తిరుపతి జిల్లాలో భారీ వర్ష హెచ్చరిక

* మత్స్యకారులు వేటకు వెళ్లర.
జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి.

కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ : 0877-2236004 : జిల్లా కలెక్టర్

తిరుపతి, నవంబర్ 11: స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేటింగ్ సెంటర్ నుండి వచ్చిన సందేశం ప్రకారం ఈనెల 11 నుండి 12 వరకు రుతు పవనాల ప్రభావం తీవ్రంగా ఉండబోతున్నది. బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీర ప్రాంతాల ప్రజలు మరియు రాయలసీమ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళ రాదు.

ప్రజలకోసం తిరుపతి కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ : 0877-2236004 ఏర్పాటు చేసి 24 గంటలు పని చేసే విధంగా సిబ్బందికి డ్యూటీ లు వేశామని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

అన్ని లైన్ డిపార్ట్‌మెంట్లు జిల్లాలోని తీర ప్రాంత మండలాలు తడ, సూళ్లూరు పేట, వాకాడు, కోట, చిల్లకూరు మండలాల్లో ప్రజలు, అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అధికారులు అందరు అందుబాటులో ఉండాలని అన్నారు. మానవ మరియు పశు ప్రాణ నష్టం  ఇతర నష్టాలను నివారించడానికి పోలీస్, రవాణా, టెలికమ్యూనికేషన్స్, పవర్, వైద్య, డ్రింకింగ్ వాటర్, ఫైర్ శాఖ మొదలైన అత్యవసర సేవల అధికారులు ఎలాంటి సంఘటననైనా ఎదుర్కోవడానికి పూర్తిగా సన్నద్ధంగా ఉండాలని 24గంటలు పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూంలు మండలాల్లో ఏర్పాటు చేసుకుని విధులు సిబ్బందికి కేటాయించి పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *