ఈ టిఆర్ ఎస్ ఎమ్మెల్యే రూటే వేరు…

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: టిఆర్ ఎస్ కాగజ్ ఎమ్మెల్యే కొనేరు కోనప్పరూటే వేరు. ఆయన రాజకీయ మార్గం నూరు శాతం సంక్షేమ మార్గం.  తెలంగాణలో రాజకీయ ప్రకటనలకు, నాయకత్వాన్ని సంతోషపెట్టేలా మాట్లాడానికి, ఎపుడూ అపోజిషన్ నేతలను విమర్శించడానికి ఆయన దూరం. ఇలాంటి సెన్సేషనల్ రాజకీయ ప్రకటనలు కాగజ్ నగర్ నుంచి ఎపుడూ రావు. అక్కడి నుంచి వచ్చే వార్త  ఒక్కటే…  కాలేజీ పేద విద్యార్థులకు ఉచిత మధ్యాహ్నం భోజనం అనో,  నిత్యాన్నదానమనో, ఉద్యోగాల పరీక్షలు రాయాలనుకుంటున్న విద్యార్థులకు ఉచిత శిక్షణ అనో, సామూహిక వివాహాలు అనో … వార్తలు వస్తాయి తప్ప రాజకీయ ప్రకటనలు రావు. ఇక కోవిడ్ సమయంలో కోనప్ప బృందం అందించిన సేవలు అంతా ఇంతా కాదు. ఒక ఫోన్ నెంబర్ ప్రకటించి ఆ ఫోన్ కు కాల్ వచ్చిన ప్రాంతం ఎంత మారుమూల అయినా సరే అక్కడికి వైద్యబృందాన్నిపంపించడం లేదా రోగులను ఆసుపత్రికి చేర్చేందుకు వాహనం పంపడం జరిగేది. అంతేనా, కాదు ఇంకా చాలా ఉంది. క్వారంటైన్ లో ఉన్న కుటుంబాలకు భోజనం సరఫరా చేసేందుకు బైక్ వారియర్స్ ను ఏర్పాటు చేశారు. ఫోన్ కాల్ రాాగానే కొంతమంది యువకులు ఈ బైక్ ల మీద ప్రతిరొజూ  రెండు పూటలా భోజనం క్యారియర్ అందించేవారు.

కోచింగ్ సెంటర్ క్లాస్ రూం

మరొక విషయమేమంటే… ఈ భోజనాలు తయారీలో కోనప్ప కుటుంబం యావత్తూ పాల్గొంటుంది, కుటుంబ సభ్యలుంతా వంట చేస్తారు ప్యాక్ చేస్తారు. ఇంటి దగ్గిరే బోజనం  అయితే, స్వయంగా వడ్డిస్తారు. కోనప్ప ట్రస్టు నిర్వహిస్తున్న కాగజ్ నగర్ నిత్యాన్నదానం దీనికి ఉదాహరణ.  పేదలకు జరిగే నిత్యాన్న దానం  ఒక వ్యక్తి ఇలా  శుచి శుభ్రత, రుచి విషయంలో  టిటిడికి ఏ మాత్రం  తీసిపోకుండా జాగ్రత్త పడటం ఇక్కడి నిత్యాన్న దానం లో చూడవచ్చు. ప్రయివేటున నిర్వహించే నిత్యాన్న దానాలలో సక్సెస్ స్టోరీ ఏదయినా ఉంటే మొదట చెప్పుకోవలసిన పేరు కోనప్పదే.

వేసవిలో కోచింగ్ కు ఇలా ఏర్పాటు…

ఇపుడాయన మరొక కొత్త కార్యక్రమం ప్రారంభించారు.  కాగజ్ నగర్ పట్టణం లోని కాపువాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పోలీసు ఉద్యోగులకు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించారు.  కోనప్ప, భార్య శ్రీమతి రమాదేవి  ప్రత్యేక పూజలు చేసి ఉచిత ట్రైనింగ్ సెంటర్ను బాబ్జి అర్థమెటిక్ వైజాగ్ తో మొదటి తరగతి క్లాస్ ను ప్రారంభించారు.

గ్రామీణ ప్రాంతాల్లోని యువకులకు సరైన గైడెన్స్ లేక, కోచింగ్ లేక పోటీ పరీక్షలు రాయలేకపోతున్నారు.  ఈ యువకుల్లో కూడా తెలివైన వారున్నారని, వారికి కొద్దిగా గైడెన్స్ ఇస్తే తప్పకు పోటీ పరీక్షలలో నెగ్గుతారని ఆయన విశ్వాసం. అందుకే ఈ పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున రిక్రూట్ మెంట్ జరగబోతున్ననేపథ్యంలో ఆయన నేడు కోచింగ్ కార్యక్రమం ప్రారంభించారు. దీనివల్ల  ఈ జిల్లాలో పోలీసులలోొ ఈ జిల్లాకు చెందిన వారు ఎక్కువగా ఉద్యోగం తెచ్చుకోగలరనే నమ్మకంతో ఆయన ఈ  శిక్షణా కార్యక్రమం ప్రారంభించారు.

ఇలా ఎపుడూ కేవలం నియోజకవర్గ సంక్షేమ కార్యక్రమాలలో నిమగ్నమయి ఉండే ఎమ్మెల్యే తెలుగు రాష్ట్రాల్లో కోనప్ప ఒక్కరే. మరొక విషయం ఈ కార్యక్రమాల ఖర్చులో ప్రభుత్వం నిధుల వాటా చాలా తక్కువ. నిధులను ఆయన తన స్నేహితుల నుంచే సేకరిస్తుంటారు. రాజకీయాల్లో భూ కబ్జాలు, దౌర్జన్యాలు, దుష్ట విఐపి సంస్కృతి, అవినీతి, పెత్తందారీ తనం మీతిమీరిన ఈరోజుల్లో కోనప్ప లాంటి ఎమ్మెల్యేలు కనిపించడం కష్టం… మరొక విశేషమేంట్… ఆయన పక్కా లోకల్ మనిషి. తన కార్యక్రమాలకు ప్రారంభాలకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులను ఆహ్వానించి, వారికి వంద కార్లతో స్వాగతంతోె పలికి, గజమాలలు వేసి, పొగిడి, దాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నం ఎపుడూ చేయరు. సింపుల్ గా స్థానికులతో, కార్యక్రమంతో సంబంధం ఉన్న వారితో మాత్రమే ఆయనప్రారంభోత్సవాలుంటాయి.

కోనప్ప చాలా సాదాసీదా కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన గతం మర్చిపోలేదు. సాదాసీదా జీవితం, సాదాసీదా రాజకీయాల కార్యక్రమాలు మాత్రమే ఉంటాటయి. తెలంగాణలో విఐపి న్యూసెన్స్ లేని నియోజకవర్గం ఇదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *