బెస్ట్ ఫోటోగ్రాఫర్ పూల సాయిబాబా

మెదక్ జిల్లాలో ఉత్తమ ఫోటోగ్రఫీ అవార్డుకు తూప్రాన్ కు చెందిన పూల సాయిబాబా ఎంపిక అయ్యారు. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కేటగిరీలో ఆయన ఈ అవార్డ్అందుకున్నారు.

 

పూల సాయి బాబా గారు 26 జూన్ 1963 రోజున జన్మించినారు మాసాయిపేట జన్మస్థలం విద్యాభ్యాసం ఒకటి నుంచి ఏడు వరకు మాసాయిపేట గవర్నమెంట్ హై స్కూల్లో పూర్తి చేశారు ఫోటోగ్రఫీ వృత్తి 1977 మార్చ్ నెలలో శ్రీనివాస స్టూడియో మెదక్ వాళ్ళ బావగారైన శ్రీనివాస్ దగ్గర నేర్చుకోవడం జరిగింది 1984 ఫిబ్రవరి చేగుంటలో సాయి స్టూడియో పేరుతో స్టూడియోను మొదటిసారిగా ప్రారంభించారు మరియు 1987 లో తూప్రాన్ పట్టణం లో కూడా శ్రీ సాయి ఫోటో స్టూడియో ను ప్రారంభించి సుమారుగా 30 మంది ఫోటోగ్రాఫర్స్ ను తయారు చేశారు వారందరూ కూడా ఇప్పటికీ ఇదే వృత్తిలో కొనసాగుతూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారు సాయిబాబా గారు బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ నుండి జీవితం ప్రారంభించి ప్రస్తుతం డిజిటల్ టెక్నాలజీలో సైతం వృత్తిని కొనసాగిస్తూన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రఫీ కార్యదర్శి రాంపర్తి శ్రీనివాస్ తో సాయిబాబా
తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రఫీ కార్యదర్శి రాంపర్తి శ్రీనివాస్ తో సాయిబాబా

యాషిక ఫెంటాక్స్ నికాన్ వీడియో కెమెరా లో పానాసోనిక్ నుండి ఇప్పటివరకు కొత్తరకం లైనా ఎన్ఎక్స్ 200 వీడియో కెమెరా 5d వరకు ఆయన వివిధ ప్రోగ్రాం లో పాల్గొంటూ వృత్తిని గౌరవప్రదంగా చేస్తూ నే తూప్రాన్ పట్టణ అసోసియేషన్ను గత పది సంవత్సరాల నుండి దిగ్విజయంగా నడిపిస్తూ వస్తున్నారు.

మరియు మండలాల ఫోటోగ్రాఫర్లకు ఆదర్శంగా ఉంటూ స్థానిక అసోసియేష కు మరియు జిల్లా బాడీ ఏర్పాటుకు విశేషంగా కృషి చేశారు

ఆయన కృషికి మెదక్ జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ గుర్తిస్తూ సాయిబాబా గారికి రాష్ట్ర అవార్డుకు ఎన్నిక చేయడం పట్ల మెదక్ జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *