మూడు ముక్కల్లో మునుగోడు ముచ్చట

అన్ని పార్టీలకు ముచ్చెమటలు పట్టించిన
మునుగోడు ఉప ఎన్నిక
అనవసరంగా వచ్చినా!
అందరి అవసరాలు మాత్రం తీర్చింది.
గెలిచితిరామన్న సంతోషం
అధికార పార్టీకి,
గట్టి పోటీ ఇచ్చి రేపు ప్రత్యామ్నాయం మేమే అన్న సంతోషం భాజపాకి,
డిపాజిట్ దక్కకున్నా సరే?
రాజగోపాలుడి ఓటమికి
కారణమైనామన్న
సంతోషం కాంగ్రెసుకు,
మాతో పొత్తు వల్లనే? అధికారపార్టీ గెలిచిందన్న
సంతోషం కమ్యూనిస్టుల్లో,
ఓటు బూచి చూపెట్టి
అందరి నుండీ దండిగానే
దండుకున్న సంతోషం ఓటర్ మహాశయుడికీ!

అయితే…

ప్రజాస్వామ్యమే
మాత్రం అపహాస్యమైంది.

(From Social Media)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *