స్మశానానికి కూడా దారి లేని ఊరు…(వీడియో)

తమ ఊరికి పట్టిన దరిద్రం గురించి గ్రామ ప్రజల తరఫున చెబుతున్న అభిరామ్..

***

శవం కూడా సిగ్గుపడుతున్నది
మా ఊరి దారి చూసీ…

ప్రాణం కూడా శవం అవుతుంది
మా ఊరి దారిని చూసీ…

ఎవడిని అనాలి…
సంవత్సరాలుగా ఒట్టి మాటలు నమ్మి మోసపోయినా మా ఊరి ప్రజలనా…

అడ్డమైన మాటలు చెప్పి
ప్రభుత్వ ధనం మింగి ఇళ్ళల్లో దాక్కున్నా నాయక నక్కలనా…

ఔను…
ఏళ్ళుగా… ఎందరో బురదలో పడి
ఎముకలు విరగొట్టుకుంటున్నారు…
ప్రాణాలను శవాలుగా మార్చుకుంటున్నారు…
ఇక మూగజీవుల ఘోష అంటారా…
అది చూస్తే…, మూడుకన్నుల ముక్కంటే ఏడుస్తాడేమో….

ఛీ…ఛీ…
జలగల్లా
మా ఊరిని పట్టిపీడిస్తున్నా…
సమస్యలకు సమాధానం ఎవడు చెప్పాలి…

ఓ సమాజమా…
ఎలా చేస్తావో నీ ఇష్టం
ఈ  వీడియోను చూసి
నీ వంతు సాయం చేయ్…
ఆర్థికంగా కాదు సుమా….
కళ్ళున్నా చూడలేని గుడ్డినాయకులు కళ్ళు తెరుచుకుని మా దారిని బాగుచేసేలా…

*సమాజపు అభివృద్ధి కోరే ప్రతి మానవత్వ మనిషి మీదైన విధంగా మా ఊరికి దారి వచ్చేలా చేయగలరు….

*మా ఊరికి పట్టిన దరిద్రం ఇది…
* వివిధ వృత్తి అధికారులారా…మేధావులరా
*మీరు మాకు సాయం చేయాల్సిన సందర్భం ఇది…

***

మా ఊరి దారి ఎంత దారుణంగా ఉందంటే…
అందులో మోకాలిలోతు బురదలో చిక్కుకుని
జారీ కింద పడి చాలామంది ఆస్పత్రి పాలైయ్యారు
ముసలివాళ్ళు చనిపోయారు…
మూగజీవుల బాధ చెప్పలేనిది…

ఇక్కడ మహిళలకు బహిర్ భూమికి వెళ్ళడానికి పెద్ద సమస్య.దారుణమైన పరిస్థితి అధికారులకు ప్రజా ప్రతినిధులకు తెలియదంటే ఎలా నమ్మాలి?

మా పరిస్థితికి నిదర్శనం ఈ వీడియో…
నేను… మా ఊరు కోరుకునేది ఒకటే…
మా ఊరికి రోడ్డు వేయించగలరు…
లేకపోతే ఇకపైన ఎన్నికలను మేము బహిష్కరిస్తాం

***

(అభిరామ్ , పర్వతాపురం, ఆదోని, కర్నూలు జిల్లా…
మొబైల్: 970415364)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *