ప్రశ్నే సమాజ ప్రగతికి సోపానం

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వేసవి వినోదం

-పిళ్లా కుమారస్వామి

జన విజ్ఞాన వేదిక కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి మహేంద్ర రెడ్డి అధ్యక్షతన వేసవి వినోదం కార్యక్రమం కుటాగుల ప్రాథమిక పాఠశాలలో ప్రారంభమయ్యింది. వీరు మాట్లాడుతూ విద్యాసంవత్సరంలో బడి, చదువులు ,పరీక్షలు, మార్కులు ట్యూషన్లు వంటివాటితో సంవత్సరం పొడవునా పిల్లలు ఎంతో మానసిక ఒత్తిడికి గురై ఉంటారు.

ఈ సందర్భంలో బడిలో చదువుల పద్ధతికి భిన్నంగా వినోదంతో కూడిన విజ్ఞానం పిల్లలకు అందించగలిగితే సెలవులు సార్థకమవుతాయని దీని కోసం ప్రతిరోజు పిల్లలకు ఆట పాటలతో పాటు డ్రాయింగ్, మ్యాజిక్ ,సైన్స్ ప్రయోగాలు , తమాషా గణితం వంటి అంశాలతో వినోదం అందించ వచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం జూన్ ఒకటి,  రెండు మరియు మూడు తేదీలలో మూడు రోజుల పాటు నిర్వహించబడుతోంది అని తెలిపారు .ఇందులో భాగంగా మొదటిరోజు తమాషా గణితం, వ్యక్తిగత పరిశుభ్రత గురించి తెలియజేస్తారు. రెండవ రోజు అబాకస్ ,మ్యాజిక్ ప్రదర్శన, సైన్స్ ప్రయోగాలు ఉంటాయి .మూడవ రోజు డ్రాయింగ్, కథలు రాయడం నాటికల రూపకల్పన ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని కుటాగుల విద్యార్థులు ఉపయోగించు కావాలన్నారు.

 

ఈ సందర్భంగా సాహితీస్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమారస్వామి రెడ్డి మాట్లాడుతూ చదువుల పేరుతో విద్యార్థులు ఎదుర్కొంటున్న భయం ఒత్తిడి నుండి బయట పడాలంటే ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అన్నారు. ప్రశ్నించడం ద్వారానే సమాజ పురోగతి సాధ్యం అవుతుంది అని తెలిపారు.

భౌతిక శాస్త్ర విషయ నిపుణులు విశ్వనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని కేవలం వినోదం కోసమే కాకుండా జ్ఞాన సముపార్జనకు ఉపయోగించుకోవాలని తద్వారా సామాజిక స్పృహ పెంచుకోవచ్చు అన్నారు. తర్వాత ఈ కార్యక్రమానికి సంభందించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. మూడు రోజుల ఈ కార్యక్రమంలో మొదటిరోజు తమాషా గణితం గురించి చంద్రమోహన్ రెడ్డి, అభ్యుదయ గీతాలు కార్యక్రమంలో స్వాతి ,శ్రీరాములు రిసోర్స్ పర్సన్స్ గా వ్యవహరించారు.

కార్యక్రమంలో గ్రామ కౌన్సిలర్లు అవేంద్ర , మహమ్మద్ గారు పాఠశాల ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్ చంద్రశేఖర్రెడ్డి ఫయాజ్, శ్రీనివాసులు, డాక్టర్ సాజిత సుల్తానా, హెల్త్ సూపర్వైజర్ మహబూబ్ బాషా ,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *