PART 07
సింహయాజి: ఇంకా కొంచెం టైం పట్టేలా ఉంది.
రోహిత్ రెడ్డి: సరే స్వామీజీ. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంకో గంట వెయిట్ చేద్దాం. మళ్లీ బయటికి వెళ్లడం, రావడం ఇష్యూ అవుతుంది.
రామచంద్రభారతి: కర్ణాటక ఆపరేషన్ సందర్భంగా కూడా ఎమ్మెల్యేలను నేరుగా వాహనాల్లో చెన్నై తీసుకెళ్లాం. అక్కడి నుంచి ఇండిగో ఫ్లయిట్ లో ముంబై తీసుకెళ్లాం. ముంబై వెళ్లాక ఇవ్వాల్సింది ఇచ్చాం. ఇప్పటిదాకా జరిగింది ఇదే.
సింహయాజి: కర్ణాటక ఆపరేషన్ చేసినప్పుడు పంచలు, రుమాళ్లు కట్టుకుని.. గడ్డపారలు పట్టుకుని.. ఎమ్మెల్యేలు కూలీల్లాగా ట్రాక్టర్లు ఎక్కి ఫామ్ హౌస్ కి వచ్చారు.
గువ్వల బాలరాజు: ఏది? కర్ణాటకలోనా?
సింహయాజి: అవును. అదంతా స్వామీజీనే ఆపరేట్ చేశారు.
రామచంద్రభారతి: మొదట మేం రామనగర వెళ్లాం. కావాలంటే మీకు తేదీలు కూడా చెప్తాను. రామనగర వెళ్లాం. అక్కడి నుంచి ఈగల్టన్ రిసార్టుకు వెళ్లాం. అది పూర్తిగా కాంగ్రెస్ ఆధీనంలో ఉన్న రిసార్టు. అక్కడినుంచి ట్రాక్టర్ల ద్వారా ఎమ్మెల్యేలను ఎల్లంక తీసుకెళ్లాం. అక్కడినుంచి వోల్వో బస్సుల్లో తరలించాం.
సింహయాజి: కొందరు నిక్కర్లు వేసుకుని, కొందరు రుమాళ్లు చుట్టుకుని..
రామచంద్రభారతి: ఎమ్మెల్యేలు కూడా రుమాళ్లు చట్టుకుని.. వర్కర్లలాగా వచ్చారు.
సింహయాజి: జస్ట్ వర్కర్లలాగా పారలు, గడ్డపారలు పట్టుకొని వచ్చేశారు. అక్కడి నుంచి బస్సులో వెళ్లిపోయారు.
గువ్వల బాలరాజు: ఢిల్లీలో అలాంటిదేమీ లేదు కదా?
సింహయాజి: ఢిల్లీలో అలాంటిదేమీ లేదు.
రామచంద్రభారతి: ఒకసారి మీరు మా గమ్యస్థానానికి చేరుకున్నారంటే మొత్తం మేమే చూసుకుంటాం.
సింహయాజి: ఢిల్లీ మొత్తం సెంట్రల్ కంట్రోల్ లోనే ఉంటుంది.
రామచంద్రభారతి: ఇక్కడ సమస్య ఏంటంటే.. ఫస్ట్ పార్ట్ అమౌంట్ ఇక్కడ ఇవ్వాలి.
గువ్వల బాలరాజు: మేం అడిగేది ఇక్కడి గురించి కాదు. ఢిల్లీ గురించి.
రామచంద్రభారతి: వాళ్లకు అక్కడ డబ్బులు అవసరం లేదు. వాళ్లకు పవర్ కావాలి. పార్టీ మారి పదవులు తీసుకుంటారు. వాళ్లు ఒక్క రూపాయి కూడా తీసుకోరు.
సింహయాజి: వాళ్లలో ముఖ్యమైన వ్యక్తి సీఎం అవుతాడు.
రామచంద్రభారతి: బీజేపీ అభ్యర్థే సీఎం అవుతాడు. అందులోని వారు డిప్యూటీ సీఎం అవుతాడు. మిగిలిన వాళ్లు మంత్రులు అవుతారు.
గువ్వల బాలరాజు: అంటే చర్చలన్నీ అయిపోయాయా?
రామచంద్రభారతి: చర్చలు అయిపోయాయి. మీటింగ్ కూడా అయిపోయింది. బీజేపీ ఎప్పుడూ చెప్పిన మాట మీదే ఉంటుంది. ఏది చెప్తే అదే చేస్తాం. ఒక్కసారి మేం కమిట్ అయితే వాళ్లకు చెప్పింది పూర్తి చేస్తాం.
గువ్వల బాలరాజు: బీజేపీకి మీలాంటి వాళ్లే బలంగా ఉన్నారు కదా?
రామచంద్రభారతి: నేను మాత్రమే కాదు. వస్తే మీరు కూడా అవుతారు. పార్టీ విషయాలన్నీ చాలా డిఫరెంట్. మానవత్వం, నమ్మకం అనేది ముఖ్యమైనవి. నమ్మకంగా ఉన్నవారిని బీజేపీ గౌరవిస్తుంది. విశ్వాసం మీదే బీజేపీ నడుస్తోంది. మేం అదే నమ్ముతాం.
గువ్వల బాలరాజు: కానీ ఇప్పుడు మీరు విశ్వాసం అనే మాటకు అర్థాన్ని మారుస్తున్నారు. విశ్వాసం అంటే ప్రభుత్వాల్ని కూల్చడమేనా?
రామచంద్రభారతి: మేం ప్రభుత్వాల్ని కూల్చడం లేదు. ఈ మీటింగ్ లో మీరు సంతోషంగా ఉన్నారు కదా?
గువ్వల బాలరాజు: అవును. మేం సంతోషంగానే ఉన్నాం. ఎందుకంటే మేం మళ్లీ ఎమ్మెల్యేలం కావాలి.
రోహిత్ రెడ్డి: ఈయన ఎందుకు బయటికి వస్తున్నారంటే.. మంత్రి పదవి ఆశించారు. అది రాలేదు కాబట్టి బయటికి వస్తున్నారు.
రామచంద్రభారతి: చూడండి. మేం ఎక్కడ ప్రభుత్వాన్ని కూల్చినా కూడా.. కర్ణాటకలో మేం 16 మందిని తీసుకున్నాం. అందులో 10 మందికి మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చాం. కానీ 13 మందికి పదవులు ఇచ్చాం. ఐదారు సార్లు గెలిచిన మా ఎమ్మెల్యేలను కాదని వారికి పదవులు ఇచ్చారు.
గువ్వల బాలరాజు: నేను కూడా అదే చెప్తున్నా. సీనియర్లకు మంత్రి పదవులు రావడం లేదు.
రామచంద్రభారతి: ఒకవేళ మనం అధికారంలోకి వస్తే.. మీకు మంత్రి పదవి వస్తుంది. బీజేపీ మిమ్మల్ని మంత్రిని చేస్తుంది. మంత్రి పదవి నా చేతుల్లో ఉంటే కచ్చితంగా చేస్తా.
రామచంద్రభారతి: నిజానికి షిండేకి డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని హామీ ఇచ్చాం. కానీ చర్చించిన తర్వాత ఆయనను సీఎంగా చేశాం.
గువ్వల బాలరాజు: ఆయన పూర్తి కాలం సీఎంగా కొనసాగుతారా?
రామచంద్రభారతి: అవును. పూర్తి కాలం సీఎంగా ఉంటారు. ఆయనకు రాజకీయ అనుభవం లేకున్నా కూడా మేనేజ్ చేస్తున్నారు.
రామచంద్రభారతి: మీరు ఒకసారి పదవుల్లో కూర్చుంటే.. మేం బయటి వాళ్లం అయిపోతాం. తర్వాత మిమ్మల్ని మేం ఇబ్బంది పెట్టం. మీ అపాయింట్ మెంట్ తీసుకునే కలుస్తాం. ఇచ్చిన హామీ మేరకు పదవిలో కూర్చోబెట్టే దాకా మాదే బాధ్యత. ఆ తర్వాత మీరే చూసుకోవాలి. తర్వాత మీకు ఏదైనా సమస్య వస్తే అప్పుడు మేం చూసుకుంటాం. కానీ మీ పనుల్లో మేం జోక్యం చేసుకోం.
గువ్వల బాలరాజు: ప్రభుత్వాల్ని కూల్చడం వెనక బీజేపీ ఎజెండా ఏంటి? మిగిలిన వాళ్లని సీఎంగా చేయడం.. వాళ్ల మీద ఎలాంటి కంట్రోల్ లేకపోవడం వెనక మతలబు ఏంటి?
రామచంద్రభారతి: చూడండి. నేను చెప్పేది నా గురించి. బీజేపీ గురించి కాదు. పదవి ఇచ్చిన తర్వాత బీజేపీ వారిని కంట్రోల్ చేస్తుంది. కానీ నేను మాత్రం వాటిలో ఇన్ వాల్వ్ అవను. ప్రతీ దాంట్లో నేను జోక్యం చేసుకుంటే బీజేపీ నాయకులకు పనేం ఉంటుంది? ప్రతీదాన్ని నాయకులే చూసుకోవాలి కదా?
PART 08
గువ్వల బాలరాజు: మీరు మాట్లాడితే మాట్లాడండి అన్నా. టైం ఉంది అంటున్నారు కదా?
రేగా కాంతారావు: అన్నీ మంచిగ అయ్యాక పీఠానికి పోదాంగని.
సింహయాజి: అన్నీ మంచిగానే అవుతది. మా సంకల్పం అలాంటిది.
రేగా కాంతారావు: మా పైలట్ సాబ్ ఎట్లా చెప్తే అట్లా.
సింహయాజి: మీ క్వాలిఫికేషన్ ఏంటి?
గువ్వల బాలరాజు: నేను కూడా మంచిగానే చదువుకున్నా స్వామీ. నేను ఎల్ఎల్ఎం.
రోహిత్ రెడ్డి: ఆయన లాయరే.
గువ్వల బాలరాజు: ఆయన అడ్వొకేట్. నేను కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి వదిలేసిన.
రోహిత్ రెడ్డి: ఆయన అయితే ఇంటర్నేషనల్ లా కూడా చేశాడు. జర్మనీలో కేసులు వాదించిండు. స్విట్జర్లాండ్, దుబాయ్ లో కూడా వాదించిండు. ఇంటర్నేషనల్ లా అండ్ జస్టిస్ మీద 45 నిమిషాల స్పీచ్ కూడా ఇచ్చిండు.
సింహయాజి: ఒక వైపు వేదం చదువుకోవాలి. ఇప్పుడు కాదు. మా చిన్నప్పుడు వేదం చదువుకుంటూనే మిగతా అన్ని సబ్జెక్టులు చదవాలి. ప్రైవేటుగా వేదం సపరేట్ చదివినం.
గువ్వల బాలరాజు: మీ పిల్లలు ఏం చేస్తారు స్వామీ?
సింహయాజి: వేదం చదువుతున్నారు. పాప సెవెన్త్ చదువుతోంది.
గువ్వల బాలరాజు: చిన్న పిల్లలేనా?
సింహయాజి: కాషాయం వేసుకున్నవాడల్లా పీఠాధిపతి అని చెప్పుకుంటాడు. కాదు. వాళ్లంతా పీఠాధిపతులు కాదు. వాళ్లు సన్యాసులు.
నందు: పీఠాధిపతులు అంటే హై అన్నా ఇగ.
సింహయాజి: ఈ సన్యాసుల కంటే హై మాది.
నందు: పీఠాధిపతి కావాలంటే చాలా పోటీ ఉంటుంది.
సింహయాజి: మా ర్యాంకు చాలా హై ఉంటుంది. చిన్నజీయర్ స్వామి కూడా పీఠాధిపతి కాదు.
నందు: స్వామి దగ్గర తిరుమల రమణ దీక్షితులు వచ్చి స్వామి వారి ఆశీర్వాదం తీసుకుని పోతారు.
సింహయాజి: మాది హై లెవల్.
నందు: స్వామి వారినే పట్టుకునే శక్తి ఆయనకు ఉంది. ఆంజనేయస్వామిని పట్టుకుంటాడు ఆయన. ఆయనొచ్చి ఆశీర్వాదం తీసుకుంటాడు. రాజ్ నాథ్ సింగ్, వాళ్లంతా కూడా!
రామచంద్రభారతి: తుషార్ ఫోన్ వచ్చింది. తుషార్.. సంతోష్ కు మెసేజ్ చేశాడు. ముందు ఏం చేయాలనేది వాళ్లు చర్చించుకుంటున్నారు. తుషార్ ఇంకా టైం ఇవ్వలేదు. సంతోష్ కూడా అదే చెప్పాడు.
రోహిత్ రెడ్డి: మీరెప్పుడూ అలాగే చెప్పారు కదా స్వామీ.
రామచంద్రభారతి: డెలివరీ గురించి మాట్లాడాల్సి ఉంది.
నందు: మనం దాని గురించి మాట్లాడుకున్నాం కదా. హైదరాబాద్ లో ఇస్తా అంటున్నారు కదా.
రోహిత్ రెడ్డి: ఆల్రెడీ ఫోన్ లో కూడా మాట్లాడినం కదా. ముందే కావాలని.
రామచంద్రభారతి: నిజానికి హైదరాబాద్ లో అవసరం ఉంటుందని వాళ్లకు చెప్పాను. వాళ్లు దానికి అంగీకరించారు. 50 శాతం ఇవ్వాలనే విషయాన్ని ఇవాళే వాళ్లకు చెప్పా.
రోహిత్ రెడ్డి: మరి ఇప్పుడు వాళ్లు ఏమంటున్నారు?
రామచంద్రభారతి: తుషార్ కూడా అదే చెప్తున్నాడు. నేను పంపిన మెసెజ్ లను వారికి పంపారు. మొదట ఇక్కడ ఇవ్వాలి. ఆ తర్వాత ఢిల్లీకి రావాలని చెప్పాను. ఇక్కడ 50 శాతం ఇవ్వాలి. ఆ తర్వాత ఢిల్లీకి వచ్చాక చూసుకుందాం. ఆ విషయాన్ని వాళ్లకు చెప్పా. ఒకసారి మనం ఢిల్లీ వెళ్లాక అక్కడ వ్యవహారాలన్నీ చక్కబడతాయి.
రామచంద్రభారతి: అమిత్ షా, సంతోష్ తో మాట్లాడిన తర్వాత క్లారిటీ వస్తుంది. కానీ అమిత్ షా అందుబాటులోకి రావడం లేదు. దీని గురించి మెసెజ్ చేశాను. ఇవాళ రాత్రి వరకు మనకు క్లారిటీ రావొచ్చు. అమిత్ షా ఇప్పుడు అహ్మదాబాద్ ర్యాలీలో బిజీగా ఉన్నారు. సొంత ఊరిలో ర్యాలీ కాబట్టి ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
PART 09
గువ్వల బాలరాజు: ఏకంగా ప్రధానే.. సంతోష్ దగ్గరికి వస్తాడంటే మేము ఎలా?
రామచంద్రభారతి: నేను కూడా అదే చెప్తున్నా.
సింహయాజి: నేను ఏం అంటున్నాను అంటే..!
స్వామి మాట్లాడిండు.. నేను మాట్లాడకుండా.. మేము ఎలా నమ్మాలి అనేది ఫస్ట్ క్వొశ్చన్.
సింహయాజి: నేను చెప్పేది వినండి. పార్టీలో ఎలా ఉంటుందంటే..
సంతోశ్ నే ఇక్కడికి రమ్మని మొత్తం సెటిల్ చేసుకొని.. అప్పుడు ఢిల్లీ వెళ్లి అక్కడ జాయిన్ అయితే బెటర్.
గువ్వల బాలరాజు: కాకపోతే మా ఉద్దేశం ఏందంటే..?
అక్కడ పోకుండా ఇక్కడ పోకుండా అయిపోతున్నాం అని!
రోహిత్ రెడ్డి: ఇప్పుడు ఇన్ని రోజులు.. మేము మునుగోడు పోకుండా ఉండలేము స్వామిజీ. ఇప్పటికే ఇగ ఏం లేదు.
హర్షవర్దన్ రెడ్డి: మళ్లీ అటు ఇటు కాకుండా అయితది.
రోహిత్ రెడ్డి: హా.. మళ్ల అటూ ఇటూ కాకుండా అయితది. అటు కాకుండా, ఇటు కాకుండా మధ్యలో ఇరుకుతం. అదీకాకుండా ఆయన పొద్దున చెప్తున్నడు. ఇంటలిజెన్స్ వాళ్లు ఏదో ఫోన్లు దూరం పెట్టు… ఏందేందో చెప్పిండు. నాకు చెప్తుండు ఈయన.
సింహయాజి: ఇప్పుడు ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే.. వాళ్లు లేకుండా ఇన్ని ఆపరేషన్లు చేయలేరు కదా? ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నట్లే ఆపరేషన్లు చేస్తారు. గవర్నమెంట్ లో ఇంటలిజెన్స్ లేదా? మహారాష్ట్రలో మరి ఎలా పాజిబుల్ అయింది? వాళ్లకు రాడార్స్ ఉంటాయి.
రామచంద్రభారతి: అమిత్ షా అందుబాటులోకి రావడం లేదు. అదే ప్రధాన సమస్య.
గువ్వల బాలరాజు: మీ పేరు ఏమన్నరు స్వామి?
సింహయాజి: సింహయాజి.. నాది చాలా పేద్ద పేరు.
గువ్వల బాలరాజు: ఏం పేరు?
సింహయాజి: ప్రపన్న శ్రీకరుణాకరన్ వేంకటనాథ సింహయాజి
గువ్వల బాలరాజు: మీ పేరు అండీ?
రామచంద్రభారతి: రామచంద్రభారతి
రోహిత్ రెడ్డి: స్వామీజీ ఇప్పుడు మన ప్రణాళిక ఏంటి?
రామచంద్రభారతి: మొదట డెలవరీ గురించి.. అమిత్ షాతో మాట్లాడుతున్నాను. సంతోష్ దానిపై అమిత్ షాతో మాట్లాడుతున్నారు. బీఎల్ సంతోష్.. అమిత్ షాతో.. మీటింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు. నేనుకూడా కంటిన్యూగా ఫోన్ చేస్తున్నాను.
రోహిత్ రెడ్డి: ఇక్కడే ఉందాం కొద్దిసేపు
గువ్వల బాలరాజు: అన్న ఏం చెప్తున్నాడంటే..? కొద్దిసేపు వెయిట్ చేద్దాం అంటున్నాడు.
రామచంద్రభారతి: మీరు వదిలేద్దాం అంటారు. కానీ నేను వదలలేను. మీరు చాలా దూరం నుంచి వచ్చారు. నేను ఢిల్లీ నుంచి వచ్చాను. రేపు ఉదయం పది గంటలకు.. మా ఇంట్లో అమిత్ షాతో సమావేశం ఉంది. కాబట్టి నేను అక్కడ ఉ.8 గంటల లోపు ఉండాలి.
సింహయాజి: మీరంతా ఒకేసారి వచ్చారా?
గువ్వల బాలరాజు: అవును మేమంతా.. ఒకే వాహనంలో వచ్చాము. మెయిన్ వెళ్లేదే డ్రైవర్లు, గన్ మెన్లు, పీఏలతోని..
సింహయాజి: మమ్మల్నెవరూ గుర్తుపట్టరు.
రామచంద్రభారతి: నా ఒక్క స్పీచ్ కు లక్ష అవుతుంది.
గువ్వల బాలరాజు: ఈ రాజాసింగ్ గురించి ఏమంటారు?
రామచంద్రభారతి: అతన్ని వదిలేయండి.
నందు: ఆయనది ఏమీ ఉండదు. అంతా పంచాయతే
గువ్వల బాలరాజు: కరక్టే కానీ కమిటెడ్ కదా.. ఆర్ఎస్ఎస్, బీజేపీకి కమిటెడ్ కదా!
రామచంద్రభారతి: ఆయనకు ఒక టాస్క్ ఉంది
గువ్వల బాలరాజు: నేను అనుకుంటా.. రాజాసింగ్ కొంత ఫేరోషియస్ గా ఉంటాడని!
రామచంద్రభారతి: నీకు అనుచరులు ఉన్నంత వరకు ఏం కాదు. ఒకవేళ లేకపోతే మీరు బాధితుడు అవుతారు. మీరు చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు అనుకుంటున్నా.
గువ్వల బాలరాజు: అవును కానీ మేము ఎప్పుడూ మా పార్టీపై ఆధారపడుతాం.