సివిల్స్ కు కోచింగ్ నిజంగా అవసరమా?

అపుడపుడు స్నేహితుల నుంచి సివిల్స్ కోచింగ్  గురించి వాకబు చేస్తూ ఫోన్లు వస్తుంటాయ్. సివిల్స్ ప్రిపరేషన్ కు హైదరాబాద్ లో మంచి కోచింగ్ సెంటరేమైనా ఉందా?  అని అడుగుతుంటారు. అలాగే కొందరయితే, ఢిల్లీలో కోచింగ్ ఇప్పిస్తే బాగుంటుందా లేక హైదరాబాద్ లోనే చేర్పిస్తే బాగుంటుందా అని అడుగుతుంటారు.
కొంత ఖర్చయిన పర్వాలేదు అనుకునే వాళ్లు తమ పిల్లలను ఢిల్లీకి పంపిస్తున్నారు. ఢిల్లీ సివిల్స్  ప్రిపరేషన్  వాతావరణంలో బాగా చదువుతారని  వారి నమ్మకం.
కోచింగ్ తీసుకుంటే మంచిదని చాలామందిలో పదిలంగా గూడుకుట్టుకుని ఉన్న నమ్మకం. ఇంటిదగ్గిరే ప్రిపేరయి సెలెక్టు కాలేని వాళ్లంతా బాధపడేది కోచింగ్ తీసుకోకనే తాము సెలెక్ట్ కాలేదని.
అందువల్ల కోచింగ్ తీసుకోవాలా వద్దా, తీసుకుంటే  హైదరాబాద్ లోనా, ఢిల్లీలోనా, కోచింగ్ తీసుకోవాలని నిర్ణయించుకుంటే, ఏ ఇన్ స్టిట్యూట్ కు వెళ్లాలనేది పెద్ద ప్రశ్న.
అయితే,  ఈ మధ్య సివిల్స్ఎంపికయిన చాలా మంది చెబుతున్నదేంటంటే, అసలు కోచింగ్ అవసరం లేదని.
పూర్వం కమ్యూనికేషన్స్ పెద్దగా  లేనపుడు, లైబ్రరీలు పుస్తకాలు  అందుబాటులో లేనపుడు, సెలెక్టయిన వారితో ఇంటారాక్షన్ లేనపుడు కోచింగ్ సెంటర్లు సివిల్స్ ప్రిపరేషన్ కు ఓరియెంటేషేన్ ఇస్తాయని నమ్మే వారు.
ఇపుడు ఆన్ లైన్ మెటీరియల్ అందుబాటులోకి వచ్చాక, యు ట్యూబ్ లో సెలెక్టయిన వాళ్ల అనుభవాలు, ప్రిపరేషన్ పద్ధతులు  అందుబాటులోకి వచ్చాక కోచింగ్ సెంటర్ అవసరం లేదనే భావం చాలా మంది  వ్యక్తం చేస్తున్నారు.
కోచింగ్ సెంటర్ వ్యాపారం మాయలో పడవద్దని చెబుతున్నారు. వీళ్ల మాట విని, ఆన్ లైన్ లో దొరికే మెటిరియల్ అంతా చదవి, యూట్యూబ్  లో ఉన్న వీడియోలను పరిశీలించి, సొంతంగా ప్రిపేరవుతున్న వాళ్ల సంఖ్య బాగా పెరుగు ఉంది. అంతేకాదు, ఈ పద్ధతిలో సెలెక్టయిన వాళ్లు ఇతర అభ్యర్థులకు మార్గదర్శకంగా నిలబడుతున్నారు. వారిని ఇన్ స్పైర్ చేస్తున్నారు,వారికి రకరకాల సోషల్  మిడియా ద్వారా ఈ సందేశం చేరవేస్తున్నారు.
Dr MV Rao IAS
Dr MV Rao IAS/ twitter picture
ఇందులో  పశ్భిమబెంగాల్ చుకు చెందిన ఐఎఎస్ అధికారి డాక్టర్ ఎంవి రావు (1988 బ్యాచ్ ఐఎఎస్) ఒకరు. డాక్టర్ రావు ఉస్మానియా యూనివర్శిటీలో ఎమ్మె ఇంగ్లీష్ చేశారు. సివిల్స్ ఎంపికయ్యారు. పశ్చిమబెంగాల్ క్యాడర్ కు  వెళ్లారు. ఆమధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  నేషనల్ ఫిషరీస్ డెవెలప్ మెంట్ అధారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా సెంట్రల్ డెప్యూటేషన్ మీద పని చేశారు. డాక్టర్ రావు చిత్రమయిన అధికారి.  ఆయన మత్యకార్మికుల కాలనీలను అభివృద్ధి చేసేందుకు,వారి ఆదాయం పెంచేందుకు అహర్నిశలు కృషి చేశారు. ఆయన భార్యతో కలసి ఈ కాలనీలను సందర్శించేవారు. మత్య్సకారులకు పెట్రోమాక్స్ లైట్ల స్థానంలో సోలార్ ల్యాంపులు అందించారు. వాళ్లకాలనీల విద్యుదీకరణకు సాయపడ్డారు. వాళ్లు చేపలు అమ్ముకునేందుకు వాహనాలు ఏర్పాటు చేశారు. పాండ్ టు కిచెన్ పద్ధతిని  ప్రవేశపెట్టి మత్స్య ఉత్పత్తులను ఇళ్లకు నేరుగా చేరవేసేందుకు వ్యాన్ లను ప్రవేశపట్టారు.
ఆయనెపుడూ లబ్దిదారుల పక్షం నుంచే సమస్యను చూసేవారు. ఏదయినా పనిమీద సుదూర ప్రాంతాలనుంచి తన కార్యాలయానికి వచ్చే లబ్దిదారులు తన కార్యాలయంలో శ్రమపడకుండా పని పూర్తి చేసుకునే ఏర్పాటు చేశారు. వారికి భోజన వసతి ఏర్పాటు చేశారు.  ఎక్కడ పబ్లిషిటీ చేసుకోకుండా గుట్టు చప్పుకాకుండా పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు పనిచేస్తారు.
డాక్టర్ రావు ఈ సారి  జితిన్ యాదవ్ అనే ఐఎఎస్ ఆఫీసర్ ని ఇంటర్వ్యూ చేశారు.

My interaction with Jitin Yadav, young & brilliant IAS officer

We discuss in first episode, his experience in IAS so far and what attracted him to Civil Services

Stay tuned for second episode where we discuss in detail his preparation for Civil Services Exam! https://t.co/ESexdzaWHj pic.twitter.com/HmIhtBfIsw

— Dr. M V Rao, IAS (@mvraoforindia) February 7, 2022

జితిన్ యాదవ్ కూడా పశ్చిమబెంగాల్ కే చెందినయువ ఐఎఎస్ అధికారి. ఆయన ఇంటర్వ్యూ, అంతకు మందు జితిన్ మీద ‘బెటర్ ఇండియా’  వచ్చిన మరోక వ్యాసం సివిల్స్ ప్రిపేర్ అయ్యే వారికి బాగా ఉపయోగపడతాయి.
ఈ రెండింటిని పరిచయం  చేసి సివిల్ ప్రిపేర్ అవుతున్స ఔత్సాహికులకు ఆత్మస్థయిర్యాన్ని కల్పించడమే ఈ వ్యాసం ఉద్దేశం.
2
జితిన్ యాదవ్ ఏమంటున్నారంటే…
“చాలా మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ (CSE)ప్రిపేరయ్యేందుకు కోచింగ్ తప్పనసరి అనే భ్రమలో ఉంటారు. అయితే, ఆ భ్రమల్లోనుంచి బయటపడాలి. నేను బయటపడ్డాను. కోచింగ్ లేకుండా సివిల్స్ పరీక్షలకు ఎంపికయ్యాను. మొదట నేను కూడా  కోచింగ్ అనేది సివిల్స్ కు నిచ్చెన వేస్తుందనిఅనుకున్నారు. అందుకే ఢిల్లీ కరోలో బాగ్ లోకి ఒక కోచింగ్ సెంటర్ లో  చేరాను. ఇది 2012 నాటి మాట.   ఆ రోజుల్లోనే కోచింగ్ సెంటర్ కు రు. 60 వేలు చెల్లించాను. కోచింగ్ సెంటర్ ఇక తనని గమ్యం వైపు ఈజీగా నడిస్తుందని ఆశపడ్డాను.
కోచింగ్ సెంటర్ లో చెబుతున్నదేమీ లేదని నాకు నెలరోజులలోనే అర్థ మయింది. ఎందుకంటే, అక్కడ చెబుతున్నదంతా  నేను ఇంట్లో కూర్చునే నేర్చుకోవచ్చని అర్థమయింది. కొత్త దేమీ కనిపించలేదు.
కోచింగ్ సెంటర్లో వినే ఉపన్యాసాలకంటే స్నేహితులతో చర్చించడం వల్ల ఇంకా బాగా ప్రిపేర్ కావచ్చని నాకు అనిపించింది. కారణం,  కోచింగ్ సెంటర్ తీసుకుంటున్న టైం కంటే, సగంలో సమయంలోనే అక్కడ చెప్పే విషయాలను నేను సొంతంగా తెలుసుకునే   మార్గాలు ఇపుడు అందుబాటులో ఉన్నాయి.
కోచింగ్ సెంటర్ మానేసి, సొంతంగా ప్రిపేర్ కావడం మొదలుపెట్టాను. రెన్నెళ్లు సొంతంగా కష్టపడుతూనే సివిల్స్ ప్రిపరేషన్  ఎలా ఉండాలో నాకుఅర్థమయింది. సొంతంగా ప్రిపేర్ కావచ్చనే ధీమా కలిగింది.
నేనెక్కడ వీక్ గా ఉన్నానో ముందుగా గమనించాను. నాకేమీ తెలియదో ముందు తెసుకున్నాను.  ఏ రంగంమీద నాకుపట్టులేదో గుర్తించాను. అంతే, ఆవైపు నుంచి నరుక్కొచ్చాను.
ముందునా వీక్ నెస్ తెలుసుకున్ని దాన్నే స్ట్రెంగ్త్ గా మార్చకోవడం  మొదలుపెట్టాను. అంటే నేనెక్కడ వీక్ గా ఉన్నానో మొదట అక్కడ  మొదలు పెట్టాను. రిస్క్ టు రివార్డ్ (Risk to Award) అనే సూత్రం ఉందిగా. అదే నా మార్గదర్శకం.
ఒక టాపిక్ ను క్షుణ్ణంగా చదివి, దాంట్లో ఎన్నిరకాలు ప్రశ్నలు వేయవచ్చు, ఏ రకం ప్రశ్న వేసిన ఎలా సమాధానం చేయవచ్చనే విషయం గ్రహించాను. ఇక్కడ ఒక టాపిక్ మీద ఎంత సమయంలో కేటాయించాలనేది రిస్క్. రివార్డ్ వచ్చి ఎన్నిరకాల ప్రశ్నలు వేయవచ్చనే అవకాశాలు పసిగట్టడం.”
ఇలా ప్రిపేర్ కావడం వల్ల కోచింగ్ సెంటర్ కు వెళ్లాల్సిన అవసరమే ఉండదని ఆయన చెప్పారు. దీనికి ఆయన ఒక అనుభవం చెప్పారు. ఆయనకు బీహార్ క్యాడర్ కు చెందిన మహిళా ఐఎఎస్ అధికారి  ఒకరు కూతురికి కోచింగ్ అసవరం లేకుండా ఎలా గైడెన్స్ ఇచ్చారో వివరించారు. కూతురు రెండో దఫా సివిల్స్ కు ఎంపికయింది. 25 యేళ్ల కిందట తాను  సివిల్స్ రాయాలనుకున్నపుడు  దాని గురించి ఏమీ తెలియదు. స్టడీ మెటీరియల్ అందుబాటులో దు. పరీక్ష స్వరూపం తెలియదు. చెప్పే వాళ్లు కూడా ఎవరూ లేరు. అందువల్ల ఆమె ఢిల్లీకి వెళ్లడమే మార్గమని భావించి దేశరాజధాని వెళ్లి కోచింగ్ తీసుకున్నారు. ఐఎఎస్ కు ఎంపికయ్యారు.
ఇపుడు కూతురు సివిల్స్ రాయలనుకుంది. రాసింది. పరీక్ష పాసయింది. ఆమె ఏ కోచింగ్ తీసుకోలేదు. సివిల్స్ కు ప్రిపేరయ్యేందుకు అసవరమయిన సరుకంతా ఇంటర్నెట్ లో దొరుకుతున్నపుడు కోచింగ్ అవసరంలేదని, అందుకే తాను కోచింగ్ వెళ్లలేదని కూతురు చెప్పింది.
ఇలాంటి సివిల్స్ కు ఎంపిక వారందరిలో ఉన్న రహస్యమేమిటి? అనే దాని గురించి ఆయన ఆలోచించాడు. ఈ  సింపుల్ రహస్యం తెలియక వేలాది మంది సివిల్స్ యాస్పిరాంట్స్  కోచింగ్ మీద లక్షు తగేలేస్తుంటారని ఆయన జితిన్ యాదవ్ అన్నారు.
సివిల్స్ పరీక్ష ఎలా ఉంటుంది, ఏ మెటీరియల్ చదవాలి,  ఎలా చదవాలి అనేవి మొదట ఎవరికైనాఎదరయ్యే ప్రశ్నలు.
 వీటికి సమాధానం ఈ అమ్మాయి ఆన్ లైన్ లో కనుక్కుంది. సివిల్స్ అంటే అదొక పైకి ఎగాబాగాల్సిన మహా పర్వతం అనే భయం దీనితో పోయింది.
ఆన్ లైన్ లో సమాచారం దొరకగానే ఇక పరీక్ష రాయవచ్చన్న ధైర్యం వచ్చింది. తొలిరోజుల్లో ఈ పరీక్షలను అర్థం చేసుకునేందుకే చాలా సమయం ఆమె కేటాయించింది.  దీనికి ఎంపికయిన వారి ఇంటర్వ్యూ లు కూడా బాగా దోహదపడ్డాయి.
ఉచితంగా ఇంటర్నెట్ లో దొరికే ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ అన్నింటిని ఆమె పరిశీలించింది. సెలెక్ట్ అయిన వారు ఇచ్చే సలహాలేమిటో గ్రహించింది. వాళ్లు చెప్పే పుస్తకాలేమిటో , వెబ్ సైట్స్ ఏమిటో చూసింది. వీటి మీద చాలా సమయం కేటాయించినా అది రివార్డింగ్ గా ఉంది. దీనితో ఆమెలో సెల్స్ కాన్ఫిడెన్స్ పెరిగింది.
” A Coaching institute will teach me the same material and content which I can study on my own. So, what is the need to pay a hefty amount for something that I can already do myself sitting at home.” అని అమె చెప్పారు.
ఇన్ స్టిట్యూట్ కోచింగ్ ఎందుకు అవసరం లేదంటే….
  1. స్టడీ మెటీరియల్, గైడెన్స్, ఎగ్జామ్ సమాచారం అంత సులభంగా అందుబాటులో లేని రోజులలో సివిల్స్ కోచింగ్ ఇన్ స్టిట్యూట్ లు విపరీతంగా పుట్టుకొచ్చాయి.  ఇవి కొన్ని దశాబ్దాలు నడవడంతో సివిల్స్ పరీక్షలు పాస్ కావాలంటే ఎంతో అనుభవం ఉన్న ఈ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకోవాలనే భ్రమ కలిగించడంలో విజయవంతమయ్యాయి. చాలా మంది ఈ భ్రమల్లోనుంచి రాలేకపోతున్నారు. కాలం మారింది. స్టడీ మెటీరియల్, కంటెంట్, ప్రాపర్ గైడెన్స్ వగైరాలన్నీ ఇపుడు అన్ లైన్ లో ఉందుబాటులో ఉందన్న విషయం చాలా మంది గుర్తించడం లేదు.
  2. ఈ మధ్య కోచింగ్ తీసుకోకుండా ఐఎఎస్ కు ఎంపికయిన చాలా మంది తో నేను మాట్లాడాను. వీళ్లందరిలో ఒక కామన్ పాయింట్ నాకు కనిపించింది. ప్రిపరేషన్ మొదలు పెట్టినపుడు వాళ్లలో ఆత్మ విశ్వాసం బాగా తక్కువగా ఉండింది. ప్రిపరేషన్ లో మునిగిపోతూనే వాళ్లందరిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. దీనికి కారణం, ఒకే స్థాయిలోవారిలో గ్రోత్ మైండ్ సెట్ ఉంది. అంటే ఎవరైన మొదట అండర్ కాన్ఫిడెన్స్ తోనే ఉంటారని, దానిని నిదానంగా సొంతంగా ప్రిపేర్ అయి కూడా అధిగమించవచ్చనే విషయం వారు గ్రహించారు.
  3. అభ్యర్థులంతా సొంతంగా ప్రిపేర్ కావచ్చనే విశ్వాసం రావడం విజయానికి తొలిమెట్టు. అంటే ‘అయ్యో కోచింగ్ తీసుకోలేకపోయామే,’ అని లోలోన కుమిలిపోకుండా, సొంతంగా కూడా ప్రిపేర్ అయ్యేందుకుఇపుడు మార్గాలున్నాయి, వాటిని అన్వేషించాలనే పట్టుదల వీరందరిలో కనిపించింది.
  4. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ ఎకాడమీ ఆఫ్ అడ్మినిష్ట్రేషన్ (LBSNAA)లో శిక్షణ పొందుతున్న క్యాండిడేట్స్ తో మాట్లాడినపుడు నాకు ఒక గొప్ప విషయం అర్థమయింది. సెలెక్టయిన వారెవరికి కోచింగ్ లేనందున వచ్చిన నష్టమేమీ లేదు. వాళ్లు కష్టపడి  ప్రిపేరేషన్ మెలకువులు సాధించారు. లక్ష్యం సాధించాలనే పట్టుదల, కృషి వారికి బాగా ఉపయోగపడ్డాయి. కోచింగ్ సెంటర్ సాయం లేకుండానే వారంతా లక్ష్యం సాధించారు.  అందరికి నా సలహా ఏంటంటే, సివిల్స్ పాస్ అయ్యేందుకు కోచింగ్ కాదు ముఖ్యం  పట్టుదల, శ్రమ.కోచింగ్ తీసుకోకుండా సెలెక్టయిన వారందరి ప్రిపరేషన్ ఒకేలా ఉంది.  వాళ్ల అనుభవాలు ఫాలో అయితే, ఎవరయినా సొంతంగా సివిల్స్ ప్రిపేర్ కావచ్చు. మళ్లీ పాతపాటే పాడుతున్నా… ఇపుడు ఆన్ లైన్ లో దొరకనిదేదీలేదు. ఆన్ లైన్ దొరనిదానికంటే, కోచింగ్ సెంటర్లు కొత్తగా అందించేదీమీ లేదు. అదీ సంగతి

 

ఇది కూడా చూడండి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *