సివిల్స్ కి కోచింగ్ అవసరం లేదు: డా. ఆకాంక్ష IAS

 

డాక్టర్ ఆకాంక్ష భాస్కర్ పశ్చిమబెంగాల్ క్యాడర్ ఐఎఎస్ అధికారి. ఆమె కోల్ కతాలోని ఆర్ జి కార్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబిబిఎస్ పూర్తి చేశారు.  తర్వాత వెంటనే సివిల్స్ రాశారు. ఎక్కువ ప్రిపరేషన్ లేకుండానే ఆమె సివిల్స్ సాధించారు. ఆమె ప్రిపరేషన్ అంతా కలపి ఏడెనిమిది నెలలు మించి లేదు. ఆమె చాలా మంది లాగానే కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్లారు. ఇది  2014 నాటి మాట. కొన్ని సంస్థల్లో చేరారు. అయితే, పూర్తిగా క్లాసులకు వెళ్లి పాఠాలు విని కోచింగ్ మీద ఆధారపడి సివిల్స్ కు ఆమె ప్రిపేర్ కాలేదు. ఆమెకు ఎక్కువ సమయం కూడా లేదు. అందువల్ల సొంతంగా ప్రిపేర్ అయ్యారు. దీనితో ఆమెకు కోచింగ్ పెద్దగా ఉపయోగపడలేదు.   తానెలా ప్రిపేరయిందో  డాక్టర్ ఎంవి రావుతో జరిపిన ఇంటారాక్షన్ లో ఆమె వివరించారు.

 

డాక్టర్ ఆకాంక్ష సివిల్స్ ప్రిపరేషన్ గురించి చాలా భ్రమల్ని పటాపంచలు చేశారు.  భ్రమలు ఏవంటే: 1. కోచింగ్ కచ్చితంగా తీసుకోవాలి. 2. మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి సబ్జక్టులు చాలా పెద్ద సబ్జక్టులు అవి అప్షనల్స్ కు పనికిరావు. 3. సుదీర్ఘమయిన ప్రిపరేషన్ సివిల్స్ కి అవసరం. 4.  సులభమయిన, కఠినమయిన సబ్జక్టులు అనే విభజన. 5. పట్టణాల్లోనే ఉండి చదవాలి.

డాక్టర్ ఆకాంక్ష  సివిల్స్ ప్రిపేరయిన విధానం అందరికి చక్కటి మాన్యువల్ లాంటిది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ పట్టణాల కొచ్చి  సివిల్స్ ప్రిపేరవుతున్న వారికి చక్కటి మార్గదర్శి.  ఇపుడున్న పరిస్థితుల్లో అంటే ఇపుడున్న సోషల్ మీడియా, ఇంటర్నెట్, యూట్యూబ్ ప్రసార మాధ్యమాల మధ్య ప్రిపరేషన్ సులభమయింది. ఇంటిదగ్గరి నుంచే చక్కగా సివిల్స్ కు ప్రిపేరయ్యే అవకాశం ఉంది దేశంలో ఏమూల ఉన్నా (అక్కడ ఇంటర్నెట్ అంటూ ఉంటే) అక్కడి నుంచే సివిల్స్ కు ప్రిపేర్ కావచ్చు. ఇదే మంత పెద్ద సమస్య కాదు. కోచింగ్ కచ్చితంగా తీసుకోవాలనే మైండ్ సెట్ నుంచి బయటకురమ్మని ఆమె చెబుతున్నారు.

డాక్టర్ ఆకాంక్ష చెబుతున్న మరొక ముఖ్యమయిన విషయం ఓరియంటేషన్. ఆమె చాలా సంవత్సరాలకిందటే తెలియకుండానే  ఈ ఓరియంటేషన్ అలవర్చుకున్నారు.  సివిల్స్ రాయాలనేది రాత్రి కి రాత్రి జరిగే నిర్ణయం కాదు. ఎపుడో నిర్ణయమవుతుంది. అందువల్ల సివిల్స్ ఓరియెంటేషన్ అలవర్చుకోవాలి. దీనితో సగం పూర్తవుతుంది. ఆరంభం శుభారంభం అవుతుంది.

తానుచదువుతున్నది సైన్సే అయినా, దేశం ఎలా నడుస్తున్నది, ఎలా నడిపిస్తున్నారు, ఎందుకిలానే నడుస్తూ ఉంది, దేశంలో ఏం జరుగుతూ ఉంది, ఎవరేం చేస్తున్నారు, రూల్ ఆప్ లా అంటే ఏమిటి అనే అంశాల మీద ఆమె జిజ్ఞాస అలవర్చుకున్నారు. ఇది కొన్నేళ్ల పాటు సాగడంతో జనరల్ స్టడీస్ మీద పట్టు వచ్చింది.  దీనితో సివిల్స్ ప్రిపరేషన్ బోరింగ్ గా, భారంగా ఉండకుండా ఆహ్లాదకరంగా మారింది. ఏదైనా ఆడుతూపాడుతూ ఆనందిస్తూ చేయగలిగే అంతకు మించి అనుభవం ఏముంటుంది.

ఇవి కూడా చదవండి

 

నేనొక సారి ఒక ఆశ్రమానికి వెళ్లాను. చిన్న ఆశ్రమం. ఒక స్వామీజీ ఉంటారక్కడ. ఎవరో ఆయనను నాకు పరిచయం చేశారు. జమ్మలమడుగునుంచి పది కిలో మీటర్లు దూరాన అగస్తీశ్వరకోనంలొ  ఆయన చిన్న రూం కట్టుకుని ఆశ్రమంగా మార్చుకుని  అక్కడి క్షేత్రాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రశాంతంగా ఉంటుందని నేను వెళ్లాను.  నేను వెళ్లేసరికి ఇద్దరు శిష్యులు తప్ప ఎవరూ లేరు. నేను మరొక మిత్రుడితో కలసి వెళ్లాను. మేమొచ్చాం కనక ఆయన భోజనం చేయమన్నారు. పదినిమిషాల్లో ఆయన భోజనం చేశారు. మినిమం సరుకులతో భోజనం తయారు చేశారు. అద్భుతంగా ఉంది. ఏమిటి రహస్యం అన్నాను. భోజనం చాలా సెన్సిటివ్ వ్యవహారం. ఉప్పు,కారం కరెక్టుగా పడితేనే వంట విజయవంతమవుతుంది. అది తప్పితే రచి తప్పుతుంది. దీనికి నిష్ట అవసరం. మన మహిళలు  ఈ నిష్టతో  వంటలు చేస్తారు.  వంట చేస్తూ ఆనందిస్తారు. ఆనందంగా వంట చేస్తారు. అందుకే మనం హోమ్ ఫుడ్ కు ప్రాముఖ్యం ఇస్తాం.  ఆ తర్వాతే మిగతా వంటలు. ఆసక్తి పోతే, వంట రుచి దెబ్బతింటుంది.  నేను మనష్పూర్తిగా వంట చేశాను. అన్నీ కుదిరాయి. ఏమాత్రం అయిష్టత ఉన్న దినుషుల  క్వాంటిటి మిస్సవుతుంది. అపుడు రుచి దెబ్బతింటుంది. చికాకు, భారం మోస్తున్నట్లుగా  చేసే వంటలు రుచిగా ఉండవు అని చెప్పాడు.

డా. ఆకాంక్ష IAS తో సీనియర్ IAS అధికారి డాక్టర్ ఎంవి రావు జరిపిన ఇంటరాక్షన్ చూశాక నాకు ఆనాటి  స్వామీజీ గుర్తుకొచ్చాడు. ప్రిపరేషన్ ఆహ్లాదకరంగా మార్చుకోవడం ఎలాగో ఆమె చెప్పారు.

అయిదున్నరేళ్లు ఎంబిబిఎస్ చదివాక, ఆ చదువు ఒంటబట్టాలి. ఆమె ఈ విషయంలో విజయవంతమయ్యారు. కోర్సు మనస్ఫూర్తిగా పూర్తి చేశారు. చాలా నేర్చుకున్నారు. నేర్చుకున్నది మెదటో భద్రంగా ఉంది.  అయిదున్నరేళ్లు చదివిన సబ్జక్టును కాదని కొత్త సబ్జక్టేదో ఈజీ అని  తీసుకుని  ప్రిపేర్ కావడం దండగ అనుకుందామె. అందుకే తన సబ్జక్టులు, అందునా అయిదున్నరేళ్లు తాను చదవిన  సబ్జక్టుతోనే ముందుకెళ్లాలనుకుంది. దీనితో ప్రిపరేషన్ సుళువయింది. ఆహ్లాదకరంగా మారింది. ఇది చిన్న పరిచయం. పూర్తి వివరాలకు కింది వీడియో చూడండి.

 

 

డాక్టర్ ఆకాంక్ష ఇంటారక్షన్ సివిల్స్ యాస్సిరెంట్ కి బాగా ఉపయోగపడుతుంది. డాక్టర్ ఎంవిరావు ఇలాంటి ఇంటారాక్షన్లు  జరిపి సివిల్స్ ప్రిపేరయ్యే వారిలో ఆత్మస్థయిర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనను అభినందనలు.  ఇలాంటి ఇంటరాక్షన్ వీడియో లు డాక్టర్ ఎంవి రావు అందిస్తూనే ఉంటారని ఆశిద్దాం.

 

డాక్టర్ ఎంవి రావు గురించి మూడు ముక్కలు:

Dr MV Rao IAS
Dr MV Rao IAS / Twitter Picture

 

డాక్టర్ ఎంవి రావు (1988 బ్యాచ్ ఐఎఎస్)   పశ్భిమబెంగాల్ కు చెందిన ఐఎఎస్ అధికారి. డాక్టర్ రావు ఉస్మానియా యూనివర్శిటీలో ఎమ్మె ఇంగ్లీష్ చేశారు. సివిల్స్ ఎంపికయ్యారు. మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  నేషనల్ ఫిషరీస్ డెవెలప్ మెంట్ అధారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా సెంట్రల్ డెప్యూటేషన్ మీద పని చేశారు. డాక్టర్ రావు చిత్రమయిన అధికారి.  ఆయన మత్యకార్మికుల కాలనీలను అభివృద్ధి చేసేందుకు, వారి ఆదాయం పెంచేందుకు అహర్నిశలు కృషి చేశారు. ఆయన భార్యతో కలసి ఈ కాలనీలను సందర్శించేవారు. మత్య్సకారులకు పెట్రోమాక్స్ లైట్ల స్థానంలో సోలార్ ల్యాంపులు అందించారు. వాళ్ల కాలనీల విద్యుదీకరణకు సాయపడ్డారు. వాళ్లు చేపలు అమ్ముకునేందుకు వాహనాలు ఏర్పాటు చేశారు. పాండ్ టు కిచెన్ పద్ధతిని  ప్రవేశపెట్టి మత్స్య ఉత్పత్తులను ఇళ్లకు నేరుగా చేరవేసేందుకు వ్యాన్ లను ప్రవేశపట్టారు.

ఆయనెపుడూ లబ్దిదారుల పక్షం నుంచే సమస్యను చూసేవారు. ఏదయినా పనిమీద సుదూర ప్రాంతాలనుంచి తన కార్యాలయానికి వచ్చే లబ్దిదారులు తన కార్యాలయంలో శ్రమపడకుండా పని పూర్తి చేసుకునే ఏర్పాటు చేశారు. వారికి భోజన వసతి ఏర్పాటు చేశారు.  ఎక్కడ పబ్లిషిటీ చేసుకోకుండా గుట్టు చప్పుకాకుండా పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు పనిచేస్తారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *