TRS MLAల కొనుగోలు…బ్రోకర్లు ఏమ్మాట్లాడారు (4,5,6)

 

PART 04
గువ్వల బాలరాజు: అక్కడ (ఏపీ) ఎలా ఉంది స్వామీ? ఇదే ఆపరేషన్ మొదలుపెట్టారా?
సింహయాజి: ఇది అయిపోతే అక్కడ మొదలు పెడతాం. మొన్ననే రోహిత్ కు ఒకటి చెప్పా.
రోహిత్ రెడ్డి: నాకోటి చెప్పారు మొన్న.
హర్షవర్ధన్ రెడ్డి: అక్కడ ప్రభుత్వం చాలా రోజులు ఉండటం కష్టమేనా?
సింహయాజి: అక్కడ (ఏపీ) నెల రోజుల్లో పూర్తి చేస్తాం.
గువ్వల బాలరాజు: అక్కడ ఒక్క రోజులోనే ఎవరైనా దగ్గరై అయిపోతారు.
రోహిత్ రెడ్డి: క్యాష్ ఎక్కడుందో చెప్తారా? చెప్తే మనం వెళ్లి పిక్ చేసుకోవాలి.
హర్షవర్ధన్ రెడ్డి: నేను అమెరికాలో ఉన్నప్పుడు మీరు నాకు ఫోన్ చేశారు.
గువ్వల బాలరాజు: స్వామి వాళ్లు టార్గెట్ పెడితే ఎవరైనా ఖతం అవ్వాల్సిందేనా?
సింహయాజి: అమ్మో! బీజేపీ పట్టుకుందంటే ఇక అంతే!
గువ్వల బాలరాజు: కానీ ఢిల్లీలో ఫెయిల్ అయినట్టు ఉన్నారు.
నందు: ఢిల్లీ కూడా స్టార్ట్ అయింది. 15 మంది రెడీగా ఉన్నారు. ఇంకొందరు కూడా వస్తారు.
సింహయాజి: అసలు వాడిని ఈడీ పెట్టి లోపల వేశారు కదా? సిసోడియాను.
నందు: సిసోడియాను ఈడీ పెట్టి ఇరికించారు కదా!
గువ్వల బాలరాజు: అది బీజేపీ చేసిందేనా?
సింహయాజి: బీజేపీతోనే అవన్నీ సాధ్యం.
నందు: ఢిల్లీలో 36 మందిని రెడీ చేశారు. రాజస్థాన్ లో 30 మందిని రెడీ చేశారు. చూడ్డానికి సింపుల్ గా ఉంటాడు గానీ.. పంచ కట్టుకుని అన్ని పనులు చేస్తుంటారు.
సింహయాజి: వింటే గోడీ, లేదంటే ఈడీ!
గువ్వల బాలరాజు: గోడీ అంటే?
సింహయాజి: గోడీ అంటే సఖ్యత. ఫ్రెండ్ షిప్. లేదంటే ఈడీనే. రెండే ఆప్షన్లు.
సింహయాజి: ఇప్పుడు 38 మంది ఈడీ లిస్టులో ఉన్నారు తెలంగాణలో. వింటే గోడీ, లేదంటే ఈడీనే.
నందు: స్వామీజీ దగ్గర మొత్తం లిస్ట్ ఉంది. డీల్ చేసేదంతా బీఎల్ సంతోష్.
సింహయాజి: ఏం చేయాలనేది ఆయన చెప్తూ ఉంటారు.
నందు: వాళ్లు కేసీఆర్ ను అసలు టచ్ చేయరు. జస్ట్ పక్కనున్నోళ్లకి అత్తరు పూస్తారు. అరబిందో, మెఘా వంటి పలువురు ఉన్నారు.
సింహయాజి: రామేశ్వరరావును వదిలేశారు. ఎందుకంటే బీజేపీకి వంద ఇచ్చేశాడు. వంద ఇస్తేనే ముగ్గురూ వచ్చారు. లేకపోతే ఎందుకొస్తారు? ప్రధాని, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్.
గువ్వల బాలరాజు: అలాంటి వాటికి డబ్బులు ఇస్తే వస్తారా? ఆయన అంత పెద్ద స్వామీజీ కదా?
సింహయాజి: అంత పెద్ద ఈవెంట్ కదా? దానికి ఇవ్వాల్సిందే.
నందు: వంద కోట్లు అనేది చాలా తక్కువ.
సింహయాజి: నిజానికి రామేశ్వరరావుకు కేసు ఉండే. అది తప్పించుకోవడానికి డబ్బు ఇచ్చి, మళ్లీ ఫేవర్ గా ఉండటానికి వారిని ఆహ్వానించారు. రామేశ్వరరావు మీద కేసు పెట్టిందే.. ఆయనను దగ్గర చేసుకోవడానికి!
గువ్వల బాలరాజు: ఇక్కడైతే మొత్తానికి బండిది ఏం నడవదా?
సింహయాజి: బండిది ఏం నడుస్తుంది? బండికి గండే!
గువ్వల బాలరాజు: కిషన్ రెడ్డిది కూడా నడవదా?
నందు: నడవదు. కిషన్ రెడ్డిది వెంకయ్య నాయుడు ఛానల్.
సింహయాజి: ఇక్కడేంటంటే ఎవరికి వారు హై కమాండ్ కు టచ్ లో ఉంటున్నారు.
గువ్వల బాలరాజు: అంటే పూర్తి స్వేచ్ఛ ఇచ్చి పార్టీని నడిపే వాళ్లు లేరా ఇక్కడ?
సింహయాజి: లేరు. ఇప్పుడు తయారు చేస్తారు. కొత్త రక్తం వస్తే కొత్త రక్తానికి అంటగట్టాలని చూస్తున్నారు. మంచి పరిపాలనాదక్షత ఉన్న వారి కోసం చూస్తున్నారు. రోహిత్ రెడ్డికి ఇద్దామనుకుంటున్నా.
రోహిత్ రెడ్డి: నాకంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు.
సింహయాజి: సీనియర్లు ఉంటే సరిపోదు కదా? కెపాసిటీ ఉండాలి.
గువ్వల బాలరాజు: ఇప్పుడు ఊ అంటే మోడీతో మాట్లాడుతా అన్నట్టు ఉంటారు కిషన్ రెడ్డి, బండి సంజయ్. నిన్న మొన్న వచ్చిన వాళ్లు కూడా!
సింహయాజి: వాళ్లను మాట్లాడమనండి.
నందు: ఆర్ఎస్ఎస్ దగ్గర ప్రతీ ఒక్కరి సమాచారం ఉంటుంది. ఎవరిని ఎక్కడ కట్ చేయాలో అక్కడ చేస్తారు.
నందు: కిషన్ రెడ్డి ఏమేం చేసిండు? కిషన్ రెడ్డి కథేంటి? కిషన్ రెడ్డికి సీఎంతో ఉన్న సంబంధం ఏంటి అనేది అన్నీ తెలుసు. కాబట్టి ఎవరిని ఏం చేయాలో అలా సైలెంట్ చేస్తారు. వెంకయ్య నాయుడును డమ్మీ చేయలేదా? ఆయన బ్యాచ్ అంతా రిటైరయ్యారు.
గువ్వల బాలరాజు: మొత్తానికి కిషన్ రెడ్డిని గుప్పిట్లో పెట్టుకున్నారు.
సింహయాజి: వీళ్లు ఇక్కడ చాలా మాటలు చెప్తారు. బండి సంజయ్ కి అసలు అపాయింట్ మెంటే దొరకదు.
గువ్వల బాలరాజు: మరి కిషన్ రెడ్డికి?
నందు: కిషన్ రెడ్డికి కూడా అంతే.
గువ్వల బాలరాజు: కేంద్ర మంత్రి అయినా అంతేనా?
నందు: అంతే. బీఎల్ సంతోష్ ఎవరినీ కలవడు. ఆయన కేవలం మోడీ, అమిత్ షాను మాత్రమే కలుస్తాడు. ఆయన ఆపరేషన్స్ లో ఉన్నాడు కాబట్టి, ఎక్కువ మందిని కలవడు. చాలా రిజర్వుడ్ గా ఉంటారు.
సింహయాజి: ప్రధాని వచ్చి వెళ్తారంటే అర్థం చేసుకోండి.

PART 05

రామచంద్రభారతి: సంతోష్ ఇప్పుడు అమిత్ షాతోనే ఉన్నాడు. వాళ్లిద్దరూ ఒకే చోట ఉన్నారు. తుషార్ వేరే చోట ఉన్నాడు. ఆయన నంబర్ బిజీ వస్తోంది. అదలా ఉంచితే, పేమెంట్ కు ఎలాంటి సమస్య లేదు. పేమెంట్స్ కు సంబంధించి వాళ్లు ఒప్పుకున్నారు.
రామచంద్రభారతి: ఆయన (నందు) కూడా వాళ్లతో మాట్లాడినప్పుడు ఒప్పుకున్నారు. ఎలాంటి సమస్య లేదు. నా దగ్గరికి ఇవాళే మీ ముగ్గురి పేర్లు వచ్చాయి.
గువ్వల బాలరాజు: నిజానికి మేం మునుగోడులో ఉన్నాం.
రామచంద్రభారతి: పేర్లు కూడా పంపొద్దని రోహిత్ తో అన్నాను. డైరెక్టుగా నా ముందు కూర్చున్నప్పుడు మాట్లాడుతానని చెప్పా. ఒకవేళ ఆయన పంపినప్పుడు అది ఇంటలిజెన్స్ కు వెళ్తే ప్రాబ్లమ్ రావొచ్చు. దాంతో మీరు కూడా ఇబ్బందుల్లో పడతారు. మీరు ఇబ్బంది పడొద్దనే నా ఉద్దేశం.
రామచంద్రభారతి: ఒకరోజు అటు ఇటు కావొచ్చు. కానీ ఎలాంటి సమస్య రావొద్దు. ఇదే కరెక్ట్ కదా! ఇప్పుడు మీరు ఎన్ని గంటలకు ఫ్రీ అవుతారు. కాన్ఫరెన్స్ లోకి తీసుకుందాం.
నందు: ఇప్పుడు 6.15 అవుతోంది కదా.
రామచంద్రభారతి: 5.45కే ఆయన స్పీచ్ అయిపోయింది.
రోహిత్ రెడ్డి: స్వామీజీ. ప్రాసెస్ ఏంటని వాళ్లు నన్ను అడుగుతున్నారు. స్వామీజీనే ప్రాసెస్ ఏంటనేది మీకు నేరుగా చెప్తారు.
రామచంద్రభారతి: ఏం చూడకముందే ఎవరూ సిద్ధంగా ఉండరు. అది మీరైనా, వాళ్లయినా! వాళ్లకు కూడా కొన్ని కండీషన్లు ఉన్నాయి. ఎందుకంటే, ఎవరికి ఇవ్వాలి? ఎక్కడ ఇవ్వాలి? అనే సమస్యలున్నాయి. నేను కేవలం వ్యక్తిని మాత్రమే.
రేగా కాంతారావు: మీరు పర్సన్ కాదు. పవర్!
రామచంద్రభారతి: తుషార్ లైన్లో ఉండండి. ఇక్కడ రోహిత్ రెడ్డి ఉన్నారు. వాళ్లు నాతో చర్చలు జరుపుతున్నారు. పరిస్థితులను బట్టి వాళ్లు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు.
రామచంద్రభారతి: కాసేపు ఆగండి. రోహిత్ రెడ్డికి ఫోన్ ఇస్తున్నా. ఆయన టీఆర్ఎస్ పార్టీలో పెద్ద లీడర్. ఆయన ఇప్పుడు నా ముందే ఉన్నారు. మరో ముగ్గురితో కలిసి ఇక్కడే ఉన్నారు. అందరం కలిసి ఒకే చోట కూర్చున్నాం. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కానీ ఫైనాన్షియల్ గా మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు.
రామచంద్రభారతి: స్థానిక కారణాల వల్ల వాళ్లు కూడా తొందర పెడుతున్నారు. స్థానికంగా వాళ్లకు కొన్ని సమస్యలు ఉన్నాయి. రోహిత్ రెడ్డికి ఫోన్ ఇస్తున్నా ఆగండి.
రోహిత్ రెడ్డి: తుషార్ గారు ఎలా ఉన్నారు?
తుషార్ (ఫోన్ లో): నడ్డా, అమిత్ షాతో మాట్లాడాను. రేపటి నుంచి మీరు ఎప్పుడు వచ్చినా.. మేం రెడీగా ఉన్నాం. సరైన తేదీ చెప్పమని సంతోష్ ను అడిగాను. రేపటి నుంచి మీరు ఫ్రీగా ఉన్నారా?
రోహిత్ రెడ్డి: నిజానికి మేం ఫ్రీగా లేము. అందరం మునుగోడు ఎన్నికలో బిజీగా ఉన్నాం.
తుషార్ (ఫోన్ లో): ఆ ఎలక్షన్ మూడో తేదీ కదా?
రోహిత్ రెడ్డి: అవును. మూడో తేదీనే.
తుషార్ (ఫోన్ లో): మూడో తేదీ ఎన్నిక అయ్యాక 4 లేదా 5వ తేదీ టైం తీసుకుంటా. మీకు ఏది సరైందో చెప్తారా?
రోహిత్ రెడ్డి: మేం ఇవాళ లేదా రేపు ఫినిష్ చేయాలి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళే పూర్తి చేద్దామని స్వామీజీ చెప్పారు. అందుకే మేం ఇవాళ మిగిలిన ముగ్గురిని కూడా మునుగోడు నుంచి ఇక్కడికి పిలిపించాను. నిన్నటి నుంచి వాళ్లు ఇక్కడే ఉన్నారు. వాళ్లు అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు.
తుషార్ (ఫోన్ లో): మనం సంతోష్ ని కలవాల్సి ఉంటుంది. మీ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదనే నేను ఇంకా ఆయనకు ఫోన్ చేయలేదు. నేను రేపు లేదా ఎల్లుండి ఆయన అపాయింట్ మెంట్ తీసుకుంటా. వీలైనంత త్వరగా అపాయింట్ మెంట్ తీసుకునే పనిలో ఉంటా. దానికంటే ముందు మనం కలుద్దాం. ఆ తర్వాత మనం వెళ్లి ఆయన్ని కలుద్దాం.
రోహిత్ రెడ్డి: తుషార్ జీ ఇవాళ రాత్రికి మీరు కూడా హైదరాబాద్ రాగలరా? ఎందుకంటే, ప్రతీ రోజు మాకు చాలా కీలకం. మేం చాలా రిస్క్ చేస్తున్నాం. మేం తీసుకుంటున్న రిస్క్ అంతా ఇంతా కాదు. అది చాలా ప్రమాదకరమైనది.
తుషార్ (ఫోన్ లో): నేను రావడం అనేది సమస్య కాదు. దీనికంటే ముందు నడ్డాజీతో మాట్లాడాలి. ఆయనతో ఫైనల్ డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే నేను నిర్ణయం తీసుకోగలుగుతాను.

 

PART 06

రోహిత్ రెడ్డి: తుషార్ జీ. మీరు కలుద్దామంటున్నారు. మంచిది. ఒక్క నిమిషం ఆగండి. స్వామీజీ మాట్లాడతారంట.
రామచంద్రభారతి: తుషార్ జీ. వీలైనంత త్వరగా మనం దీన్ని పూర్తి చేసేయాలి. ఎందుకంటే ఇది టెన్షన్ కాదు. చాలా రోజులుగా వాళ్లు వేచి చూస్తున్నారు. వాళ్లపై ఇంటలిజెన్స్ నిఘా ఉంది.
రామచంద్రభారతి: అదే సమయంలో వాళ్లకు డబ్బుల గురించి కూడా చెప్పాలి.
రోహిత్ రెడ్డి: ఆయనకు అమౌంట్ గురించి నేరుగా చెప్పండి.
రామచంద్రభారతి: తుషార్ జీ. మొత్తం నలుగురు సభ్యులు. 225
రోహిత్ రెడ్డి: 50 శాతం ఇప్పుడు ఇవ్వండి.
రామచంద్రభారతి: ఓకే. మనం చూద్దాం.
రామచంద్రభారతి: సరేసరే. అమౌంట్ ఫైనల్. 225
రోహిత్ రెడ్డి: ఇవాళ సాధ్యం కాదా?
రామచంద్రభారతి: నిజానికి అమౌంట్ గురించి ఇవాళే చెప్పాం. ఆయన (తుషార్) సంతోష్ ను అడగాలి. సంతోష్ ఫోన్ ఎత్తడం లేదు. అమిత్ షా గుజరాత్ లో బిజీగా ఉన్నారు. కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం. అదే ఇప్పుడు సమస్య. కొంచెం సమయం ఇవ్వండి.
రోహిత్ రెడ్డి: సరే. ఆగుతాం. స్వామీజీ వెయిట్ చేస్తే మంచిదే కదా.
సింహయాజి: స్వామీజీ ఇది చాలా త్వరగా చేయాల్సిన పని.
రామచంద్రభారతి: డబ్బుల గురించి సంతోష్ చాలా క్లియర్ గా ఉన్నారు. అది సమస్యే కాదు.
గువ్వల బాలరాజు: సంతోష్ తోపాటు ఇతరుల అపాయింట్ మెంట్ తీసుకోవడం సమస్యగా ఉందా?
రామచంద్రభారతి: అవును. ఇప్పుడు అదే సమస్య.
రోహిత్ రెడ్డి: అన్నా మేం చెప్పేది ఒకటే. అపాయింట్ మెంట్ తర్వాత అయినా చూసుకోవచ్చు. ఇవాళ 50 శాతం ముడితే ఇక్కడినుంచి జంప్ అవుతం.
గువ్వల బాలరాజు: ఇప్పటికే ప్రచారం వదిలేసి వచ్చి రెండు రోజులైంది కదా. ఇంకా ఉంటే మా డ్రైవర్, గన్ మెన్లను పట్టుకుని ఏమైందని అడుగుతున్నారు.
రోహిత్ రెడ్డి: మీకు అర్థం అవుతోందా స్వామీజీ? రెండు మూడు రోజులుగా వాళ్లు ఆగుతూ వస్తున్నారు.
రామచంద్రభారతి: అవునవును. నాకు అర్థమైంది. నేను కూడా వాళ్లపై ఒత్తిడి తెస్తున్నా. నేను రెండు రోజుల కిందటే రావాల్సింది. నా ఆరోగ్య సమస్యల వల్ల రాలేకపోయాను. ఇవాళ కూడా నేను ఆరోగ్యంగా లేను. నేను కూడా త్వరగా ఢిల్లీ వెళ్లాలని ఉంది. అక్కడ ఇంజెక్షన్ తీసుకునే పనుంది.
రోహిత్ రెడ్డి: ఆ ఇంజెక్షన్ ఏంటో చెప్పండి. ఇక్కడే ఇప్పిద్దాం.
రామచంద్రభారతి: అది ఆల్రెడీ అక్కడే ఉంది. డాక్టర్ టెస్టులు చేసి ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతిసారి నేను ఎయిమ్స్ కే వెళ్తాను.
సింహయాజి: స్వామీజీ. ఇవాళ అయిపోయింది. రేపు పని పూర్తిచేద్దాం.
గువ్వల బాలరాజు: గుజరాత్ ఎన్నికలు ఎప్పుడు?
రోహిత్ రెడ్డి: ఢిల్లీలో కూడా స్వామీజీనే ఆపరేట్ చేశారు.
గువ్వల బాలరాజు: అవును ఇంతకుముందు చెప్పారు.
రోహిత్ రెడ్డి: వచ్చే వారంలో పని అయిపోద్ది.
సింహయాజి: ఒకసారి పని మొదలు పెట్టామంటే అది పూర్తి చేసేస్తాం.
రామచంద్రభారతి: ఇక్కడ ఈ ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారి.
గువ్వల బాలరాజు: ఎవరి ద్వారా అక్కడ ఆపరేషన్ జరుగుతోంది?
రామచంద్రభారతి: నిజానికి ప్రతిసారి ఢిల్లీలోనే ఆపరేషన్ జరుగుతుంది. మొదట 50 శాతం ఇక్కడ ఇవ్వడం, తర్వాత ఆ వ్యక్తి ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి. నిజానికి గతంలో ప్రతిసారి ఢిల్లీలోనే ఇలాంటి ఆపరేషన్ చేసేవాళ్లం. ఆ వ్యక్తి నేరుగా ఢిల్లీకి వచ్చేవారు. సంతోష్ అక్కడే నేరుగా ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చేవారు. అతను ఆ పర్సన్ కి డబ్బు ముట్టజెప్పేవారు. ఇప్పటివరకు అక్కడ చేసింది అదే.
గువ్వల బాలరాజు: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీలో ఎవరి ద్వారా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు?
రామచంద్రభారతి: మొత్తం సంతోషే చూసుకుంటున్నాడు.
గువ్వల బాలరాజు: ఆమ్ ఆద్మీ పార్టీలో ఎవరి ద్వారా నడిపిస్తున్నారు?
రామచంద్రభారతి: చాలా మంది ఉన్నారు మీలాగా. కేజ్రీవాల్ రైట్ హ్యాండ్ ద్వారా మొత్తం నడిపిస్తున్నాం.
సింహయాజి: కేజ్రీవాల్ రైట్ హ్యాండ్ ద్వారా శక్తులన్నింటినీ పట్టేశాం.
గువ్వల బాలరాజు: ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ?
రామచంద్రభారతి: 36 మంది ఉన్నారు. 33 మెజార్టీ.
నందు: రాజస్థాన్ లో అప్పుడు ఏం జరిగింది సార్?
రామచంద్రభారతి: అక్కడ 21 మంది ఉన్నారు.
సింహయాజి: స్వామీజీ. అక్కడ గవర్నర్ నా శిష్యుడు.
గువ్వల బాలరాజు: ఏ గవర్నర్?
సింహయాజి: రాజస్థాన్ గవర్నర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *