‘ఆంధ్రాలో వివిఐపి న్యూసెన్స్’

ఆంధ్రాలో వివిఐపిల న్యూసెన్స్ శృతి మించుతున్నదా?

నిన్న శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల సందర్బంగా  ముఖ్యమంత్రి జగన్  ఒంటిమిట్ట కు వొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోదండరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయితే, ఆయన రాక సందర్భంగా  సందర్భంగా 3500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంత ఆర్భాటం  అవసరమా?  నిన్నపోలీసుల సంఖ్య గ్రామ జనాభా కంటే ఎక్కువేమో.   రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్లకు  ఈ ఆర్భాటాలేమిటి?  ముఖ్యమంత్రికి, మంత్రులకు ఆర్భాటాలు, అట్టహాసాలు మరీ ఎక్కువయ్యాయని కాంగ్రెస్ నేత  ఎన్. తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.

 

నిన్ననే మరొక రెండు సంఘటనలు కొత్త మంత్రుల ఆర్భాటంవల్ల ప్రజల్లో ఆగ్రహం తెప్పించాయి. రాయలసీమ కళ్యాణదుర్గం లో మంత్రి ఉషా శ్రీచరణ్ విజయోత్సవ ర్యాలీ జరుపుకున్నారు.  అయితే, మంత్రిగారి ర్యాలి కోసం పోలీసులు ట్రాఫిక్ బంద్ చేశారు.  కారణంగా  పండు అనే 8నెలల చిన్నారి  వైద్యం కోసం వెళ్లుతూ ముందుకు పోలేకపోయింది. ఆమెకు సకాలంలో వైద్యం అందక చనిపోయింది. దీనికి మంత్రిగారి ఆర్భాటమే కారణం కాదా?అని ఆయన ప్రశ్నించారు.

మరొక సంఘటన  శ్రీకాళహస్తి ఆలయంలో జరిగింది.  దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దర్శనం  కోసం వచ్చారు. మంత్రిగారు వస్తున్నారని పోలీసులు, అధికారులు  3 గంటల పాటు భక్తుల దర్శనాలను నిలిపివేశారు. అసలే వ వేసవి. వేడిలలో భక్తులను క్యూ లైన్లలో ఉంచడం అంతసేపు పడిగాపులు కాసేలా చేయడం  ధర్మమా? అని తులసిరెడ్డి అంటున్నారు.

జగనే మొదటి ముఖ్యమంత్రియా, అంతకు ముందు రాష్ట్రానికి ముఖ్యమంత్రులు లేరా,ఇలాగే, ఇక దేశంలో ముఖ్యమంత్రులు లేరా, వాళ్లంతా ఇలా ఇంత అర్భాటంగా ప్రజలను ఇబ్బంది పడుతు విజయోత్సవాలు, సెలెబ్రేషన్స్ చేసుకున్నారా అని ఆయన ఆశ్చర్య పోయారు.  ముఖ్యమంత్రి, మంత్రులు ఇలాంటి సంస్కృతి మానుకోవాలని ఆయన సూచించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *