డా.రాజా రామ్ మోహన్ రావు శత జయంతి

 

 

మానవతావాది,పూర్వ ఉపకులపతి,ప్రజా వైద్యులు డా” కొమ్మారెడ్డి రాజా రామ్ మోహన్ రావు శత జయంతి సందర్భంగా ఈనెల 25వ తేదీ ఆదివారం గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఇండియా @75: అవకాశాలు – వాస్తవాలు అనే అంశంపై రాష్ట్రస్థాయి సెమినార్ ను నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన సంఘ కమిటీ అధ్యక్షులు,శాసన మండలి చిఫ్ విప్ ప్రొ”ఉమారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ రోజు  గుంటూరులోని మద్య విమోచన ప్రచారం కమిటీ కార్యాలయ హాలులో జరిగిన మీడియా సమావేశంలో   ఆయన విలేకరులతో మాట్లాడారు.  త

ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికలను ప్రొ”ఉమారెడ్డి వెంకటేశ్వర్లు,మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్,జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తదితరులు ఆవిష్కరించారు.

ప్రొ”ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ ఇండియా@75: అవకాశాలు-వాస్తవాలపై జరిగే రాష్ట్ర స్థాయి సెమినార్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర ముఖ్య సలహాదారులు అజేయ కల్లం ప్రారంభిస్తారని,సిపిఐ(ఎం)పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి కె.నారాయణ,సాక్షి ఎడిటర్ వర్ధిలి మురళి ప్రసంగిస్తారని తెలిపారు.

ప్రారంభ ఉపన్యాసం రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు ప్రొఫెసర్
కె.నాగేశ్వరరావు, వ్యవసాయ రంగం పై ప్రొఫెసర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, సామాజిక రంగంపై శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్,శాసనమండలి సభ్యులు విద్యా రంగంపై కేఎస్ లక్ష్మణరావు,వైద్యరంగంపై ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ బి.ఎస్ శివారెడ్డి,ప్రజాస్వామ్య విలువలు గురించి మాజీ మంత్రివర్యులు మండలి బుద్ధ ప్రసాద్ ప్రసంగిస్తారని పేర్కొన్నారు.

పార్లమెంటు సభ్యులు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి,లావు శ్రీకృష్ణదేవరాయలు సందేశాలను అందిస్తారని వివరించారు.

1937లో ఇచ్చాపురం నుండి తడ వరకు జరిగిన రైతు రక్షణ యాత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ
రాజకీయాలకు అతీతంగా డా”కొమ్మారెడ్డి రాజా రామ్ మోహన్ రావు శత జయంతిని జరుపుకోవడం హర్షిణీయమన్నారు.

సమాజ మార్పుకు దోహదపడే ఈ సెమినార్ ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య ప్రసంగిస్తూ డా”కొమ్మారెడ్డి రాజా రామ్ మోహన్ రావు విద్య,వైద్య రంగాలలో చేసిన కృషిని తెలిపే డాక్యుమెంటరీని రూపొందించాలని కోరారు.జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆహ్వాన సంఘ కన్వీనర్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ డా”కొమ్మారెడ్డి రాజా రామ్ మోహన్ రావు గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గాను,సిద్ధార్థ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గాను,సింగరేణి కాలరీస్ మెడికల్ ఆఫీసర్ గా విశిష్ట కృషి జరిపి ప్రజా వైద్యులుగా గుర్తింపు పొందినారన్నారు.ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పూర్వ రిజిస్టర్ ప్రొ”ఎన్.రంగయ్య ప్రసంగిస్తూ 1982 నుండి 1986 వరకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉపకులపతిగా విద్యార్థులను తీర్చిదిద్దిన్నారని, వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన మహా మనిషి అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టర్,ప్రముఖ వ్యాపారవేత్త సామినేని ఫణికుమార్,వావిరాల సంస్థ వ్యవస్థాపకులు మన్నవ షోడేకర్,దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్,చరిత్ర అధ్యాపకులు డాక్టర్ పాలేరు పోతురాజు,రిటైర్డ్ ప్రిన్సిపల్ దేవరపల్లి పేరిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *