నన్ను హతమార్చే యత్నం: ఈటల రాజేందర్

ఈటెల రాజేందర్

నాపై హత్యకు కుట్ర జరుగుతుంది. పక్కా స్కెచ్ ప్రకారమే మునుగోడులో నాపై దాడి జరిగింది. ఒక్క రక్తపు బొట్టు కారినా సీఎం కేసీఆరే బాధ్యత వహించాలి.

ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయి. హుజురాబాద్ లో అవసరం లేకున్నా.. అనేక మందికి గన్ లైసెన్సులు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆడిస్తే ఆడే.. తోలు బొమ్మలకు, చెంచాలకు బీజేపీ భయపడదు.

హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓటమితో నాపై సీఎం కేసీఆర్ పగ పట్టారు. మునుగోడులో కేసీఆర్ డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారు.

కేంద్ర మంత్రికే రక్షణ లేకుంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి ?

తెలంగాణ ఉద్యమంలో ఒక్క కారుతో అర్ధరాత్రి కూడా తిరిగే వాళ్ళం. నయీం ముఠా బెదిరించిన భయపడలేదు.

కెసిఆర్ హయాంలో భయటకు వెళితే ఇంటికి తిరిగొస్తామన్న నమ్మకం లేకుండా పోయింది.

నా భార్య జమున తన సొంత ఊళ్ళో ప్రచారానికి వెళితే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

టీఆర్ఎస్ దాడులను చూస్తూ ఊరుకోం.

దేశాన్ని పాలిస్తోన్న పార్టీలో నేను సభ్యడినన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి.

పథకం ప్రకారం నా కాన్వాయ్ పై దాడి చేశారు. అనేక సార్లు నా కాన్వాయ్ పై దాడి చేసేందుకు ప్రయత్నించారు.

పలివేల గ్రామంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ప్రచారాన్ని సైతం అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ప్రచారాన్ని అడ్డుకుంటుంటే పోలీసు వ్యవస్థ ఏమీ చేస్తోంది.

పలివేల గ్రామంలో ఇంటి ఇంటికి తిరిగి నా సతీమణి ప్రచారం నిర్వహిస్తుంటే అసభ్య పదజాలంతో దూషించారు.

మంత్రులు ప్రచారం చేస్తుంటే మేము అడ్డుకున్నామా ?

బిజెపి కార్యకర్తలపై రాళ్లు రువ్వారు.. జెండా కర్రలతో కొట్టారు.

నా గన్ మెన్లు లేకపోతే నా తలకాయ ఉండకపోయేది. నా పీఆర్ఓ చైతన్య, గన్ మెన్ అంజయ్యలకు గాయాలయ్యాయి.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్కరం బయటకు వెళ్లిన సురక్షితంగా ఇంటికి చేరేది. ఇప్పుడు బయటకు వెళితే తిరిగొచ్చే నమ్మకం లేకుండాపోయింది.

నిన్న ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి డీఎస్పీని కొట్టారు. డీజీపీ పోలీసు విలువలు కాపాడటంలో విఫలమయ్యారు.

ఎన్నికల జరిగే ప్రాంతంలో మంత్రి పట్టపగలు మద్యం తాగుతూ తాపించడం ఏంటీ ?

ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి, మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి ఏమైంది కేసీఆర్. 9 ఏళ్ల ఏమీ చెయ్యనీ కేసీఆర్ మొన్న మునుగోడు కు వచ్చి 15 రోజుల్లో 100 పడకల ఆసుపత్రిని కడతా, రోడ్లు వేయిస్తా అంటున్నారు.

పిచ్చివేషాలు, దౌర్జన్యాలు అపకపోతే ప్రజలే బొంద పెడతారు.

మా మీటింగ్ దగ్గరికి టీఆర్ఎస్ నాయకులు రావచ్చా ? మా మీటింగ్ దగ్గరకు వచ్చి దాడిచేసి.. మాపై దాడి చేశారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

టీఆర్ఎస్ సమావేశం దగ్గరికి వంద మంది బిజెపి కార్యకర్తలు వెళ్ళితే ఊరుకుంటారా ?

బిడ్డ చంపుతావా ? చంపి బట్టకడుతవా ? నాపై ఈగ వాలితే కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *