియా, స్టైలిష్: పూజ శేఖర్, ఎడిటర్: విజయ్ వర్ధన్ కె, పాటలు: అనంత నారాయణన్ ఏజీ, ప్రొడక్షన్స్ డిజైనర్: ముసి ఫణి తేజ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పవన్ కుమార్ జన స్వామి, సినిమాటోగ్రాఫర్: కార్తీక్ కొప్పెర, సౌండ్ డిజైన్: సాయి వర్మ ముదునూరి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సిద్ధార్థ్ సదాశివుని, ప్రొడక్షన్ హౌస్: ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్, మాంగో మీడియా సమర్పణ , డిస్ట్రిబ్యూషన్ : గంగ ఎంటర్టైన్మెంట్స్ , ఆడియో : మాంగో మ్యూజిక్ ,  స్టోరీ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ : ఆనంద్ రవి, డైరెక్టర్: శ్రీపతి కర్రి, నిర్మాత : పెళ్లకూరు సమన్య రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *