హైదరాబాద్ లో ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా?

హైదరాబాద్ లో ఎన్నికుటుంబాలున్నాయో దాదాపు అంతా ఏదో ఒక ఆస్తి సేకరించాలనుకుంటున్నారంటే ఆశ్చర్యం లేదు. ప్లాటో, ఫ్లాటో కొనాలని యోచించని కుటుంబాలు, కొత్త జంటలు లేవు.  అందుకే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మందకొడిగానే అయినా పుంజుకుంటూ ఉంది.

ఫ్లాట్లు కొనే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటికయితే, ఇతర నగరాలతో పోలిస్తే, హైదరాబాద్ లో ఫ్లాట్ల కొనుగోళ్లు కొంచెం తక్కువే. 2021లో దేశంలోని ఏడు మహానగరాలలో  ఆమ్ముడు పోయిన ఫ్లాట్ల వివరాలు తీసుకుంటే, బెంగుళూరు టాప్ లో ఉంది. తర్వాతి స్థానం ముంబైయి. మూడోస్థానంలో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్  ది.   దేశమంతా అముడుబోయిన ఫ్లాట్లో ఈ మూడు నగరాల వాట  59 శాతం. బెంగుళూరులో  27,118 ఫ్లాట్లు, విల్లాలు అమ్ముడు పోతే, ముంబైలో 25,368 అమ్ముడుపోయాయి. ఢిల్లి విషయానికి వస్తే అక్కడ 23.109  యూనిట్లు అమ్ముడు వోయాయి.

మన హైదరాబాద్  వ్యాపారం తీసుకుంటే ఇక్కడ చాలా తక్కువ సంఖ్యలో  15,787 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయినట్లు ‘టైమ్స్ ప్రాపర్టీ’ తెలిపింది.

హైదరాబాద్ నిర్మాణాల విషయానికి వస్తే,  దాదాపు 1.03 లక్షల యూనిట్లు నిర్మాణం (అండర్ కన్ స్ట్రక్షన్ )  లో ఉన్నాయి. ఇందులో 16 శాతం2022 లో పూర్తి అయ్యే  అవకాశం ఉంది. మరొక 16 శాతం 2023లో పూర్తి కావచ్చు. 2024లో పూర్తయ్యేవి సుమారు 15 శాతం దాకా ఉంటాయి. మిగతా వి 2024 తర్వాతే పూర్తవుతాయి. ఎందుకంటే, చాలా నిర్మాణాలు గత రెండేళ్లలోనే మొదలయ్యాయి. అందువల్ల అవి 2014 తర్వాతే పూర్తవుతాయి.

నిర్మాణంలో ఉన్న యూనిట్లలో  కూకట్ పల్లి,మాదాపూర్,కొండాపూర్, గచ్చిబౌళి, రాయదుర్గం, కోకాపేట్ లలోనే సుమారు 60 శాతం దాకా ఉన్నాయి. 2021లో అమ్ముడువోయిన యూనిట్లలో, లాంచ్ అయిన కొత్త ప్రాజక్టులలో  64 శాతం ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయని నైట్ ఫ్రాంక్ అని పేర్కొంది.

ఇక హైదరాబాద్ శేరిలింగం పల్లి ఇపుడు రియల్ ఎస్టేట్ హాట్ స్పాట్ అయింది. గచ్చిబౌళి అంటే  ఈప్రాంతంలోకే వస్తుంది. ఐటి హబ్ లకు దగ్గిర ఉండటం,మాల్స్, సూపర్ మార్కెట్లు, కార్పొరేట్ ఆసుపత్రులు, క్వాలీటీ స్కూళ్లు ఈ ప్రాంతాలలో అందుబాటులోకి రావడంతో ఇపుడు ఒక ఇంటి వారమవుదామనుకుంటున్నయువదంపతులు ఇటు వైపు చూస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో ధరలు కూడా ఇతర హబ్స్ తో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి. ఇన్వెస్ట్ మీద రాబడి అంటే అద్దె కూడా ఇక్కడ  బాగానే ఉంది. లింగం పల్లి రైల్వే స్టేషన్, రాయదుర్గం మెట్రో స్టేషన్లు అన్నీ నాలుగయిదు కి.మీ దూరానే ఉండటం గచ్చిబౌళికి కలిసివచ్చింది. ప్లాట్, లేదా విల్లా , లేగా జాగా కొనాలనుకుంటున్నవాళ్లకి శేరిలింగం పల్లి ఏరియా అనువయిందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *