అంబేడ్కర్ గుర్తుకొచ్చేది ఒక్కరోజేనా?

జయంతి  అంటూ డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి దండాలు పెట్టి  నినాదాలు చేసి టివిలో కనిపించి వెళ్లి పోతున్నారు తప్ప ఆయన ఆదర్శాలు అర్థం చేసుకుని వాటి కోసం నిలబడుతున్న నాయకులెవరైనా కనిపిస్తారా? 

 

 

-మాదం తిరుపతి

మహారాష్ట్రలోని కొంకణ అనే ప్రాంతంలోని రత్నగిరి జిల్లా కు చెందిన అంబ వాడ అనే గ్రామంలో రాంజీ మలోజీ , రామాబాయి దంపతులకు 14వ సంతానం డాక్టర్ భీమ్రావ్ రాంజీ అంబేడ్కర్ వారు 1891 ఏప్రిల్ 14న జన్మించాడు .ఆయన దేశంలోని అణగారిన వర్గాల కోసం ఎనలేని కృషి చేశాడు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా గొప్ప వ్యక్తిగా నిలిచాడు.

అలాంటి మహనీయుని మన నాయకులు ఆయన జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు పూలమాల వేయడం దండాలు పెట్టడం టీవీ లో చర్చలు చేయడం పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వటం చేస్తున్నారు ఆ తర్వాత రోజు నుండి ఎవరి పని వారు చేసుకోవడం తప్ప ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి అలాగే బాధాకర విషయం ఏమిటంటే ఆయన రచనలు ఆయన చేసిన కృషి ఒక్క నాయకుడైనా చదివి ఆచరిస్తున్నారా.

అలాగే అంబేడ్కర్ గారి జీవిత చరిత్ర చదువుతుంటే ఆయన పడిన కష్టం ఆయన ఎదుర్కొన్న అవమానాలు బడి బయట కూర్చుని వీధి దీపాల కింద చదువుకున్న వ్యక్తి అంబేద్కర్ ఉన్నత విద్య కోసం అమెరికా ఇతర దేశాలకు వెళ్లి గొప్ప గొప్ప చదువులు చదివిన వ్యక్తి అంబేద్కర్ అలాగే అనేక గ్రంథాలను చదివాడు అణచివేత, అంటరానితనాన్ని అనుభవించిన ఆ రోజుల్లో దళితుల జీవితాల్లో వెలుగు నింపడం కోసం పురాణాలు, వేదాలు, రామాయణం, ఇతిహాసాలు, మనుధర్మం ,బ్రాహ్మణిజం పోవాలని పోరాడిన వ్యక్తి అంబేద్కర్. ప్రజాస్వామ్య దేశంలో సామాజిక సమానత్వం లేనప్పుడు స్వేచ్ఛకు అర్థం ఉందని మాట్లాడిన వ్యక్తి అలాగే సమానత్వం లేనప్పుడు స్వేచ్ఛను అనుభవించగలామా అని గర్జించిన మహనీయుడు అంబేద్కర్.

అంబేడ్కర్ అందరివాడు ఎలా అవుతాడు?

ఈ మధ్య కాలం నుండి అనేకమంది ఆధిపత్య భావజాలం కలిగినవారు దోపిడీదారులు అందరూ అంబేడ్కర్ అందరివాడు అనే పదాన్ని ప్రచారం చేస్తున్నారు.అయితే ఈ పదం చెప్పడానికి వినడానికి చాలా బాగుంటుంది కానీ అంబేడ్కర్ అందరివాడు ఎలా అవుతాడనేది  వారందరికీ నా మొదటి ప్రశ్న?

ఎందుకంటే అంబేడ్కర్ గారు అణచివేతకు, వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి . మరి నేడు కనీసం నాయకులనే వారిని కలవడానికి గంటలకొద్దీ ప్రజల్ని ఇంటిముందు నిలబెట్టుకునే వారికి అంబేడ్కర్ అందరివాడు అనే అర్హత ఉందా?  అంబేద్కర్ గారు వ్యతిరేకించిన భావజాలాన్ని  ప్రచారం చేస్తున్న నాయకులకు అంబేడ్కర్ అందరివాడని ప్రచారం చేయడంలో ఆంతర్యమేమిటో ఏమిటి?

అంబేడ్కర్ గారు తన జీవితకాలం మొత్తం కూడా మతోన్మాదం  ప్రమాదాన్ని కులం ప్రమాదాన్ని నిరంతరం విమర్శించిన వ్యక్తి. మను ధర్మాన్ని తగలబెట్టిన వ్యక్తి. కానీ ఇయ్యాల మను ధర్మం వారసత్వాన్ని ముందుకు తీసుకుపోతున్న నాయకులు అంబేడ్కర్ గారు అందరివాడు అంటే మనం వారి మాటలు స్వీకరించాల?

ఇవాళ మను ధర్మాన్ని కాల్చిన వ్యక్తుల మీద దాడి చేసేవారు ఏం సమాధానం సమాజానికి ఏంచెబుతారు నేడు అంబేడ్కర్  భావజాలాన్ని, ఆయన కృషితో రూపు దిద్దుకున్న రాజ్యాంగాన్ని విమర్శించే ఆర్ఎస్ ఎస్ ,బిజెపి నాయకులు ‘అంబేద్కర్ అందరివాడు’ అని అర్థంలేని ఉపన్యాసాలిస్తూ ప్రజలను మభ్యపెట్టడుతున్నారు.

అసలు అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం పై వారికి గౌరవం ఉందా?  రాజ్యాంగంపై ఆర్ఎస్ఎస్ బిజెపి స్పష్టమైన వైఖరి చెప్పగలరా ?ఒకవేళ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం పై గౌరవం ఉంటే ఈ బిజెపి ఆర్ఎస్ఎస్ నాయకులు రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పగలరా ఈ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని ప్రచారం చేయగలరా? అంబేడ్కర్ గారు చెప్పినట్టు మహిళలను గౌరవించే సంస్కృతి సాంప్రదాయం దగ్గర ఉందా అనే ప్రశ్నలు వేసినప్పుడు దీనికి సమాధానం ఈ నాయకులు చెప్పగలరా?

నిత్యం ఉత్తర ప్రదేశ్ రాజస్థాన్ ఇతర బీజేపీ రాష్ట్రాలలో దళితులపై నిత్యం దాడులు దౌర్జన్యాలు జరుగుతుంది ఎక్కడైనా స్పందించాారా? తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో కుల దురహంకార హత్య జరిగినప్పుడు మీరు ఎవరికి మద్దతు పలికారు మీరు? చెప్పగలరా?

అలాగే దేశ వ్యాప్తంగా అనేక చోట్ల అంబేడ్కర్ విగ్రహాలను కూల్చినప్పుడు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఏ ఒక్క నాయకుడికైనా అంబేద్కర్ రచనలు గుర్తుకురాలేదా?

ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ప్రశ్నల రూపంలో వారి ముందు ఉంటాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల మరణం ఏ భావజాలం చంపిందో ప్రపంచం అందరికీ తెలుసు. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడం కోసంఅంబేడ్కర్ అందరివాడేలే అనే ఒక నినాదాలు ఇస్తూ పక్కదోవ పట్టించడమే.

నిత్యం అంబేడ్కర్ గారి రాజ్యాంగం ప్రకారం గెలిచిన నాయకులు వారి ఆశయాలు తుంగలో తొక్కుతూ బయటకి మాత్రం గొప్ప గొప్ప ఉపన్యాసాలిస్తూ తినే తిండి పై, వేసుకునే బట్టలు, ప్రతి అంశంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించే వారికి అంబేద్కర్ ఎలా సొంతం అనేది ప్రశ్న?

అలాగే ఓట్ల రాజకీయం కోసం అంబేడ్కర్ గారి పేరు వాడుకోవడం  తప్ప ఏ ఒక్క రోజు కూడా ఈ నాయకులు అంబేడ్కర్ గారు ఆదేశిక సూత్రాల ప్రకారం విద్య, వైద్యం, కూడు ,గుడ్డ నీడ కోసం నిలబడ్డారా?  ప్రజానీకాన్ని జ్ఞానవంతులు చేయడం కోసం  కృషి చేస్తున్నారా?

హిందూ రాజ్యం అస్తిత్వంలోకి వస్తే ఈ దేశానికి కచ్చితంగా అదో పెద్ద విపత్తుగా తయారవుతుందని అంబేద్కర్ గారు ఒక మాట చాలా స్పష్టంగా  చెబుతారు.  హిందువులు ఎన్ని మాటలు చెప్పినా హిందూయిజం అనేది స్వేచ్ఛకు ,సమానత్వాని  పెద్ద గొడ్డలి పెట్టు ప్రజాస్వామ్యానికి హిందూరాజ్యానికి  అసలు పొసగదు. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోను సరే హిందూ రాజ్యం ఏర్పడకుండా చూడాల్సిందే  అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చాలా స్పష్టంగా హెచ్చరించారు. ‘పాకిస్తాన్ ఆర్ ది పార్టీషన్ ఆఫ్ ఇండియా’ (Pakistan Or The Partition of India) పుట 358 లో ఉంది.

If Hindu Raj does become a fact, it will, no doubt, be the greatest calamity for this country. No matter what the Hindus say, Hinduism is a menace to liberty, equality, and fraternity. On that account, it is incompatible with democracy. Hindu Raj must be prevented at any cost.

(Pakistan or The Partition of India, Page 358)

కాబట్టి బిజెపి వారు హిందూ రాజ్యమే ధ్యేయంగా మా ప్రయాణమని మాట్లాడుతున్నారు మరి వారుఅంబేడ్కర్ ఆశయాలు ఎలా ముందుకు తీసుకు పోతారు?

అలాగే అంబేడ్కర్ గారు చేసిన కృషి ఇసుమంతైనా ఈ నాయకులు చేయగలరా? ఇలా మనం ప్రశ్నిస్తూ ముందుకు వెళ్లాలి. కేవలం అంబేడ్కర్ గారిని జయంతి రోజు దండేసి దండం పెట్టినంత మాత్రాన ఈ సమాజానికి ఒరిగేది ఏమీ లేదు. అంబేడ్కర్ గారి రచనలు చదివి పేద వర్గాలకు న్యాయం చేసినప్పుడు మాత్రమే ఆయనకు మనం నిజమైన నివాళి అర్పించిన వారు అవుతారు.

(ఇందులో వ్యక్తం చేసిన అభిప్రాయాలన్నీ రచయిత వ్యక్తిగతం)

(మాదం తిరుపతి, USFIరాష్ట్ర కార్యదర్శి, BA,LLB, కాకతీయ యూనివర్సిటీ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *