అమరావతే రాజధాని: హైకోర్టు

“అమరావతే రాజధాని” సారాంశంతో హైకోర్టు తీర్పు నిచ్చింది. అమరావతిరాజ ధాని అభివృద్ధి కోసంతీసుకువచ్చిన  సీఆర్డీఏ (Capital Region Development Authority) చట్టాన్ని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు,  అమరావతి  మాస్టర్ ప్లాన్ ను అమలు చేయాలని కాల పరిమితిని నిర్దేశిస్తూ తీర్పు చెప్పింది.

వికేంద్రీకరణ పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన   3 రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఈరోజు హైకోర్టు తీర్పు ఇచ్చింది.

సీఆర్డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని, ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిడం విశేషం.

భూములిచ్చిన రైతులకు 3 నెలల్లో ప్లాట్లను అభివృద్ధి పరిచి అప్పగించాలని; రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖా పెట్టడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

రాజధాని అవసరాలకు తప్ప వేరే వాటికి భూములు ఇవ్వొద్దని , పిటిషన్ల ఖర్చు కోసం రూ.50 వేలు ఇవ్వాలని చెబుతూ  కొంతమంది న్యాయమూర్తులు ఈ కేసులు విచారించొద్దన్న పిటిషన్‌ను కొట్టివేసింది.  రాజధానిపై నిర్ణయాలు, చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని తేల్చి చెప్పింది హై కోర్టు. అదే విధంగా హైకోర్టు తరలింపు నిర్ణయం కూడా  రాష్ట్రం పరిధిలోలేదని,అది పార్లమెంటు తేల్చాల్సిన విషయం అని స్పష్టం చేసింది.

సిపిఐ కార్యదర్శి రామకృష్ణ, సమాజిక ఉద్యమకారుడు టి లక్ష్మినారాయణ హైకోర్టు తీర్పును స్వాగతించారు.

పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *