మెటర్నటీ హాస్పిటల్ లో మున్సిపల్ ఆఫీసా?

(నవీన్ కుమార్ రెడ్డి)

తిరుపతి:

రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు,వైద్య ఆరోగ్య శాఖా మంత్రి,తిరుపతి ఎంపీ, ఎమ్మెల్యే,జిల్లా కలెక్టర్ గారికి స్థానికునిగా విజ్ఞప్తి చేస్తున్నాను!

తిరుపతిలోని పేద మహిళలకే కాకుండా రాయలసీమ ప్రాంతం నుంచి అనేకమంది డెలివరీ,బ్రెస్ట్ క్యాన్సర్ లతో పాటు మహిళలు ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యలపై చికిత్స కోసం మెటర్నటీ హాస్పిటల్ కు వస్తుంటారు అపారమైన అనుభవం కలిగిన వైద్యులు,కోట్లాది రూపాయల విలువైన వైద్య పరికరాలతో ప్రతి పేద మహిళలకు “సంజీవని” లా ఆదుకుంటున్న మెటర్నటీ హాస్పిటల్ ను “నగరపాలక సంస్థ” తాత్కాలిక కార్యాలయంగా వినియోగించాలని బోర్డు పెట్టడం అనాలోచిత నిర్ణయం!

తిరుపతి మెటర్నటీ ఆసుపత్రిలో తల్లి బిడ్డల సంరక్షణ కోసం సుమారు 100 కోట్లతో 186 ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేశారు, 4 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి,అత్యవసరంగా ప్రమాదం జరిగితే చికిత్స కోసం శిక్షణ ఇచ్చేందుకు “నెల్స్” ల్యాబ్ తో పాటు 24×7 వైద్యులు అందుబాటులో ఉంటూ తల్లి బిడ్డలను సంరక్షిస్తున్నారు!

నగరపాలక సంస్థ భవన పునర్నిర్మాణం పూర్తయ్యే వరకు రాజన్న పార్కు వద్ద గల “ఓల్డ్ మెటర్నటీ” హాస్పిటల్ భవన సముదాయాన్ని తాత్కాలికంగా వినియోగించుకోవచ్చు!

తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉండవలసిన డిఎంహెచ్ఓ కార్యాలయాన్ని నిర్బంధంగా ఇటీవల మెటర్నటి హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు ఇప్పుడు ఏకంగా నగరపాలక సంస్థ కార్యాలయం కోసం మెటర్నరీ హాస్పిటల్ ని స్వాధీనం చేసుకోవడం అన్యాయం!

తిరుపతి మెటర్నటీ ఆసుపత్రిలో ప్రస్తుతం 55 మంది గర్భిణీ స్త్రీలతో పాటు వైరస్ సోకిన పేషెంట్లు వైద్యం తీసుకుంటున్నారు ఉన్నఫలంగా వైద్యులపై ఒత్తిడి తీసుకొచ్చి ఖాళీ చేయిస్తే వాళ్ళ ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది!

తిరుపతి మెటర్నరీ ఆసుపత్రిని అక్కడి నుంచి తొలగిస్తే భవిష్యత్తులో నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) తనిఖీలు జరిపితే మన ప్రాంతానికి రావాల్సిన పీజీ (PG) సీట్లను సైతం కోల్పోతాము!

తిరుపతి మెటర్నటీ ఆసుపత్రి భవనంలో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే ఆలోచనను ఉపసంహరించుకోకపోతే తిరుపతి వాసిగా మహిళల తరఫున హైకోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరిస్తున్నాను!

(నవీన్ కుమార్ రెడ్డి, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *